G Kamalini
-
చరిత్ర సృష్టించిన భారత క్రికెటర్
అండర్-19 టీమిండియా స్టార్ క్రికెటర్ జి.కమలిని(G Kamalini) సరికొత్త రికార్డు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్(WPL) చరిత్రలో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా నిలిచింది. గుజరాత్ జెయింట్స్ వుమెన్‌తో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ వుమెన్ తరఫున ఈ తమిళనాడు క్రికెటర్ మంగళవారం(ఫిబ్రవరి 18) డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టింది. ఓటమితో మొదలుపెట్టిన ముంబైకాగా గత శుక్రవారం(ఫిబ్రవరి 14) డబ్ల్యూపీఎల్-2025 ఎడిషన్ మొదలైన విషయం తెలిసిందే. మూడో సీజన్లో తొలుత గుజరాత్ జెయింట్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు జట్టు విజేతగా నిలవగా.. శనివారం నాటి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ కాప్యిటల్స్ చేతిలో ఓడిపోయింది.అనంతరం ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్- యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ గెలుపొందింది. ఆ తర్వాత సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టును ఎదుర్కొన్న బెంగళూరు టీమ్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మ్యాచ్‌లో గుజరాత్- ముంబై తలపడుతున్నాయి.ఇద్దరు ప్లేయర్ల అరంగేట్రంవడోదరలోని కొటాంబి స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ వుమెన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక టాస్ సందర్భంగా ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేస్తున్నట్లు వెల్లడించింది. సైకా ఇసాక్ స్థానంలో పరుణిక సిసోడియా(Parunika Sisodia) జట్టులోకి వచ్చినట్లు తెలిపిన హర్మన్.. కమలినికి కూడా తుదిజట్టులో చోటు ఇచ్చినట్లు పేర్కొంది.ఈ క్రమంలో కమలిని అత్యంత చిన్న వయసులో డబ్ల్యూపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ప్లేయర్‌గా నిలిచింది. పదహారేళ్ల 213 రోజులు వయసులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మహిళల టీ20 లీగ్‌లో అడుగుపెట్టింది. ఇటీవల మలేషియా వేదికగా ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులో కమలిని సభ్యురాలు.ఓపెనర్‌గా బరిలోకి దిగిన కమిలిని ఈ మెగా టోర్నమెంట్లో రెండు అర్ధశతకాలతో మెరిసింది. మరోవైపు.. పరుణిక సిసోడియా కూడా వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్‌లో మెంబర్. టోర్నీ మొత్తంలో కలిపి పది వికెట్లు కూల్చి భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఇక ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున డబ్ల్యూపీఎల్‌లో ఒకేసారి అరంగేట్రం చేయడం విశేషం.డబ్ల్యూపీఎల్‌లో చిన్న వయసులో అరంగేట్రం చేసిన క్రికెటర్లు👉జి.కమలిని(ముంబై ఇండియన్స్)- 16 ఏళ్ల 213 రోజుల వయసులో- గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం- 2025👉షబ్నం షకీల్(గుజరాత్ జెయింట్స్)- 16 ఏళ్ల 263 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2024👉పార్శవి చోప్రా(యూపీ వారియర్స్)- 16 ఏళ్ల 312 రోజుల వయసులో ముంబై ఇండియన్స్ మీద- 2023👉వీజే జోషిత(ఆర్సీబీ)- 18 ఏళ్ల 205 రోజుల వయసులో గుజరాత్ జెయింట్స్ మీద అరంగేట్రం-2025👉అలిస్ కాప్సే(ఢిల్లీ క్యాపిటల్స్)- 18 ఏళ్ల 206 రోజుల వయసులో ఆర్సీబీ మీద అరంగేట్రం- 2023.