Gamanam Movie
-
నిర్మాతగా మారిన కెమెరామేన్.. యాక్షన్ థ్రిల్లర్‌గా రెండో సినిమా
Gnanashekar Sujana Rao Second Movie Action Thriller: ‘కంచె’, ‘మణికర్ణిక’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి సినిమాలకు కెమెరామేన్‌గా చేసిన జ్ఞానశేఖర్ (Gnanashekar) ‘గమనం’ సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. తాజాగా జ్ఞానశేఖర్ నిర్మాతగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాను ‘గమనం’ దర్శకురాలు సుజనా రావు (Sujana Rao) తెరకెక్కించనున్నారు. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇక బాలీవుడ్లో విద్యుత్ జమాల్ హీరోగా చేస్తున్న ‘ఐబీ 71’, ‘జయం’ రవి హీరోగా చేస్తున్న తమిళ సినిమాకు జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. చదవండి: దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
ఇక ఓటీటీలోనూ గమనం చిత్రం.. ఎక్కడా ? ఎప్పుడంటే ?
Gamanam Movie Will Streaming On OTT Platform: చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్ నటించిన చిత్రం గమనం. సంజనా రావు దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాను వాస్తవిక సంఘటనల ఆధారంగా మూడు భావోద్వేగభరితమైన కథలతో తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో అలరించనుంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక జావల్కర్, నిత్యా మీనన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రియా సరన్ దివ్యాంగురాలిగా నటించి ప్రేక్షకులను మెప్పించగా, నిత్యా మీనన్ అతిథి పాత్రలో మెరిసింది. పాన్ ఇండియాగా రూపొందించిన ఈ చిత్రాన్ని రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. త్వరలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించగా, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. -
సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్
Shriya Came to Mallikarjuna Theater in Auto Video: ప్రముఖ నటి శ్రియ సరన్ చాలా గ్యాప్ తర్వాత ‘గమనం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తోంది. ఆమె తాజాగా నటించిన ఈ మూవీ నేడు(డిసెంబర్ 10) థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుకట్పల్లి మల్లిఖార్జున థియేటర్లో సందడి చేసింది. కాగా థియేటర్‌కు శ్రియా ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. కూకట్పల్లి దగ్గర నిజాంపేట్ క్రాస్ రోడ్ వద్ద ఉన్న మల్లీఖార్జున థియేటర్‌కు ఆమె సినిమా చూసేందుకు వచ్చింది. చదవండి: బిగ్‌బాస్‌పై యాంకర్ రవి తల్లి షాకింగ్ కామెంట్స్ ఈ నేపథ్యంలో ఆమె ఆటోలో థియేటర్‌కు రావడం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది. కాసేపటికి క్రితమే ఆమె ఆటోలో థియేటర్‌కు చేరుకుంది. సుజనా రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రమేష్ కరుటూరి నిర్మించాడు. సామాజికంగా వెనుకబడిన ముగ్గురు యువతుల జీవితాల చుట్టు తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరక్కింది. ఇందులో శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు పోషించగా శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నటించారు. -
‘గమనం’మూవీ రివ్యూ
టైటిల్ : గమనం నటీనటులు : శ్రియ సరన్, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ , శివ కందుకూరి, బిత్తిరి సత్తి తదితరులు నిర్మాణ సంస్థ: క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ నిర్మాత : రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ దర్శకత్వం: సుజనా రావు సంగీతం : ఇళయరాజా సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వి.ఎస్ విడుదల తేది : డిసెంబర్ 10, 2021 ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా రాణించిన శ్రియ సరన్.. చాలా రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తోంది. కెరీర్‌ని పక్కన పెట్టి పెళ్లి, పిల్లలు.. ఇలా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె ‘గమనం’అనే విభిన్న చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గమనం’మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘గమనం’కథేంటంటే..? సామాజికంగా వెనుకబడిన ముగ్గురి జీవితాల చుట్టూ తిరిగే కథే ‘గమనం’. ఇది హైదరాబాద్ మహానగరంలో మూడు ఏరియాల్లో జరిగే కథ. కలమ(శ్రియ సరన్) ఓ దివ్యంగురాలు. వినికిడి లోపంతో బాధపడుతుంది. ఆమెకు ఓ చిన్న పాప ఉంటుంది. తనకు వినికిడి లోపం ఉందని... భర్త కూడా వదిలేస్తాడు. దాంతో నిస్సహాయురాలిగా ఓ బస్తీలో జీవిస్తూ ఉంటుంది. టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. మరోవైపు అలీ(శివ కందుకూరి) తల్లిదండ్రులను కోల్పోయి.. తాత, నానమ్మలతో కలిసి ఉంటాడు. క్రికెటర్‌గా రాణించాలని, పట్టుదలతో ప్రాక్టీసు చేస్తుంటాడు. అతన్ని ఇంటిపక్కనే ఉండే జరా(ప్రియాంక