G. Jagadish Reddy
-
విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు కేసీఆర్ బహిరంగంగా సమాధానం ఇచ్చారన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు.నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలని చెప్పారన్నారు. కానీ 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డికి పేరు ఉందని, చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెబుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ స్వతంత్ర కమిషన్ అని, అది ఇచి్చన తీర్పు ఫైనల్ అన్నారు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు ఏమైనా లంచం ఇచ్చారా.బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయని, తెలంగాణ మాత్రం యూనిట్‌కు రూ.3.90 పెట్టి విద్యుత్ తీసుకున్నట్టు వివరించారు. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆరీ్టపీసీ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు.పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించినట్టు తెలిపారు. కేసీఆర్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని, రేవంత్‌రెడ్డి మోదీ లైన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి మాటలను పట్టించుకోమని, పీసీసీ పదవి డబ్బులతో రేవంత్ తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి అనలేదా అని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. -
దళితులకు 10 వేల ఎకరాల భూపంపిణీ
♦ నవంబర్, డిసెంబర్లో అందజేస్తాం ♦ ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మంత్రి జగదీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: దళితులకు భూ పంపిణీలో భాగంగా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లలో 10 వేల ఎకరాల భూమిని లబ్ధిదారులకు అందజేయనున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ఇప్పటి వరకు 8 వేల ఎకరాల భూమిని పంపిణీ చేసినట్లు చెప్పారు. పంపిణీ చేసిన భూమిని పూర్తిస్థాయిలో సాగులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు. గతంలో పంపిణీ చేసిన భూమికి త్వరలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని వివరించారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. దేశం చూపు తెలంగాణ వైపు రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఏకకాలంలో అమలు కావడం గొప్ప విషయం. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. ఉద్యమ పార్టీకి పాలన అనుభవం లేదని, తెలంగాణ విడిపోతే రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారవుతుందని గతంలో కొందరు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ప్రభావితం చేసే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అనుమానాలు, అపోహలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. రెండేళ్లలోనే దేశంలోనే ప్రభావవంతమైన సీఎంగా నిలిచారు. ప్రభుత్వం ఇప్పటికే పంపిణీ చేసిన భూమిని లబ్ధిదారులైన ఎస్సీ మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసే విషయంలో అధికారుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంపిణీ చేసిన భూమి అభివృద్ధి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. బోర్లు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించినా పెద్దగా ఉపయోగం లేని పరిస్థితులున్నందున పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాం. ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సంక్షేమంలో మేమే ముందు.. కేవలం దళితులకే కాకుండా ఎవరూ ఊహించని విధంగా అన్ని వర్గాలకు మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. దళితుల అభివృద్ధికి అనేక పథకాలు తెచ్చింది. మూడెకరాల భూపంపిణీతోపాటు కల్యాణలక్ష్మి వంటి పథకాలను తెచ్చాం. దళితులకు మూడెకరాల భూమి, బడుగు, బలహీన వర్గాలకు కల్యాణలక్ష్మి, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ప్రతి ఒక్కరికీ 6 కే జీల బియ్యం,అన్ని జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్లు, 10 వేల మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.10 లక్షల వరకు రుణం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒకేసారి 250 గురుకుల పాఠశాలలు, అందులో ఎస్సీలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, ఎస్సీ గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిని మించిన శిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా శిక్షణ కార్యక్రమాలు, విద్యార్థులకు వినూత్నంగా గుర్రపు స్వారీ, స్టాక్ ఎక్స్ఛేంజ్ వంటి వాటిపై అవగాహన వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఒక్క రూపాయీ దుర్వినియోగం కాకూడదు.. గత ప్రభుత్వం రూ.2 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల ను అప్పగించింది. సీఎం ఇప్పటికే రెండేళ్ల బకాయిలన్నీ చెల్లించేందుకు రూ.3వేల కోట్లకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చింది. ఈ పథకం కింద ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదనేది సీఎం ఉద్దేశం. దళితులకు, ఇతర అణగారిన వర్గాలకే ఈ మొత్తం చెందాలనేది ప్రభుత్వ ఆలోచన.