ఇక ఓటీటీలోనూ గమనం చిత్రం.. ఎక్కడా ? ఎప్పుడంటే ? | Gamanam Movie Will Streaming On OTT Platform | Sakshi
Sakshi News home page

Gamanam Movie: ఇక ఓటీటీలోనూ గమనం చిత్రం.. ఎక్కడా ? ఎప్పుడంటే ?

Published Thu, Jan 27 2022 10:19 PM | Last Updated on Fri, Jan 28 2022 8:09 AM

Gamanam Movie Will Streaming On OTT Platform - Sakshi

Gamanam Movie Will Streaming On OTT Platform: చాలా గ్యాప్​ తర్వాత హీరోయిన్ శ్రియ సరన్​ నటించిన చిత్రం గమనం. సంజనా రావు దర్శకురాలిగా పరిచయమైన ఈ సినిమాను వాస్తవిక సంఘటనల ఆధారంగా మూడు భావోద్వేగభరితమైన కథలతో తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్​ 10న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా తాజాగా ఓటీటీలో అలరించనుంది. జనవరి 28 నుంచి అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమింగ్​ కానుంది. ఈ సినిమాలో ప్రియాంక జావల్కర్​, నిత్యా మీనన్​, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు. 

అలాగే ఇందులో శ్రియా సరన్​ దివ్యాంగురాలిగా నటించి ప్రేక్షకులను మెప్పించగా, నిత్యా మీనన్​ అతిథి పాత్రలో మెరిసింది. పాన్​ ఇండియాగా రూపొందించిన ఈ చిత్రాన్ని రమేష్​ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్​ సంయుక్తంగా నిర్మించారు. త్వరలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించగా, సాయి మాధవ్​ బుర్రా సంభాషణలు రాశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement