free books
-
Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీపికబురు..
సాక్షి, భువనగిరి(నల్లగొండ): తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో కొత్త ప్రవేశాలు పొందిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. రెండేళ్లనుంచి ముందస్తుగానే సరఫరా చేయడంతో పుస్తకాల కొరత లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోధన సాఫీగా సాగుతుంది. వేసవిలోనే జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు పంపింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలను జిల్లా గోదాంలో నిల్వ చేశారు. జిల్లాకు 3,30,000 పుస్తకాలు జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత, మోడల్ పాఠశాలలతో పాటు సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 3,30,000 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన 9,000 పాఠ్యపుస్తకాలు గోదాంలో మిగిలి ఉన్నాయి. ఇంకా జిల్లాకు 3,21,000 జిల్లాకు రావల్సి ఉండగా 1,29,150 రాగా మరో 1,91,850 పుస్తకాలు రావాల్సి ఉంది. కరోనా విజృంభణ, లాక్డౌన్ కారణంగా జూన్ 2న ప్రారంభించాల్సిన పాఠశాలలను ఈ నెల 15కు వాయిదా వేశారు. కాగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించి పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఆన్లైన్ తరగతులకు అలవాటు పడిన విద్యార్థులు అదే మాదిరిగా ఈ సారి కూడా పాఠాలు వినేలా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.1 నుంచి 10వ తరగతుల అన్ని పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను దృశ్య రూపంలో చూసి అర్థం చేసుకునేలా తయారు చేశారు. గత సంవత్సరం కొన్ని తరగతుల సైన్స్ పుస్తకాలు ఇలా ఉండగా ఈ సారి అన్ని పుస్తకాల్లోని పాఠాలను చూసేలా అవకాశాన్ని కల్పించారు. ఇందు కోసం ప్రతి పుస్తకంపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఫోన్ ద్వారా ఆ కోడ్ స్కాన్ చేస్తే అందులో ఉన్న పాఠ్యాంశ్యాన్ని దృశ్యంలో చూడవచ్చు. ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం 2021–22 విద్యా సంవత్సరానికి జిల్లా అవసరమైన ఉచిత పాఠ్య పుస్తకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రతిపాదనలకు అనుగుణంగా పుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,29,150 పుస్తకాలు వచ్చాయి. వచ్చిన పుస్తకాలను పాఠశాల ప్రారంభానికి ముందే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీకి చర్యలు తీసుకుంటాం. –చైతన్య జైని, డీఈఓ చదవండి: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు -
ఈ ఏడాది పాత పుస్తకమే!
కొత్తవి లేవంటున్న ప్రభుత్వం ► పాతవాటిని విద్యార్థులనుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ► ఇప్పటి వరకు ఇండెంట్ పంపని వైనం ► కళాశాలలు తెరచుకునేలోపువచ్చేది అనుమానమే ► ఇంటర్ విద్యార్థులకు తప్పని కష్టాలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్మీడియట్ ఉచిత పుస్తకాల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. గత సంవత్సరం విద్యార్థులకు ఇచ్చిన పాత పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అలా వసూలైన పాత పుస్తకాలనే ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇవ్వాలని, ఆపైన తక్కువ వచ్చిన వాటికి మాత్రమే ఇండెంట్‌ను పంపాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కళాశాలలు తెరచేనాటికి ఉచిత ఇంటర్ పుస్తకాలు పంపిణీకి నోచుకునేది కష్టంగా కనిపిస్తోంది. సర్దుబాటు చేసుకోవాలని ఆదేశాలు.. ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2015-16 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లకు కలిపి మొత్తం 21850 మంది విద్యార్థులకుగాను 1.48 లక్షల పుస్తకాలను కేటాయించారు. ఇందులో 5181 పుస్తకాలు మిగిలాయి. వీటికితోడు ప్రస్తుతం సెకండియర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన, పాత పుస్తకాలతో సర్దుబాటు చేయగా ఏమైనా తక్కువ పడితే మళ్లీ ఇండెంట్ పంపాలని ఇంటర్ బోర్డు కోరింది. జూన్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలల పునఃప్రారంభం జూనియర్ కళాశాలల పునః ప్రారంభం నాటికి విద్యార్థులకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేయాలన్నది ఇంటర్ బోర్డు ఆలోచన. జూన్ ఒకటో తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసేది అనుమానంగా కనిపిస్తోంది. విద్యార్థుల నుంచి పాత పుస్తకాలను వసూలు చేయాలంటే కనీసం నెలన్నర సమయం పట్టే అవకాశం ఉంది. అనుకున్నట్లుగా కొన్ని పుస్తకాలైన వెనక్కి వస్తే కొందరికి పంపిణీ చేయవచ్చు. మిగిలిన విద్యార్థుల కోసం ఆ సమయంలో ప్రభుత్వానికి ఇండెంట్ పంపితే ఎప్పుడు వస్తాయనేది అర్థంకావడం లేదు. పుస్తకాలను వెనక్కి తీసుకోవడం కొంచెం కష్టమే: గత సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఇప్పుడు వాటిని విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫస్టియర్ విద్యార్థుల నుంచి