జవాల్కర్) ప్రేమిస్తుంది. ముస్లిం కుటుంబానికి చెందిన వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకోరు. దీంతో జరా అలీ కోసం ఇంట్లో నుంచి పారిపోయి వస్తుంది. ఇంకోవైపు బస్తీలోని ఓ మురికి కాలువ పక్కన ఉండే ఇద్దరు వీధి బాలురు.. చిత్తు కాగితాలు ఏరుకొని జీవనం సాగిస్తుంటారు. వీరిలో ఒకరికి తన పుట్టిన రోజు వేడుకని జరుపుకోవాలని కోరిక పుడుతుంది. కేక్ కోసం డబ్బును జమ చేయాలని డిసైడ్ అవుతారు. చిత్తు కాగితాలు అమ్ముకోగా కొద్దిగా డబ్బు వస్తుంది. అది సరిపోవడం లేదని మట్టి వినాయకుల విగ్రహాలను అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఈ మూడు పాత్రలు నగరంలో కురిసిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకుంటారు. ఆ వరదల్లో నుంచి వీళ్ళు ఎలా బయట పడ్డారు? భారీ వర్షాల కారణంగా కమల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అలీ క్రికెటర్ అయ్యాడా లేదా? అలీ, జరా పెళ్లి జరిగిందా? కేక్ కట్ చేసి గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకను సెలెబ్రేట్ చేసుకోవాలనే వీధి బాలుర ఆశయం నెరవేరిందా? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? వినికిడి లోపం ఉన్న దివ్యాంగురాలు కమల పాత్రలో శ్రియ ఒదిగిపోయింది. ఇప్పటి వరకు తన గ్లామర్ తోనే ఆడియన్స్ ని అలరించిన శ్రియా.. ఈ మూవీతో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో చాలా బాగా నటించింది. క్రికెటర్ అవ్వాలని ఆశ పడే ముస్లిం యువకుడు అలీ పాత్రలో శివ కందుకూరి మెప్పించాడు. క్లైమాక్స్‌లో వరదల్లో చిక్కుకున్న చిన్నారులను కాపాడే సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అలీని గాఢంగా ప్రేమించే ముస్లిం యువతి జరాగా ప్రియాంక జవాల్కర్ మెప్పించింది. వీధి బాలురుగా నటించిన ఇద్దరు చిన్నారులు అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే పాత్రలో బిత్తిరి సత్తి, అతిథి పాత్రలో నిత్యామీనన్‌లతో పాటు మిగిలిన నటీ, నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ఆశయాలు, ఆశలు, ప్రేమ, పేదరికం, ఆకలి, మోసం, పరువు ఇలా మనిషిలోని అనేక భావోద్వేగాల సమాహారమే ‘గమనం’. మూడు భిన్న నేపధ్యాలను ఒక కథగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకురాలు సుజనా రావు. భర్త చేతిలో మోసపోయి... నిరాదరణకు గురైన ఓ దివ్యంగురాలు... ఆటతోనే తన కెరీర్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుకోవాలనే ఓ పట్టుదల ఉన్న యువకుడు.. పేదరికంలో మగ్గిపోయే ఇద్దరు వీధి బాలలు.. ఈ ముగ్గురి చుట్టే కథంతా తిరుగుతుంది. తొలి ప్రయత్నంగానే ఇలాంటి కథ ప్రేక్షకులను అందించాలనే దర్శకురాలి ఆలోచనను మనం అభినందించాల్సిందే. అయితే ఆమె ఎంచుకున్న మూల కథ బాగున్నా.. దాన్ని తెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డారు. కొన్ని సన్నివేశాల్లో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలో పేదల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. అలాగే భారీ వర్షాలు వస్తే బస్తీల్లో పేదల బతుకు ఎలా ఛిద్రం అవుతుందో బాగా చూపించారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా లేకపోవడం, కథంతా నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. ఇళయారాజా నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్. ఈ మూవీలో ఒకటే సిట్యువేషనల్ సాంగ్ ఉంది. అది పర్వాలేదు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రశంసలు ఉంటాయి కానీ కమర్షియల్‌గా విజయం సాధించడం కష్టమనే చెప్పాలి. -
షూటింగ్ సమయంలో విషాదం, నా హృదయం బద్దలైంది: శ్రియా
చాలా గ్యాప్ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్ గమనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో సంజనా రావు దర్శకురాలిగా పరిచయం కాబోతోన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రియా సరన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి. ‘కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతో మంది పనులు లేకుండా అవస్థలు పడ్డారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. సినిమాల పట్ల ఇప్పుడు నా దృక్పథం మారింది. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసి గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి’ అని చెప్పారు. ఇక ‘ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను. ఇక నుంచి నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు ‘ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్‌తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం. ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగా నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది. పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
ఈ వారం అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు..
Upcoming Movies And Web Series In December Second Week: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విజయంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఇక్కడి నుంచి సంక్రాంతి వరకు వరుస సినిమాలు అలరించనున్నాయి. అంతకుముందు దీపావళి కానుకగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'సూర్యవంశీ' మంచి వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో డిసెంబర్ రెండో వారంలో థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం. 1. లక్ష్య యంగ్ హీరో నాగశౌర్య నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. జగపతి బాబు, సచిన్ ఖేద్కర్ కీలక పాత్రలు పోషించగా కేతిక శర్మ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. విలువిద్య నేపథ్య కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు నాగశౌర్య. కాల భైరవ స్వరాలు సమకూరుస్తున్నారు. 2. గమనం శ్రియ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘గమనం’. ఈ చిత్రాన్ని సుజనారావు తెరకెక్కించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మేనన్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందిన చిత్రమిది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో కనిపించనుంది. 3. నయీం డైరీస్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కిన ‘నయీం డైరీస్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దాము బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ప్రధాన పాత్ర పోషించారు. సీఏ వరదరాజు నిర్మాత. 'రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయనే విషయాన్ని ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యయనం చేశా. నయీం సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అతని డైరీలో పేర్కొన్న విషయాలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. వశిష్ఠ సింహ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.' అని చిత్ర బృందం చెబుతోంది. 4. మడ్డీ డిసెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'మడ్డీ'. ఈ సినిమాలో యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రేమ కృష్ణదాస్ నిర్మాణంలో ప్రగభల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. 'మడ్ రేసింగ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఐదేళ్లు పరిశోధన చేసి దర్శకుడు ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఇందులో ఫ్యామిలీ డ్రామా, వినోదం, సాహసం.. ఇలా ప్రతి ఎమోషన్ ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రధాన నటులకు రోడ్ రేసింగ్‌లో రెండేళ్లు శిక్షణ ఇచ్చారు.' అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ఇవే కాకుండా బుల్లెట్ సత్యం, ప్రియతమ, మనవూరి పాండవులు, కటారి కృష్ణ, సర్వం సిద్ధం చిత్రాలు కూడా డిసెంబర్ 10న థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆహా * పుష్పక విమానం డిసెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ * ద ఎక్స్పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 * ఎన్కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ * ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 నెట్‌ఫ్లిక్స్ * ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 6 * వాయిర్ డిసెంబరు 6 * టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 *అరణ్యక్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 * ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10 జీ5 కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 -
ఆ రోజు భయం వేసింది: ప్రియాంకా జవాల్కర్
