Ganesh nagar
-
'హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం'
కరీంనగర్ : 'హలో.. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది. దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటే మీ కార్డు వెనుక ఉన్న నెంబర్ చెప్పండి' అని అడగడంతో కంగారుపడ్డ వినియోగదారుడు నంబర్ చెప్పేశాడు. అంతే.. వెంటనే అతని అకౌంట్లో ఉన్న రూ. 86 వేలు డ్రా అయిపోయాయి. ఆ తర్వాత ఇది గుర్తించిన సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన కరీంనగర్ గణేష్‌నగర్‌లో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నమిలికొండ రమణాచార్యులకు ఆదివారం ఉదయం ఫోన్ చేసిన ఓ వ్యక్తి తాను ఎస్బీఐ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పి ఆయన ఏటీఎం కార్డు బ్లాక్ అయిందనడంతో.. ఆందోళనకు గురైన వినియోగదారుడు తన ఏటీఎం కార్డు వెనుక నంబర్ చెప్పాడు. అనంతరం అకౌంట్లో ఉన్న రూ. 86 వేలు మాయమవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అంతా మాఇష్టం..!
సాక్షి, కర్నూలు: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో అడ్డగోలు నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. యథేచ్ఛగా నిర్మాణాలు కొనసాగుతున్నా.. నిలువరించాల్సిన పట్టణ ప్రణాళిక విభాగంఅధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ఒకప్పటి రాజధానిగా పేరుపొందిన కర్నూలు.. ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చెందడం లేదు. నగరపాలక సంస్థ, పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నిర్లక్ష్యంతో అనధికారిక కట్టడాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నగరవ్యాప్తంగా 900కుపైగా అక్రమ కట్టడాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఏ-క్యాంపులో ఓ వ్యక్తి అక్రమ భవన నిర్మాణం చేపడుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని 23వ వార్డు పరిధిలోని ధనలక్ష్మినగర్, సోమిశెట్టినగర్, గణేష్‌నగర్‌లలో అనేక అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగానే సాగుతున్నాయి. అలాగే సి-క్యాంపు సమీపంలో సుద్దవాగు వంక వద్ద ఓ బిల్డర్ అక్రమంగా వాణిజ్య భవనాన్నే నిర్మిస్తున్నా.. ప్రశ్నించే అధికారులే కరువయ్యారు. కొత్తబస్టాండు ఎదురుగా ఉన్న ఓ లాడ్జీ, అలాగే అక్కడ సమీపంలోని అనేక వాణిజ్య భవనాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినవే. సి-క్యాంప్‌లోని ఓ వాణిజ్య సముదాయానికి అనుమతి సమయంలో పార్కింగ్ సదుపాయం చూపించి అనుమతి పొందిన తర్వాత ఆ స్థలంలో నాలుగు వాణిజ్య దుకాణాలను నిర్మించారు. టీడీపీ కార్యాలయంలో ఎదురుగా ఉన్న ఓ వాణిజ్య భవనం ఇంకా నిర్మాణ దశలో ఉండగా.. ఓ కళాశాల, ఓ టెక్స్టైల్ షాపు నిర్వహిస్తున్నారు. దీనికి నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సైతం తీసుకున్నట్లు లేదని తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత అవుతుంది. కాగితాలపైనే సెట్బ్యాక్లు.. పురపాలక శాఖ నిబంధనల మేరకు వాణిజ్య, నివాస భవనాలు నిర్మించాలంటే వాటి చుట్టూ సెట్‌బ్యాక్ వదలాల్సిందే. అయితే నగరంలో ఇలాంటి నిబంధనలు మచ్చుకైనా కానరావు. జీవో నం. 168 ప్రకారం కర్నూలు నగరంలో ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే తొలుత ఆయా భవనాలకు సంబంధించిన ప్లాన్‌తో నగరపాలక సంస్థలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్లాన్‌లో కచ్చితంగా నాలుగు వైపులా నిబంధనల మేరకు సెట్‌బ్యాక్స్ చూపించాలి. అయితే నిర్మాణ అనుమతుల కోసం ఇవన్నీ కాగితాల్లో బాగానే చూపుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవేవీ అమలు చేయడం లేదు. ఒక్కసారి నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చిందా చాలు.. ఇక నిర్మాణదారులు అడ్డదిడ్డంగా కట్టడాలు కట్టేస్తున్నారు.బాపుజీ నగర్లో ఓ వ్యక్తి నిర్మిస్తున్న నాలుగు అంతస్తుల భవనానికి ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేవు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రాజ్‌విహార్ వెళ్లే మార్గంలోనూ, ఆర్ఎస్ రోడ్డు, డీఎస్పీ సమీపంలోనూ, ఎస్పీ కార్యాలయంలో ఎదురుగా ఉన్న ప్రాంతంలోనూ, ఉస్మానియా కళాశాల రోడ్డు తదితర ప్రాంతాల్లో ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయి. కర్నూలులో ఉన్న దాదాపు 30కిపైగా ఉన్న కల్యాణ మండపాలలో 20కిపైగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. పట్టణ ప్రణాళిక అధికారులు వీటిని గుర్తించి, మార్పులు చేసుకోవాలని, లేకపోతే కూల్చివేస్తామని, కొళాయి కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసినా పరిస్థితి ఇప్పటి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉంది. పార్కింగ్ స్థలాలూ అద్దెకు.. వాణిజ్య సముదాయాలు నిర్మించాలంటే కచ్చితంగా పార్కింగ్ సౌకర్యం ఉండాల్సిందే. పార్కింగ్ సదుపాయం చూపించకపోతే నిర్మాణ అనుమతులు ఇవ్వరు. అయితే నగరంలో ముఖ్యకూడల్లో నిర్మించిన వాణిజ్య భవనాల్లో పార్కింగ్ స్థలాలు ఉన్నా.. వాటిని సైతం అద్దెకు ఇచ్చే సంస్కృతి ఉంది. ఉదాహరణకు కృష్ణానగర్‌లోని ఆంధ్రబ్యాంక్ పక్కన ఉన్న ఓ వాణిజ్య సముదాయంలోని పార్కింగ్ స్థలాన్ని వ్యాపారులకు అద్దెకిచ్చారు. ఆ వాణిజ్య భవనానికి వచ్చే వాహనదారులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం రోడ్దుపైనే పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో నిత్యం అక్కడ ట్రాఫిక్ సమస్యతోపాటు చిన్నపాటి ప్రమాదాలకు పరిపాటిగా మారింది. అలాగే ఓ మాజీ మంత్రికి చెందిన వాణిజ్య సముదాయంలోని పార్కింగ్ స్థలాన్ని కూడా అద్దెకు ఇవ్వడం గమనార్హం. క్రిస్వర్డ్ సమీపంలోని ఓ కాంప్లెక్‌లో సైతం ఇదే పరిస్థితి. సిబ్బంది అంతంత మాత్రమే.. కర్నూలులో 5.50 లక్షల మంది నివాసం ఉంటున్నారు. మొత్తం లక్షన్నర భవనాలుండగా.. పట్టణ ప్రణాళిక విభాగంలో ఆ స్థాయికి సరిపడా సిబ్బంది లేదు. దీంతో అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తోంది. సిటీ ప్లానర్ పోస్టు ఉన్నా ఐదేళ్లుగా ఇక్కడ ఇన్‌చార్జీతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రెండు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టులుండగా ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. నిర్మాణాల పర్యవేక్షణ చేయాల్సిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల కొరతా వేధిస్తోంది. ఉన్న కొంత మంది సిబ్బంది కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు నగరం మరింత విస్తరించింది. నగరానికి ఆనుకునే ఉన్న మూడు గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి. ఒక్క స్టాంటన్‌పురం గ్రామ పంచాయతీలోనే గతంలో 40కిపైగా అపార్ట్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వగా.. వాటిని గుర్తించి చర్యలు చేపట్టే విషయంలో అధికారులు మొద్దు నిద్రపోతుండడం విడ్దూరం. కఠినంగా వ్యవహరిస్తాం నగరంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలకు తావివ్వం. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠినంగా చర్యలు తీసుకుంటాం. పార్కింగ్ స్థలాలను పార్కింగ్‌కు కాకుండా ఇతరత్రా వినియోగిస్తున్నట్లు మా దృష్టికి తెస్తే వారికి నోటీసులు ఇస్తాం. వ్యాపార సంస్థలకు అద్దెకు ఇస్తున్నట్లు తేలితే చర్యలు తప్పవు. - పీవీవీఎస్ మూర్తి, కమిషనర్, కర్నూలు కార్పొరేషన్ -
