Gandhi General Hospital
-
ముగ్గురు ఐఏఎస్‌లకు స్వైన్‌ఫ్లూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్టోబర్ నెల 15 రోజుల్లోనే ఏకంగా 125 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవటం, ఈ ఏడాదిలో స్వైన్ ఫ్లూ కారణంగా ఇప్పటివరకు నలుగురు మృతి చెందటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులు సైతం స్వైన్ ఫ్లూ తో ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు ఐఏఎస్‌లు, మరో నలుగురు డీఆర్వో, ఆర్డీవో స్థాయి అధికారులున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీరి పేర్లు బయటపెడితే వారి వద్దకు ప్రజలు వెళ్లేందుకు ఇబ్బంది పడే అవకాశమున్నందున ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) అధికారులు వెల్లడించడం లేదు. వారం రోజుల్లో 20 కేసులు నగరంలోని గాంధీ జనరల్ ఆసుపత్రిలో గత వారం రోజుల్లో 20 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయి. ఈ ఏడాది గాంధీలో 54 మంది స్వైన్ ఫ్లూ రోగులు చేరగా నలుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి 140కి పైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, అక్టోబర్ నెల 15 రోజుల్లోనే 124 కేసులు నమోదయ్యాయి. ఐపీఎం ల్యాబ్ కు గత నెలలో 439 శాంపిళ్లు రాగా వాటిలో 45, అక్టోబర్ మొదటి 15 రోజుల్లో 555 శాంపిళ్లను పరీక్షించగా 125 పాజిటివ్ వచ్చాయి. ప్రస్తుతం 34 మంది గాంధీ, ఉస్మానియాల్లో చికిత్స పొందుతున్నారు. -
‘గాంధీ’లో నవ శకం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే కార్పొరేట్ హంగులు సంతరించుకున్న గాంధీ జనరల్ ఆస్పత్రిని ప్రత్యేక అవయవ మార్పిడి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆస్పత్రిలో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి, ఆరు నుంచి ఎనిమిది మాసాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తే గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కాంక్లీయర్ ఇంప్లాంటేషన్స్, మోకాలి చిప్పల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ సాంకేతిక బృందం ఇటీవల ఆస్పత్రిని సందర్శించింది. రూ.20 కోట్లతో ఆరు థియేటర్లు మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, జన్యుపర లోపాల వల్ల చాలామంది చిన్నతనంలోనే పెద్ద జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, మోకీళ్ల అరుగుదలతో వచ్చే నొప్పి, మూగ, వినికిడి లోపంతో జన్మించడం, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఈ చికిత్సలు అందడం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో చాలా ఖరీదుతో కూడినవి కావడంతో ఆ స్తోమత లేని పేద రోగులు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన వైద్య సేవలను ఉచితంగా అందజేయాలని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. ఆ మేరకు గాంధీ ఆస్పత్రి ఇన్‌పేషెంట్ భవనం ఎనిమిదో అంతస్థులో రూ.20 కోట్లతో ఆరు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు కు నిర్ణయించింది. గాంధీలోనే ఎందుకంటే.. అవయవ మార్పిడి చికిత్స కోసం నిమ్స్ జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 4,503 మంది దరఖాస్తు చేసుకో గా, వీరి లో 2,403 మంది కిడ్నీ బాధితులు, 2,012 మం ది కాలేయ బాధితులు ఉన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు 723 కిడ్నీ, 423 కాలేయం, 63 గుండె, 166 హార్ట్వాల్వస్, 391 కార్నియాలు, 8 ఊపిరితితుత్తలు, ఎనిమిది ప్రాంకీయాస్ మార్పి డి చికిత్సలు చేశారు. 250పైగా కాంక్లీయర్ ఇంప్లాం ట్స్ సర్జరీలు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రిల్లో గుండె, కాలేయ మార్పిడి చేయించుకో వాలంటే రూ.25 లక్షలకుపైగా ఖర్చు చేయాలి. సాధారణ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకే రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యనిపుణులకు లోటు లేదు. దీంతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి.. రోగులకు పైసా ఖర్చు లేకుండానే ఖరీదైన వైద్య సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావించింది. -