‘‘కెరీర్లో ఎక్కువ సినిమాలు చేయాలనే కంగారు నాకు లేదు.. కథ నచ్చితేనే నటిస్తాను. కెరీర్లో స్లో అయిపోతామని వెంటవెంటనే సినిమాలు అంగీకరిస్తే.. వాటిలో ఎక్కువగా ఫ్లాప్ అయితే అప్పుడు కూడా కెరీర్‌కు ఇబ్బందే’’ అని హీరోయిన్ ప్రియాంకా జవాల్కర్ అన్నారు. శ్రియా శరన్, శివ కందుకూరి, నిత్యామీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో సంజనా రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గమనం’. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంకా జవాల్కర్ మాట్లాడుతూ– ‘‘గమనం’ సినిమా కథ విన్నప్పుడు ‘వేదం’ గుర్తొచ్చింది. సంజనా రావు మహిళా దర్శకురాలు కావడంతో మరింత ఎక్కువగా కనెక్టయ్యాను. ఈ చిత్రంలో జారా అనే ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. నటనకు స్కోప్ ఉన్న పాత్రే అయినప్పటికీ కథ రీత్యా నా పాత్రకు పెద్దగా డైలాగ్స్ ఉండవు. ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడాలి.. కళ్లతో హావభావాలు చూపించాలి. ఇదే కష్టంగా అనిపించింది. శివకందుకూరి గ్రాండ్ఫాదర్గా చారుహాసన్గారు కనిపిస్తారు. ఓ రెయిన్ సీక్వెన్స్‌లో చారుహాసన్గారితో కలిసి నటించాను. నటన, వయసు ప్రకారం ఆయన చాలా పెద్దాయన. నా నటనతో (ఎక్కువ టేకులు తీసుకోవడం) ఆయన్ను ఏమైనా ఇబ్బంది పెడతానేమోనన్న భయం షూటింగ్ రోజు కలిగింది. కానీ చిత్రీకరణ అనుకున్నట్టుగా బాగానే సాగింది. ఈ సినిమాకు ఇళయరాజాగారు సంగీతం అందిస్తున్నారని తెలియగానే చాలా సంతోష పడ్డాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నాకు నచ్చింది. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి సిద్ధమే’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) -
ఈ కథ విని హీరోయిన్ శ్రియ ఏడ్చేసింది: సృజనా రావు
‘‘జీవిత ప్రయాణం గురించి చెప్పడమే ‘గమనం’ చిత్రం ఉద్దేశం. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్‌ను చూపించాలనుకున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాత్రకు ఓ ప్రయాణం ఉంటుంది’’ అని డైరెక్టర్ సృజనా రావు అన్నారు. శ్రియ, శివ కందుకూరి, నిత్యా మీనన్, ప్రియాంకా జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘గమనం’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్న సృజనా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వెళ్లాలని ఉందని ముందు మా ఇంట్లో చెప్పలేదు. తర్వాత నేను తీసిన డాక్యుమెంటరీని మా నాన్నగారికి చూపించాను. ‘నేనైతే హెల్ప్ చేయను కానీ నువ్వే కష్టపడి ప్రూవ్ చేసుకోవాలి’ అని నాన్న అన్నారు. ఆ తర్వాత సపోర్ట్ చేశారు. చిన్నప్పుడు మా నాన్నతో పాటు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు సెట్లో ఎవరెవరు ఏమేం చేయాలో చెప్పేది దర్శకుడే అని గ్రహించాను. అప్పుడే డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ‘గమనం’లో ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నటీనటులను అనుకుని రాయలేదు. శ్రియకి కథ చెప్పగానే ఏడ్చేసి, నన్ను గట్టిగా హత్తుకున్నారు. ఇందులో శ్రియ చాలా కొత్తగా కనిపిస్తారు. నిత్యా మీనన్, చారు హాసన్ బాగా చేశారు. ‘గమనం’ కథ నిర్మాత జ్ఞానశేఖర్‌గారికి బాగా నచ్చింది. ఇళయరాజాగారికి కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ‘నన్నే సంగీతదర్శకుడిగా ఎందుకు అనుకుంటున్నావు?’ అని అడిగారు. కథ చెప్పడం ప్రారంభించాక సగంలోనే ‘మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారు. సంగీతం, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటాయి. మా సినిమా చేసినందుకు రచయిత సాయి మాధవ్ బుర్రాకి థ్యాంక్స్. ‘గమనం’ విడుదల కోసం ఎంతో ఎగై్జటింగ్‌గా ఉన్నాను. నా తర్వాతి చిత్రం కోసం ఓ కథ సిద్ధం చేశా’’ అన్నారు.