డబ్ల్యూపీఎల్-2025: గుజరాత్ వర్సెస్ ముంబై తుదిజట్లుముంబైయాస్తికా భాటియా(వికెట్ కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జి.కమలిని, అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జోత్ కౌర్, సంస్కృతి గుప్తా, షబ్నమ్ ఇస్మాయిల్, పరుణిక సిసోడియా.గుజరాత్లారా వోల్వార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), దయాళన్ హేమలత, ఆష్లీ గార్డనర్(కెప్టెన్), హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సిమ్రాన్ షేక్, తనూజా కన్వర్, సయాలీ సత్ఘరే, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.చదవండి: CT 2025: షెడ్యూల్, జట్లు, మ్యాచ్ ఆరంభ సమయం.. లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్
ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025) టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు కొనసాగుతోంది. లీగ్ దశ, సూపర్ సిక్స్ దశల్లో సత్తా చాటుతూ జైత్రయాత్రను కొనసాగించిన మన అమ్మాయిలు.. సెమీ ఫైనల్లోనూ అదరగొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి భారత్ ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టింది.కౌలలంపూర్లోని బేయూమస్ ఓవల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్(India Women U19 vs England Women U19) మధ్య వరల్డ్‌కప్-2025 రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ అండర్-19 మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.ఓపెనర్ డెవీనా పెరిన్ 45 పరుగులతో సత్తా చాటగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ జెమీమా స్పెన్స్ మాత్రం తొమ్మిది పరుగులకే పరిమితమైంది. ఇక కెప్టెన్ అబీ నొర్గ్రోవ్ 30 పరుగులతో రాణించగా.. లోయర్ ఆర్డర్లో అమూ సురేన్‌కుమార్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. పరుణిక, వైష్ణవి తీన్మార్మిగతా వాళ్లలో ట్రూడీ జాన్సన్ డకౌట్ కాగా.. చార్లెట్ స్టబ్స్ (4), కేటీ జోన్స్ (0), ప్రిషా తానావాలా(2), చార్లెట్ లాంబర్ట్(0) కూడా పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో పరుణిక సిసోడియా, వైష్ణవి శర్మ మూడేసి వికెట్లతో చెలరేగగా.. ఆయుశీ శుక్లా రెండు వికెట్లు పడగొట్టింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం ఒక్క వికెట్ నష్టపోయి పనిపూర్తి చేసింది.కమలిని హాఫ్ సెంచరీ.. త్రిష ధనాధన్ఓపెనర్ జి. కమలిని(G Kamalini) అర్ధ శతకం(50 బంతుల్లో 56 రన్స్, నాటౌట్)తో మెరవగా.. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతున్న గొంగడి త్రిష 29 బంతుల్లో 35 పరుగులతో రాణించింది. ఇక తెలుగమ్మాయి త్రిషను ఇంగ్లండ్ బౌలర్ ఫోబే బ్రెట్ అవుట్ చేయగా.. కమలినికి తోడుగా వన్‌డౌన్‌లో ఆడిన సనికా చాల్కె 11 పరుగులతో అజేయంగా నిలిచింది. 15వ ఓవర్లో కమలిని ఫోర్ బాదడంతో భారత్ విజయం ఖరారైంది. పరుణికకుప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది. ఇక తొలి సెమీస్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. ఆసీస్‌ను చిత్తు చేసి తొలి ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆదివారం భారత్- సౌతాఫ్రికా మధ్య ఫైనల్ జరుగుతుంది.