‘గాంధీ’.. ఓ ధీమా
►గాంధీలో 65 పడకలతో ఈఎండీ వార్డు ►సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో మరో 45 పడకలు ►110కు చేరనున్న ఐసీయూ పడకల సామర్థ్యం ►త్వరలో ప్రారంభించనున్న గవర్నర్ గాంధీ ఆస్పత్రి.. ఓ ధైర్యం.. ఓ నమ్మకం.. అక్కడికి వెళితే ఏ జబ్బైనా నయమవుతుందనే ధీమా.. వేలాదిమంది గాంధీలో చికిత్స పొందుతుంటారు.. అయితే అత్యవసర రోగుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది.. అందుకే 65 పడకలతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు కానుంది. సిటీబ్యూరో: గాంధీ జనరల్ ఆస్పత్రిలో అత్యవసర రోగుల కష్టాలు తీరనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన రోగులందరికీ మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రిలో అత్యాధునిక ఐసీయూ అందుబాటోలోకి రాబోతోంది. ఓపీ భవనంలోని మూడో అంతస్తులో 65 పడకల సామర్థ్యంతో ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్(ఈఎండీ)ని ఏర్పాటు చేసింది. గరవ్నర్ నరసింహన్ త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశంఉంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి గవర్నర్‌ను కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వనించగా, ఆయన ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. రూ.5.50 కోట్లతో ఏర్పాటు ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 1265 పడకల సామర్థ్యం ఉంది. ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 2800–3000 మంది వస్తుండగా, ఇక్కడ నిత్యం 1500 మంది చికిత్స పొందుతున్నారు. 18 ఆపరేషన్ థియేటర్లు ఉండగా, వీటిలో రోజుకు సగటున 150 మైనర్, 50 మేజర్ చికిత్సలు జరుగుతున్నాయి. వివిధ ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, హృద్రోగులు, కిడ్నీ, కాలేయ, ఇతర సమస్యలతో బాధపడుతున్న బాధితులు మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి గాంధీ అత్యవసర విభాగానికి వస్తుంటారు. అయితే ఆస్పత్రి అత్యవసర విభాగంలో 25కు మించి పడకలు లేవు. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు లేకపోవడంతో నిరాశతో వెనుతిరుగాల్సి వస్తుంది. రోగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఆస్పత్రిలో రూ .5.50 కోట్లతో అత్యాధునిక ఈఎండీని ఏర్పాటు చేయాలని భావించింది. తొలి విడతలో 65 పడకలు ఏర్పాటు చేసి, ఆ తర్వాత సూపర్‌స్పెషాలిటీ ఐసీయూలో మరో 45 పడకలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైడ్రాలిక్ పడకలతో పాటు సెంట్రలైజ్ ఏసీ సహా ప్రత్యేక ఆక్సిజన్లైన్, అటెండెంట్లకు అవసరమైన కుర్చీలను సమకూర్చింది. గాంధీలో సౌకర్యాలు మెరుగు పరుస్తుండటం పట్ల రోగులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 95 నర్సింగ్, 25 మంది వైద్యులు అవసరం ఆస్పత్రిలో అత్యాధునిక హంగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్లో మెరుగైన వైద్యసేవల కోసం 25 మంది ఇంటెన్సివ్‌కేర్ స్పెషలిస్టులతో పాటు 95 మంది నర్సులు, మరో 75 మంది పారామెడికల్స్టాఫ్, స్వీపర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు అవసరం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేస్తాం. మూడో అంతస్థులోని ఈఎండీకి చేరుకునేందుకు లిఫ్ట్లును కూడా సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ఇవి సిద్ధం అవుతాయి. – డాక్టర్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్, గాంధీ జనరల్ ఆస్పత్రి -
హే గాంధీ!