నిఘా నేత్రం
కుంటాల/భైంసా రూరల్ : భైంసా పట్టణంలో ప్రతిష్టించిన వినాయకులకు తొమ్మిది రోజులు భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిన పట్టణవాసులు శనివారం నిమజ్జనం చేయనున్నారు. పట్టణ సమీపంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేకంగా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్రెయిన్ తీసుకొచ్చి భారీ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాలపై నిఘా భైంసా పట్టణంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు ఉత్సవాలపై ప్రత్యేక దృష్టిసారించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పికెటింగ్‌లు వేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శోభాయాత్ర నిర్వహించే ప్రధాన రహదారుల్లోని విద్యుత్ తీగలను, కేబుల్ తీగలతో ప్రమాదం లేకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని ట్రాన్స్‌కో సిబ్బందికి ఇప్పటికే అధికారులు సూచించారు. భారీ బందోబస్తు శనివారం భైంసా పట్టణంలో నిమజ్జనోత్స వం సందర్భంగా భైంసా డీఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు శాంతియుతంగా నిమజ్జనోత్సవాలను జరుపుకోవాలని పేర్కొన్నారు. ఇందుకోసం డీఎస్పీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లోని, పట్టణంలోని బెల్టుషాపులు, మద్యం దుకాణాలు మూసివేయించారు. సమావేశాలతో.. ఇప్పటికే పట్టణంలో శాంతి, ఉత్సవ కమిటీ, గణేశ్ మండలీలు, యువజన సంఘాలవారితో పోలీసులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలని నిమజ్జనోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని విన్నవించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రత్యేక బృందాలను మండపాల వద్ద ఏర్పాటు చేసి సమాచారాన్ని తెలుకుంటూ ఉన్నత అధికారులకు చేరవేస్తున్నారు. ఏర్పాట్లలో.. నిమజ్జనోత్సవం కోసం పట్టణంలో మున్సిపల్ వైఎస్ చైర్మన్ జాబిర్‌అహ్మద్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్‌లు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రోడ్లపై మొరం వేసినా అధికారులు గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ప్రత్యేక బారికేడ్లను కట్టారు. క్రేన్ ద్వారా ప్రాజెక్టులో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణేశ్ మండళ్ల సభ్యులు నిమజ్జనోత్సవ శోభాయాత్ర కోసం ట్రాక్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు. మండళ్ల సభ్యులు ప్రత్యేక జనరేటర్లను తెప్పించుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా పట్టణానికి ఇప్పటికే ప్రత్యేక బ్యాండ్ మేళాలు చేరుకున్నాయి. భజన మండళ్ల సభ్యులు, కోలాటాలు వేసేవారు నిమజ్జనోత్సవ శోభాయాత్రకు సిద్ధమవుతున్నారు. శోభాయాత్ర భైంసా పట్టణంలో ఎప్పటిలాగే మొదట గోపాలకృష్ణ మందిరంలోని సార్వజనిక్ గణేశ్ వద్ద, గణేశ్‌నగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ప్రతిష్టించే వినాయకుని వద్ద జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభిస్తారు. అనంతరం పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభిస్తారు. శోభయాత్ర గణేశ్నగర్మీదుగా కోర్వగల్లి, పంజేషాచౌక్ మీదుగా వస్తాయి. నిర్మల్ చౌరస్తాలో ప్రతిష్టించిన వినాయకులు బస్టాండ్ మీదుగా మున్సిపల్ కార్యాలయం నుంచి పంజేషాచౌక్ చేరుకుంటాయి. పంజేషాచౌక్ చేరుకున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర కిసాన్‌గల్లి చేరుకుంటుంది. కిసాన్గల్లిలో ప్రతిష్టించిన వినాయకులను పురాణాబజార్ మీదుగా టీటీడీ కల్యాణ మండపం, కుభీర్ రోడ్డుగుండా తీసుకెళ్లి గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనం చేస్తారు. -