ఐసీసీ మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్-2025- రెండో సెమీ ఫైనల్భారత్ వర్సెస్ ఇంగ్లండ్- స్కోర్లుఇంగ్లండ్- 113/8 (20)భారత్- 117/1 (15)ఫలితం- ఇంగ్లండ్‌పై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్లో భారత్.చదవండి: టీ20 ప్రపంచకప్-2025: ఆసీస్‌ను చిత్తు చేసి ఫైనల్లో సౌతాఫ్రికా -
U19 Asia Cup 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్‌తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
వయసు 16 ఆట ఖరీదు 1.6 కోట్లు
తమిళనాడుకు చెందిన ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసు వరకూ స్కేటింగ్ చేసింది. అదృష్టమో దురదృష్టమో లాక్డౌన్ వచ్చింది. బోర్ కొట్టి బ్యాట్ అందుకుంది. సరిగ్గా నాలుగేళ్లు. డబ్ల్యూపీఎల్ ఆక్షన్‌లో 10 లక్షలు పలికితే గొప్పనుకుంటే కోటీ అరవై లక్షలు పలికింది. అద్భుతమైన ప్రతిభ, కృషి ఉంటే విధిని తిరగరాయొచ్చని చెబుతుంది జి.కమలిని.మొన్నటి ఆదివారం (డిసెంబర్ 15) ఏం జరిగిందో తెలుసా? కౌలాలంపూర్‌లో మహిళల అండర్–19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్–ఇండియాల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్‌లో పాకిస్తాన్ బ్యాటర్స్ రన్స్ కోసం బాల్‌ను బాదినప్పుడల్లా వికెట్స్ వెనుక నుంచి ఆ అమ్మాయి గట్టిగట్టిగా కేకలు వేస్తూ బాల్‌ను విసరమని ఫీల్డర్లను ఉత్సాహపరుస్తోంది. ఆ అమ్మాయి హుషారు ప్రేక్షకులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం టార్గెట్‌ను ఛేదించే బాధ్యత ఇండియన్స్‌ది. వికెట్‌కీపర్‌గా ఉన్న అమ్మాయి ఇప్పుడు బ్యాట్ పట్టుకొని క్రీజ్ మీదకు వచ్చింది. అంతవరకే గుర్తుంది... అందరికీ. ఆ తర్వాత ఆ అమ్మాయి కొడుతున్న షాట్లకి గతం భవిష్యత్తు మర్చిపోయి వర్తమానంలో మునకలేశారు. షాట్ షాట్‌కు కేరింతలే. మొత్తం 44 రన్స్ చేసిందా అమ్మాయి. లాస్ట్ బంతిని భారీ సిక్స్ కొట్టి ఆట ముగించింది.కౌలాలంపూర్‌లో ఇలా ఆట ముగుస్తున్న సమయానికి బెంగళూరులో డబ్ల్యూపీఎల్ కోసం మహిళా క్రికెటర్ల ఆక్షన్ జరుగుతోంది. ఇదే అమ్మాయి పేరును పిలిచారు. అంతవరకూ ఆమె 10 లక్షల రూపాయలకు వేలంలో దక్కుతుందని అందరూ భావించారు. కాని కౌలాలంపూర్ ఆట ప్రభావం చూపింది. ముంబై ఇండియన్స్ టీమ్, ఢిల్లీ కాపిటల్స్ టీమ్ పాట పెంచుతూ పోటీ పడ్డాయి. చివరకు కోటీ అరవై లక్షలతో ఆక్షన్ ముగిసి ఆ అమ్మాయి ముంబై ఇండియన్స్ జట్టు భాగస్వామి అయ్యింది. ఒకేరోజు ఇలా కౌలాలంపూర్‌లో ఇటు బెంగళూరులో మార్మోగిన ఆ అమ్మాయి పేరు కమలిని. వయసు 16.మదురై అమ్మాయికమలినిది మధ్యతరగతి కుటుంబం. మదురైలో ఉండేది. స్కేటింగ్ నేర్చుకుంటూ హుషారుగా ఉండే కమలిని 12 ఏళ్ల వరకు క్రికెట్ జోలికే వెళ్లలేదు. 