బధిరులు వినేందుకు.. సాఫ్ట్వేర్ సాయం!
లండన్: చెవిటివారు ఎదుటి వారి మాటలను వినేందుకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను లండన్‌కు చెందిన సైన్స్ రచయిత ఫ్రాంక్ స్వెయిన్ ఆవిష్కరించారు. ‘ఫాంటమ్ టెర్రెయిన్స్’ అనే ఈ సాఫ్ట్వేర్ ఐఫోన్‌తో పనిచేస్తుంది. అనవసర శబ్దాలను కూడా ఇది ఆటోమేటిక్‌గా పరిహరిస్తుందట. ఈ సాఫ్ట్వేర్ తొలుత ఐఫోన్ వై-ఫై సెన్సర్ల ద్వారా సమీపంలోని సిగ్నళ్లను గ్రహిస్తుంది. తర్వాత ఆ సమాచారాన్ని శబ్దాలుగా మలిచి వినికిడి పరికరాలకు వైర్‌లెస్‌గా అందిస్తుంది.