సాక్షి, సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్: గాంధీ జనరల్ ఆస్పత్రికి సుస్తీ చేసింది. నయం చేయాల్సిన ప్రభుత్వం తమకేమీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో అత్యవసర విభాగానికి చేరుకున్నా... సకాలంలో వైద్యం అందక ... వ్యాధి నిర్ధారణ యంత్రాలు పని చేయక... ఎంతో మంది క్షతగాత్రులు మృత్యువాత పడుతున్నారు. 1255 పడకల సామ«ర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రి ఔట్ పేషెంట్ విభాగానికి నిత్యం 2500–3000 మంది వస్తుండగా.. ఇన్‌పేషెంట్ విభాగంలో 1500 మందికిపైగా చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజుకు సగటున 200 మంది వస్తే... వీరిలో 80 శాతం రక్తమోడుతున్న వారే. వీరిలో చాలా మందికి సకాలంలో వైద్యసేవలు అందడం లేదు. నిపుణులు అందుబాటులో లేక కొంతమంది... సీటీ, ఎంఆర్ఐ వంటి సేవలు అందక మరికొంతమంది చనిపోతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పని చేయని సీటీస్కాన్ ఆస్పత్రిలోని సీటీస్కాన్ యంత్రం ఐదు రోజులుగా పని చేయడం లేదు. దీనికి మరమ్మతులు చేయాలంటే జర్మనీ నుంచి ప్రత్యేక నిపుణులు రావాల్సిందే. సకాలంలో నిర్వహణ ఖర్చులు చెల్లించక పోవడంతో సదరు సంస్థ ప్రతినిధులు మరమ్మతులకు ముందుకు రావడం లేదు. దీంతో రోగులను వైద్యులు ఉస్మానియాకు సిఫారసు చేస్తున్నారు. తీరా అక్కడి సీటీస్కాన్‌కు 15 రోజులు... ఎంఆర్ఐకి రెండు నుంచి మూడు నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా గాంధీలోనే ప్రస్తుతం 400 మందికిపైగా ఎంఆర్ఐ కోసం ఎదురు చూస్తున్నారు. -
ఇంత అధ్వానమా!
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణపై గవర్నర్ అసంతృప్తి వైద్య సేవలు, మందులు, భోజనం సరఫరాపై ఆరా హైదరాబాద్: ‘పరిశుభ్రతకు మారుపేరుగా నిలవాల్సిన ఆస్పత్రి ప్రాంగణం ఇంత అపరిశుభ్రంగా.. అధ్వానంగా ఉంటే ఎలా? వార్డుల్లోని మూత్రశాలలు దుర్వాసన వెదజల్లితే అక్కడ చికిత్స పొందుతున్న రోగుల జబ్బులు ఎలా నయమవుతాయి? ఆస్పత్రిలో చేరిన రోగులు పడుకునేందుకు దిండు, కప్పుకునేందుకు దుప్పటి ఎందుకివ్వడం లేదు?’ అంటూ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గాంధీ జనరల్ ఆస్పత్రి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రిని గవర్నర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్ పేషెంట్ సహా అత్యవసర, ఇన్‌పేషంట్ విభాగాలను సందర్శించి.. రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. దుర్వాసన వెదజల్లుతున్న మూత్రశాలలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో రోగులకు ఇస్తున్న మందులు, సరఫరా చేస్తున్న భోజనం తదితర సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సలు, వైద్య సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని కొందరు రోగులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జేవీ రెడ్డి స్పందిస్తూ.. సిబ్బంది కొరత ఉందని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని గవర్నర్‌కు వివరించారు. ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధుల మంజూరు, వాటి ఖర్చుపై టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఆస్పత్రిని సందర్శిస్తానని, ఆ లోగా లోపాలను సరిదిద్ది మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. గవర్నర్ రాకపై వైద్యమంత్రి ఆరా గాంధీ ఆస్పత్రిలో గవర్నర్ ఆకస్మిక తనిఖీలపై వైద్య, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి ఆరా తీశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి గవర్నర్ ఏ అంశాలపై ఆరా తీశారని, ఆయనతో ఆస్పత్రి వైద్యులు ఏ అంశాలు మాట్లాడారనే వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో గవర్నర్ తనిఖీలు చేసిన విషయం తెలుసుకున్న మంత్రి ఆయా విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర విభాగంలో ఆధునీకరణ పనుల కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నంబర్ 222ని మార్చి 31లోగా ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. -
ప్రభుత్వ వైద్యులపై నిఘా
♦ బోధనాస్పత్రుల్లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ♦ తొలి విడతగా సికింద్రాబాద్ గాంధీలో ఏర్పాటు ♦ రూ.30 లక్షలతో 200 సీసీ కెమెరాలు సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ బోధనాస్పత్రుల్లో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై నిరంతర నిఘా పెట్టాలని సర్కార్ నిర్ణయించింది. వైద్య సేవల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు ఆస్పత్రులలోని అన్ని విభాగాలనూ ఆన్లైన్లో అనుసంధానానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యుల హాజరును ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ తాజాగా గాంధీ జనరల్ ఆస్పత్రిలో వైద్యసేవలపై నిరంతర నిఘా ఉంచాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా అత్యవసర విభాగం, మార్చురీ, పరిపాలనా భవనం, అవుట్ పేషెంట్, ఇన్‌పేషంట్ వార్డులు, ఆపరేషన్ థియేటర్స్, రేడియాలజీ, పాథాలజీ విభాగాల వద్ద రూ.30 లక్షలు వెచ్చించి 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీఎంఈల కంప్యూటర్లకు ఈ కెమెరాలను అనుసంధానించనున్నారు. దీంతో ఉన్నతాధికారులు కార్యాలయాల నుంచేఆస్పత్రిలోని వైద్యుల పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంది. నిత్యం కిటకిట సుమారు 1050 పడకల సామర్థ్యం ఉన్న గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగానికి నిత్యం 2500-3000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషెంట్ విభాగంలో నిత్యం 1500 మంది చికిత్స పొందుతుంటారు. చిన్నాపెద్ద అన్ని కలిపి రోజుకు సగటున 80-100 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ఆస్పత్రిలో మొత్తం 3000 మందికిపైగా పని చేస్తున్నారు. వీరిలో 350 మంది వైద్యులు ఉన్నారు. పారిశుద్ధ్య విభాగంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రతిపాదికన 400 మందికిపైగా పని చేస్తున్నారు. వీరి కోసం ఇప్పటికే బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. మిగిలిన వారంతా పాత పద్ధతిలోనే రిజిస్టర్లో సంతకం చేస్తున్నారు. బోధనాస్పత్రుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమాలకు చెక్ కొంతమంది సీనియర్ వైద్యులు ఆస్పత్రికి వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. మరికొంత మంది అసలు ఆస్పత్రికి రాకుండానే సంతకం చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న దంపతుల్లో ఒకరు గైర్హాజరైతే వారికి బదులు మరొకరు రిజిస్టర్లో సంతకం చేస్తున్నారు. చాలా మంది వైద్యులు తమ గదులకే పరిమితమవుతున్నారు. రోగులు చికిత్స పొందుతున్న వార్డులకు వెళ్లడం లేదు. దీంతో సకాలంలో చికిత్సలు అందక బాధితులు మృత్యువాత పడుతున్నారు. రోగులు వెంట తెచ్చుకున్న సెల్ఫోన్లు, బంగారు వస్తువులు, పర్సులు చోరీకి గురవుతున్నాయి. రాత్రిపూట కొంతమంది ఉద్యోగులు రోగి బంధువులు పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. -
కొత్త రోగాల లోకం!