2022లో కరోనా రావడంతో లాక్డౌన్ వచ్చి ఆమె తండ్రి గుణాలన్ కాలక్షేపానికి కొడుకుతో వీధిలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. ఒకరోజు కమలినిని పిలిచి నువ్వు బౌలింగ్ చెయ్ అన్నాడాయన. కమలిని బౌలింగ్ చేస్తే దిమ్మెర పోయాడు. అలా ఆ వయసులో అలా బౌలింగ్ చేసే పిల్లలు లేరు. కమలినికి ఇది సహజసిద్ధంగా వచ్చిందని గ్రహించిన తండ్రి మరి ఆలస్యం చేయలేదు. మరుసటి సంవత్సరమే చెన్నై కాపురం మార్చి‘చైన్నె సూపర్‌కింగ్స్ అకాడెమీ’లో చేర్చాడు. అక్కడ ఆమె ప్రతిభ గమనించి వెంటనే ‘తమిళనాడు అండర్–19’లోకి తీసుకున్నారు. విమెన్స్ అండర్ 19 టి 20 కప్‌లో 8 మేచెస్లో 311 పరుగులు కొట్టింది కమలిని. అంతేకాదు సిక్సర్ల కమలినిగా పేరు ΄పొందింది. ఆమె సిక్స్‌కు బాల్ని లేపితే బౌండరీ దాటాల్సిందే.తండ్రి అంటే ప్రేమకమలినికి తండ్రంటే చాలా ప్రేమ. ఆయనకు గుండె సమస్య తలెత్తితే తల్లడిల్లిపోయింది కమలిని. ‘మా నాన్నంటే నాకు చాలా ఇష్టం’ అంటుంది. ఆ సమయంలో ఆటమీద మనసు లగ్నం చేయలేకపోయింది. అయితే తండ్రికి సర్జరీ అయ్యి ఇంకేం పర్వాలేదని డాక్టర్లు చె΄్పాక ఆ మరుసటి రోజే తమిళనాడు– ఆంధ్రల మధ్య మ్యాచ్ ఉంటే చెలరేగి సెంచరీ బాదింది కమలిని. ప్రతిభ, తల్లిదండ్రుల ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రోత్సాహం సమృద్ధిగా ఉన్న ఈ అమ్మాయి మున్ముందు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తుంది. -
ఆశ్చర్యం.. అనూహ్యం.. వారిపై కోట్ల వర్షం
షేక్ సిమ్రన్ బాను, కమిలిని, ప్రేమా రావత్ వీళ్ల పేర్లు మనకే కాదు... ప్రస్తుత భారత మహిళల జట్టు ప్లేయర్లకూ తెలియదు. ఎందుకంటే వీరెప్పుడు జాతీయ జట్టుకు ఆడలేదు. అసలు ఎంపికే కాలేదు. అలాగని జోనల్ ఈవెంట్లలో దంచేసిన రికార్డులేం లేవు. మైదానంలో పెద్దగా ఆడింది లేదు... ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొంది లేదు. అయినా సరే రెండు గంటల వేలంలో కోటీశ్వరులయ్యారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) విశ్లేషకులు సైతం నివ్వెరపోయెలా వారి కొనుగోలు జరిగింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం ఒకింత ఆశ్చర్యంగా.. అనూహ్యంగా జరిగిపోయింది. జాతీయ స్థాయిలో భారత జట్టు తరఫున ఆడిన క్రికెటర్లను పట్టించుకోని ఫ్రాంచైజీలు కనీసం దేశవాళీ క్రికెట్లోనూ కనిపించని ప్లేయర్లపై భారీ మొత్తమే ఖర్చు చేశాయి. అన్క్యాప్డ్ ప్లేయర్లను అందలం ఎక్కించాయి.పేలవంగా ఆడిన ప్లేయర్‌కు భారీ ధరబెంగళూరులో ఆదివారం జరిగిన ఈ వేలంలో 22 ఏళ్ల ముంబై బ్యాటర్ షేక్ సిమ్రన్ బానుకు ఏకంగా రూ. 1 కోటీ 90 లక్షలు లభించాయి. మినీ వేలంలో మేజర్ అమౌంట్ ఆమెకే దక్కింది. గుజరాత్ జెయింట్స్ ఆమె కోసం అంతమొత్తం వెచ్చించింది. అలాగనీ ఆమె ఒక మెరుపు బ్యాటర్గానీ, నిప్పులు చెరిగే బౌలర్ కానీ కాదు. రెండేళ్ల క్రితం 2022 సీజన్లో యూపీ వారియర్స్ తరఫున పేలవంగా ఆడి నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో 29 పరుగులే చేసింది. దీంతో తర్వాత రెండు రెండు సీజన్లకు పక్కన బెట్టారు. ఇప్పుడేమో జెయింట్స్ పెద్దమొత్తానికి ఆమెను అక్కును చేర్చుకోవడం విశేషం.టీనేజ్ వికెట్‌కీపర్ బ్యాటర్‌కూ జాక్పాట్ఇక ముంబై ఇండియన్స్ కూడా 16 ఏళ్ల టీనేజ్ వికెట్‌కీపర్ బ్యాటర్ జి.కమలినిని రూ. 1 కోటి 60 లక్షలతో కొనుగోలు చేసింది. తమిళనాడుకు చెందిన ఆమె భారత అండర్–19 జట్టు తరఫున అది కూడా వేలం జరిగిన రోజే (ఆదివారం కౌలాలంపూర్‌లో ఆసియా కప్ అండర్–19 టోర్నీ) ఒక మ్యాచ్ ఆడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 44 పరుగులు చేసింది.మరోవైపు.. 23 ఏళ్ల ఉత్తరాఖండ్ లెగ్‌స్పిన్ ఆల్‌రౌండర్ ప్రేమా రావత్‌ను వేలంలో రూ. 