తీసుకోవచ్చు. ఇంటర్ పూర్తై విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవడం కొంచెం కష్టం. టీసీ, మార్కుల జాబితాలు ఇవ్వమని బలవంతం చేయాల్సి వస్తుంది. - లాలెప్ప, కేవీఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పాత పుస్తకాలను వెనక్కి ఇస్తారా? విద్యార్థులను తీసుకున్న పుస్తకాలను పూర్తిస్థాయిలో వెనక్కి ఇస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫెయిల్ అయిన వారికి పుస్తకాలు అవసరం కాగా, పాసైన వారు వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్ బోర్డు పుస్తకాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ ఎంట్రెన్స్‌ల కోసం నిర్వహించే ఎంసెట్/నీట్ పరీక్షల కోసం వీటిలోని పాఠ్యాంశాలనే చదవాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో సెకండియర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల నుంచి పుస్తకాలను ఎలా వసూలు చేసుకోవాలో తెలియడం లేదని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు వాపోతున్నారు. -
టాపర్ల భవిత ఉజ్వలం
* సీఎం జయలలిత ఆకాంక్ష * ర్యాంకర్లకు సత్కారం * నగదు ప్రోత్సాహం సాక్షి, చెన్నై: రాష్ట్రంలో విద్యాభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యార్థులను ప్రోత్సహించే విధంగా పథకాలు అమల్లో ఉన్నాయి. ఉచిత విద్యా, ఉచిత బస్సు పాసులు, ఉచిత పుస్తకాలు, యూని ఫాం, షూ, పాదరక్షలు, సైకిళ్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా విద్యార్థులను బడి బాట పట్టించే విధంగా సంక్షేమ పథకాలను అందజేస్తూ వస్తున్నారు. ప్రతి ఏటా ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకుని తమిళ మాధ్యమంతో పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో ర్యాంకులు సాధించే విద్యార్థులను స్వయంగా సీఎం సత్కరించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా 2013-14కు గాను పదో తరగతి, ప్లస్ టూ పరీక్షల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు శుక్రవారం ఉదయం సచివాలయంలో నిరాడంబరంగా సత్కారం చేశారు. ప్రోత్సాహం: ఇది వరకు మొదటి మూడు ర్యాంకులు సాధించే విద్యార్థులకు నగదు ప్రోత్సాహం అందించే వారు. అయితే, ఈ ఏడాది తొలి ర్యాంకులోనే 19 మంది విద్యార్థులు ఉండడంతో, టాపర్లను మాత్రమే సత్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 19 మంది విద్యార్థులకు తలా రూ.25 వేలు చొప్పున సీఎం జయలలిత అందజేశారు. ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుంటూ మొద టి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తలా రూ.10 వేలు చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలల్లో తొలి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి రూ.25 వేలు చొప్పున, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుంటూ తొలి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ.5 వేలు చొప్పున, అటవీ శాఖ పరిధిలోని పాఠశాలల్లో చదువుకుంటూ మొదటి ర్యాంకులో నిలిచిన ఒక విద్యార్థికి రూ.25 వేలు అందజేశారు. మొత్తంగా పదో తరగతిలో మొదటి ర్యాంకు సాధించిన 28 మంది విద్యార్థులకు ఆరు లక్షల పదిహేను వేలు నగదు ప్రోత్సహం అందజేశారు. ప్రశంసా పత్రాల్ని అందజేశారు. ఈ విద్యార్థుల ఉన్నత చదువుల బాధ్యతలను ప్రభుత్వం భరించనున్నది. ప్లస్ టూ: పదో తరగతి విద్యార్థుల సత్కారం అనంతరం ప్లస్‌టూలో మొదటి ర్యాంకులో నిలిచిన విద్యార్థులను సీఎం జయలలిత సన్మానించారు. మొదటి ర్యాంకు విద్యార్థికి రూ. 50 వేలు, మైనారిటీ, వెనుకబడిన సంక్షేమ పాఠశాలల్లో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి రూ.50వేలు, ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో చదువుకున్న మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు రూ.10వేలు చొప్పున, ప్రత్యేక ప్రతిభావంతుల స్కూళ్లలో మొదటి ర్యాంకు సాధించిన ఒక అంధ విద్యార్థికి, ఒక బధిర విద్యార్థికి తలా రూ. 50 వేలు సీఎం జయలలిత అందజేశారు. అలాగే, సాంఘిక సంక్షేమ, పౌష్టికాహార పథకం, ప్రభుత్వ సేవా ఇల్లంలో చదువుకుని మొదటి ర్యాంకు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 6 వేలు చొప్పున, అటవీ శాఖ పాఠశాలల్లో మొదటి ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు తలా రూ. 50 వేలు అందజేశారు. మొత్తంగా 14 మంది మొదటి ర్యాంకర్లకు నాలుగు లక్షల 92 వేలు నగదు ప్రోత్సాహం పంపిణీ చేశారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులందరితో సీఎం జయలలిత ముచ్చటించారు. అందరికీ మంచి భవిష్యత్తు ఉందని, ఉన్నత చదువుల్లో మరింతగా రాణించాలని కాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి వలర్మతి, సుబ్రమణియన్, కేసీ వీరమని, ఎంఎస్ఎం ఆనందన్, అబ్దుల్ రహీం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్, సలహాదారు షీలా బాలకృష్ణన్, పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి సబిత తదితరులు పాల్గొన్నారు.