విద్యార్థిపై వార్డెన్ వికృత చేష్టలు
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన సం రక్షకుడే విద్యార్థిపై వికృత చేష్టలకు దిగా డు. తండ్రిలా బాగోగులు చూసుకుంటాడనుకుంటే కీచకుడిగా మారాడు. మాట విన ని సమయంలో కర్రతో చితకబాదాడు. జి ల్లాకేంద్రంలోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని గణేశ్‌నగర్‌లో ఉన్న జాగృతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో వీణవంక మండలానికి చెందిన ఓ విద్యార్థి(14) పదోతరగతి చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం వార్డెన్‌గా వచ్చిన సాయిరాం అతడితో చనువుగా ఉంటూ తన వద్దే పడుకోబెట్టుకునేవాడు. సారు తనను ప్రే మగా చూసుకుంటున్నాడని సంబరపడ్డ సదరు విద్యార్థికి ఆ వార్డెన్ అసలు రంగు తర్వాత తెలిసింది. కొంతకాలానికి విద్యార్థిపై వార్డెన్ వికృత చేష్టలు ప్రారంభించా డు. తన మాట వినాలని, లేకుంటే పరీక్ష ల్లో పాస్ కాలేవని, ఎవరికైనా చెబితే చం పుతానని బెదిరించేవాడు. మాట వినని సందర్భాల్లో కర్రతో చితకబాదేవాడు. అత డి వికృత చేష్టలకు భయకంపితుడైన సద రు విద్యార్థి రాత్రి అయిందంటే చాలు గజ గజ వణికిపోయేవాడు. వార్డెన్ ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నా నిస్సహాయ స్థితిలో ఉన్న అతడు మౌనంగా భరించాడు. ఈ నెల 17న సాయిరాం ప్రవర్తన శ్రుతిమిం చింది. విద్యార్థి సున్నిత భాగాల్లో గాయపరిచాడు. కర్రతో చితకబాదాడు. ఈ సంఘటనతో భయపడ్డ సదరు విద్యార్థికి మరునాడు విపరీతంగా జ్వరం వచ్చింది. వెంట నే పాఠశాల యాజమాన్యం వారు అతడి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయికి జ్వరం వచ్చిందని, తీసుకెళ్లాలని సమాచారం ఇ చ్చారు. ఆదివారం సాయంత్రం తండ్రి అ తడిని ఇంటికి తీసుకెళ్లాడు. మంగళవారం తల్లి స్నానం చేయించడానికి రాగా భయపడ్డాడు. ఎందుకని ప్రశ్నిస్తే వార్డెన్ వికృత చే ష్టల గురించి చెప్పాడు. ఇప్పుడా బాలుడు ఎవరినైనా చూస్తేనే భయపడుతున్నాడు. పాఠశాల ఎదుట ఆందోళన... అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు పెద్ద గా స్పందించక వార్డెన్‌కే వత్తాసు పలికా రు. దీనిపై అగ్రహం వ్యక్తం చేస్తూ వారు పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. ఈ స మాచారం అందుకున్న పలు విద్యార్థి సం ఘాల నాయకులు కూడా పాఠశాల ఎదు ట బైఠాయించి నిరసనకు దిగారు. వెంట నే పాఠశాలను సీజ్ చేసి వార్డెన్‌ను కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలపై దాడి చేశారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్, ఎన్ఎస్యూసీ,టీఎన్ఎ స్ఎఫ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నా యకులు పాల్గొన్నారు. సమాచారం అం దుకున్న డీఎస్పీ రవీందర్, వన్‌టౌన్ సీఐ నరేందర్ అక్కడికి చేరుకుని వారిని శాం తింపజేశారు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్య తీసుకుంటామని చెప్పడంతో బాలుడి తల్లి దండ్రులు వార్డెన్ సాయిరాంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ నరేం దర్ తెలిపారు. వార్డెన్‌పై చర్యలు తీసుకునేలా చూస్తామని ట్రస్మా నాయకులు యాద గిరి శేఖర్‌రావు. సౌగాని కొంరయ్య పేర్కొన్నారు.