1 కోటి 20 లక్షలకు పాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దక్కించుకుంది. రూ. కోటి పైచిలుకు పలికిన ఈ ముగ్గురు క్రికెటర్ల బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు. కానీ మినీ వేలం వారి పాలిట మెగా జాక్‌పాట్‌గా మారింది.వారి వైపు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదుఇక వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్ రూ. కోటి మార్క్ దాటిన ఏకైక విదేశీ ప్లేయర్. రూ. 1 కోటి 70 లక్షలకు ఆమెను గుజరాత్ జెయంట్స్ కొనుక్కుంది. 33 ఏళ్ల వెటరన్ కరీబియన్ క్రికెటర్ బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు కాగా... యూపీ వారియర్స్, గుజరాత్‌లు పోటీపడ్డాయి.గతంలో ఆమెను (2023 సీజన్) రూ. 60 లక్షలకు గుజరాత్ జెయింట్స్ దక్కించుకున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టీమిండియా ప్లేయర్లు స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్‌లపై ఐదు ఫ్రాంచైజీలు కన్నెత్తి చూడలేదు. కనీస ధరకైనా ఎవరూ తీసుకోకపోవడంతో వీరంతా అన్‌సోల్డ్ (అమ్ముడుపోని) క్రికెటర్లుగా మిగిలిపోయారు. వేలం తర్వాత ఫ్రాంచైజీలకు మిగిలింది?వేలానికి ముందు 15 మందిని అట్టిపెట్టుకున్న యూపీ వారియర్స్ ముగ్గురు ప్లేయర్లను తక్కువ ధరకే తీసుకొని మినీ వేలంలో మమ అనిపించింది. అలనా కింగ్ (రూ. 30 లక్షలు), క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు), ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు)... ఈ ముగ్గురికి కలిపి రూ. అరకోటి మాత్రమే ఖర్చు చేసింది. మొత్తం పర్సు రూ. 15 కోట్లు కాగా... అందరికంటే తక్కువగా రూ. 11 కోట్ల 60 లక్షలు ఖర్చు చేసిన ఈ ఫ్రాంచైజీ అందరికంటే ఎక్కువ (రూ.3 కోట్ల 40 లక్షలు) మొత్తాన్ని మిగుల్చుకుంది. గుజరాత్ (రూ.14 కోట్ల 60 లక్షలు) ఎక్కువగా ఖర్చు చేసింది. ఆ ఫ్రాంచైజీ వద్ద కేవలం రూ. 40 లక్షలే మిగిలున్నాయి. ఇక ఆర్సీబీ రూ. 13 కోట్ల 25 లక్షలు వెచ్చించి రూ. 1 కోటి 75 లక్షలు మిగుల్చుకుంది. రూ. 13 కోట్ల 35 లక్షలు ఖర్చు చేసిన ఢిల్లీ ఖాతాలో రూ. 1 కోటి 65 లక్షలు మిగిలున్నాయి. ముంబై రూ. 14 కోట్ల 55 లక్షలు ఖర్చు పెట్టింది. కేవలం రూ. 45 లక్షలే ఆ ఫ్రాంచైజీ వద్ద ఉన్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ కూడా గరిష్ట సభ్యుల సంఖ్య (18)ను భర్తీచేసుకున్నాయి.మూడు ముక్కల్లో... ఇది వచ్చే 2025 సీజన్‌కు ముందు మినీ వేలం. 91 మంది భారతీయులు, 29 మంది విదేశీయులు కలిపి మొత్తం 124 మంది వేలానికి వచ్చారు. ఇందులో ఐదుగురు విదేశీ ప్లేయర్లు సహా 19 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు రూ. 9.05 కోట్లకు కొనుక్కున్నాయి. అమ్ముడైన క్రికెటర్లు వీరే... (గరిష్టం నుంచి కనిష్ట వరుసలో) సిమ్రన్ బాను (రూ. 1.90 కోట్లు; గుజరాత్) డియాండ్రా డాటిన్ (రూ. 1.70 కోట్లు; గుజరాత్) కమలిని (రూ. 1.60 కోట్లు; ముంబై) ప్రేమా రావత్ (రూ. 1.20 కోట్లు; బెంగళూరు) శ్రీచరణి (రూ. 55 లక్షలు; ఢిల్లీ) నడిన్ డిక్లెర్క్ (రూ. 30 లక్షలు; ముంబై) డానియెల్లె గిబ్సన్ (రూ. 30 లక్షలు; గుజరాత్) అలానా కింగ్ (రూ. 30 లక్షలు; యూపీ) అక్షిత (రూ.20 లక్షలు; ముంబై) రాఘవి బిస్త్ (రూ. 