గాంధీ... నిమ్స్... నీలోఫర్... ఉస్మానియా... మహానగరంలోని ప్రధాన ఆస్పత్రులివి. ఆరోగ్యాన్ని ప్రసాదించాల్సిన ఈ ఆస్పత్రులు ఇప్పుడు కొత్త రోగాలకు కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపంతో మురికికూపాలుగా మారుతున్నాయి. ఓ వైపు మౌలిక వసతుల కొరతతో ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులు సర్దుకోవాల్సి వస్తోంది. మరోవైపు రోగుల బంధువులూ అక్కడే సేదదీరాల్సి వస్తోంది. వ్యర్థాలు పక్కనే ఉంటాయి. దీంతో వీరంతా రోగాల బారిన పడుతున్నారు. ఎలుకలు... పందికొక్కు లు... నల్లులు... ఈ ఆస్పత్రులకు అదనపు హంగులు. * ఉస్మానియాలో ఎలుకలు, పంది కొక్కులు, దోమలు * నిమ్స్‌లో నల్లులు..ఈగలు... నీలోఫర్‌లో ఇన్ఫెక్షన్ * కంపు కొడుతున్న వార్డులు.. ప్రబలుతున్న వ్యాధులు * ధర్మాస్పత్రుల్లో రోగులకు కొత్త కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని ప్రభుత్వాస్పత్రులు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వ్యాధులు నయం కావాలని వెళుతున్న వారికి కొత్త రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. వార్డులు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కనిపించడం లేదు. సిరంజీలు, ఇతర బయోమెడికల్ వ్యర్థాలు వార్డుల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. రోజుల తరబడి మరుగుదొడ్లను శుభ్రం చేయకపోవ డంతో దుర్వానస వెదజల్లుతున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రభుత్వం వెచ్చిస్తోన్న కోట్లాది రూపాయలు ఆస్పత్రి వ్యర్థాల్లో కలిసి పోతున్నాయి. ఉస్మానియాలో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతుండగా... నిమ్స్‌లో నల్లులు రోగుల రక్తం పీల్చేస్తున్నాయి. నిలోఫర్‌లో ఇన్ఫెక్షన్తో చిన్నారుల ప్రాణాల మీదకు వస్తోంది. గాంధీలో వార్డుల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరింపలేనివిధంగా ఉంటోంది. నీలోఫర్‌లో రక్షణ ఏదీ? నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రిలో పారిశుద్ధ్యానికి ప్రభుత్వం నెలకు రూ.5 లక్షలు వెచ్చిస్తోంది. నిబంధనల ప్రకారం నిత్యం రెండు పూటలా ఫినాయిల్‌తో వార్డులను శుభ్రం చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఫినాయిలే వాడటం లేదు. కేవలం తడిగుడ్డతో తుడిచేసి, చేతులు దులుపుకుంటున్నారు. రోగి బంధువులు పడకల చుట్టే కూర్చొని భోజనాలు చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ల నుంచి వెలువడే బయోమెడికల్ వ్యర్థాలను వేరు చేయడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బ్యాక్టీరియా, ఇతర వైరస్ పిల్లలకు సులభంగా వ్యాపిస్తోంది. ఆస్పత్రిలో రోజుకు సగటున ఐదు నుంచి పది మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ప్రతి పది మంది మృతుల్లో ఒకరు ఇన్ఫెక్షన్ వల్లే చనిపోతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వైద్యులే అంగీకరిస్తున్నారు. హే గాంధీ... గాంధీ జనరల్ ఆస్పత్రిలో పారిశుద్ధానికి ప్రభుత్వం నెలకు రూ.23.7 లక్షలు ఖర్చు చేస్తోంది. కానీ రోజుల తరబడి చెత్తను తొలగించకపోవడంతో వార్డుల్లో పేరుకుపోతోంది. ఆస్పత్రి ఆవరణలోని క్లీనికల్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మూలనపడింది. బ్యాక్టీరియా విస్తరిస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఎలా శుభ్రపరచాలంటే... ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి. అవుట్‌పేషెంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడు సార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడు సార్లు శుభ్రం చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చే యాల్సి ఉంది. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా శానిటేషన్ ఎజెన్సీలు పట్టించుకోవడం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు కనిపించడం లేదు. ఒప్పంద పత్రంలో రెండు వందల మంది సిబ్బందిని శానిటేషన్ కోసం వినియో గిస్తున్నట్లు చూపుతున్నా.. ఆస్పత్రుల్లో యాభై మందికి మించి కనిపించడం లేదు. ఉస్మానియా వార్డుల్లో దుర్వాసన కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట నరకకూపంగా మారుతోంది. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం కోసం నెలకు రూ.17.8 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ఓపీతో పాటు ఇన్‌పేషెంట్ వార్డుల్లో చెత్త పేరుకుపోయి తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. క్యాజువాలిటీ వెనుక భాగంలోని ఆర్ఎంఓ ఆఫీస్, గుండె, మూత్రపిండాలు, తదితర వార్డుల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. డ్రైనేజ్ లీక్ కావడంతో ఆస్పత్రి చుట్టూ మురుగునీరు ప్రవహిస్తోంది. ఎలుకలు, పందికొక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో వీటిని తాగిన రోగులు అనారోగ్యం బారిన పడుతున్నారు. సిరంజీలు, బ్లేడ్లు వంటి క్లీనిక్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. నిమ్స్‌లో నల్లుల బెడద నిమ్స్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అయినా ప్రయోజనం కానరావడం లేదు. పడకలను రోజుల తరబడి శుభ్రం చేయక పోవడంతో మంచాల్లో నల్లులు తిష్టవేస్తున్నాయి. ఇవి రోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిమ్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్పత్రిని సీజ్ చేయడానికి కూడా వెనుకాడబోమని ఇటీవల పీసీబీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వ్యర్థాలను నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నట్లు తెలిసింది. -
ప్రశాంతంగా టీజీడీఏ ఎన్నికలు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీడీఏ) యూనిట్ల ఎన్నికల ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కాగా ఒక్కో యూనిట్లో 19 పోస్టులకు ఎన్నికలు నిర్వహించగా, సుమారు 1500 మంది వైద్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫలితాలు ఇలా ఉన్నాయి.. యూనిట్-1లో.. ఉస్మానియా యూనిట్-1 పరిధిలో ఉస్మానియా వైద్యకళాశాల, ఉస్మానియా ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, ఉస్మానియా దంత వైద్య కళాశాల ఉన్నాయి. ఇక్కడ 350 ఓట్లకు గాను 346 ఓట్లు పోలయా ్యయి. నూతన అధ్యక్షుడిగా ఉస్మానియా ఆస్పత్రి సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ బి.నాగేందర్ విజయం సాధించారు. ప్రధాన కార్య దర్శిగా మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.బాలరాజు, కోశాధికారిగా అనెస్థీయా ఇన్చార్జి డాక్టర్ పాండునాయక్, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా డాక్టర్ రాజు విజయం సాధించారు. యూనిట్-2లో.. ఉస్మానియా యూనిట్-2 పరిధిలో నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతి, మానసిక చికిత్సాలయం, ఐపీఎం నారాయణగూడ, ఈఎన్టీ ఆస్పత్రి ఉన్నాయి. ఇక్కడ 300 మంది ఓటర్లకు 295 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. నూతన అధ్యక్షుడిగా సరోజినిదేవి కంటి ఆస్పత్రి డాక్టర్ రవీందర్‌గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ లక్ష్మీనారాయణ, కోశాధికారిగా డాక్టర్ వినోద్‌కుమార్, జనరల్ కౌన్సిల్ మెంబర్స్‌గా తరుణి, మురళీధర్‌రావు, సీఈసీ మెంబర్‌గా నరహరి గెలుపొందారు. గాంధీ యూనిట్లో.. గాంధీ మెడికల్ కళాశాల, గాంధీ జనరల్ ఆస్పత్రి యూనిట్లో 350 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. నూతన అధ్యక్షుడిగా గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ శ్రవణ్‌కుమార్ విజయం సాధించారు. కార్యదర్శిగా డాక్టర్ సిద్ధిపేట రమేష్, కోశాధికారిగా కె.భూమేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా కె.రాణి, రమేష్‌బాబు, సంయుక్త కార్యదర్శిగా శోభ, జనరల్ కౌన్సిల్ మెంబర్‌గా త్రిలోక్ చందర్, జనరల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రశాంత్ ఎన్నికయ్యారు.