10 లక్షలు; బెంగళూరు) జాగ్రవి పవార్ (రూ. 10 లక్షలు, బెంగళూరు) సంస్కృతి (రూ. 10 లక్షలు; ముంబై) క్రాంతి గౌడ్ (రూ. 10 లక్షలు; యూపీ) ఆరుషి గోయెల్ (రూ. 10 లక్షలు; యూపీ) నందిన్ కశ్యప్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) నికీ ప్రసాద్ (రూ. 10 లక్షలు; ఢిల్లీ) సారా బ్రిస్ (రూ.10 లక్షలు; ఢిల్లీ) ప్రకాశిక నాయక్ (రూ. 10 లక్షలు; గుజరాత్) జోషిత (రూ. 10 లక్షలు; బెంగళూరు) చదవండి: WPL 2025: ఏ జట్టులో ఎవరు? -
Ind vs Pak: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్
జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నమెంట్(ACC Women's U-19 Asia Cup)లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కౌలాలాంపూర్ వేదికగా భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో తలపడింది. అద్భుత ఆట తీరుతో చిరకాల ప్రత్యర్థిని ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.అదరగొట్టిన సోనమ్ యాదవ్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. కోమల్ ఖాన్ (24; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... యువ భారత బౌలర్లలో సోనమ్ యాదవ్ తన కోటా 4 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది.PC: ACCకమలిని మెరుపు ఇన్నింగ్స్‌అనంతరం భారత జట్టు 7.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 68 పరుగులు చేసింది. తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కమలిని మెరుపు ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 44 పరుగులతో అజేయంగా నిలిచింది.మరో 73 బంతులు మిగిలుండగానేమరో ఎండ్ నుంచి సనికా చాల్కే (19 నాటౌట్; 3 ఫోర్లు) కమలినికి సహకారం అందించింది. వీరిద్దరు ఆఖరి వరకు అజేయంగా ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కమలిని భారీ షాట్లతో విరుచుకుపడటంతో మరో 73 బంతులు మిగిలుండగానే గెలిచింది. పాక్‌పై భారత్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కమలినికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు మంగళవారం నేపాల్‌తో తలపడనుంది. కాగా జూనియర్ ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీకి మలేషియా ఆతిథ్యం ఇస్తోంది.చదవండి: WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్‌పై కనక వర్షం.. ఎవరీ కమలిని? -
మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.19 స్థానాల కోసంభారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.రూ. 10 లక్షల కనీస ధరఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ బిడ్ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్ఇటీవల జరిగిన అండర్-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోసంకాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.డాటిన్‌కు రూ. 1.70 కోట్లుమరోవైపు.. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్ షేక్ కోసం గుజరాత్ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.అయితే, తొలి రౌండ్లో పూనమ్ యాదవ్, స్నేహ్ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. చదవండి: BGT: మహ్మద్ షమీకి బైబై!