కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన సం రక్షకుడే విద్యార్థిపై వికృత చేష్టలకు దిగా డు. తండ్రిలా బాగోగులు చూసుకుంటాడనుకుంటే కీచకుడిగా మారాడు. మాట విన ని సమయంలో కర్రతో చితకబాదాడు. జి ల్లాకేంద్రంలోని ఓ పాఠశాలలో జరిగిన ఈ ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
నగరంలోని గణేశ్‌నగర్‌లో ఉన్న జాగృతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో వీణవంక మండలానికి చెందిన ఓ విద్యార్థి(14) పదోతరగతి చదువుతున్నాడు. ఆరు నెలల క్రితం వార్డెన్‌గా వచ్చిన సాయిరాం అతడితో చనువుగా ఉంటూ తన వద్దే పడుకోబెట్టుకునేవాడు. సారు తనను ప్రే మగా చూసుకుంటున్నాడని సంబరపడ్డ సదరు విద్యార్థికి ఆ వార్డెన్ అసలు రంగు తర్వాత తెలిసింది.
కొంతకాలానికి విద్యార్థిపై వార్డెన్ వికృత చేష్టలు ప్రారంభించా డు. తన మాట వినాలని, లేకుంటే పరీక్ష ల్లో పాస్ కాలేవని, ఎవరికైనా చెబితే చం పుతానని బెదిరించేవాడు. మాట వినని సందర్భాల్లో కర్రతో చితకబాదేవాడు. అత డి వికృత చేష్టలకు భయకంపితుడైన సద రు విద్యార్థి రాత్రి అయిందంటే చాలు గజ గజ వణికిపోయేవాడు. వార్డెన్ ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నా నిస్సహాయ స్థితిలో ఉన్న అతడు మౌనంగా భరించాడు. ఈ నెల 17న సాయిరాం ప్రవర్తన శ్రుతిమిం చింది.
విద్యార్థి సున్నిత భాగాల్లో గాయపరిచాడు. కర్రతో చితకబాదాడు. ఈ సంఘటనతో భయపడ్డ సదరు విద్యార్థికి మరునాడు విపరీతంగా జ్వరం వచ్చింది. వెంట నే పాఠశాల యాజమాన్యం వారు అతడి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయికి జ్వరం వచ్చిందని, తీసుకెళ్లాలని సమాచారం ఇ చ్చారు. ఆదివారం సాయంత్రం తండ్రి అ తడిని ఇంటికి తీసుకెళ్లాడు. మంగళవారం తల్లి స్నానం చేయించడానికి రాగా భయపడ్డాడు. ఎందుకని ప్రశ్నిస్తే వార్డెన్ వికృత చే ష్టల గురించి చెప్పాడు. ఇప్పుడా బాలుడు ఎవరినైనా చూస్తేనే భయపడుతున్నాడు.
పాఠశాల ఎదుట ఆందోళన...
అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు పెద్ద గా స్పందించక వార్డెన్‌కే వత్తాసు పలికా రు. దీనిపై అగ్రహం వ్యక్తం చేస్తూ వారు పాఠశాల ఎదుట నిరసనకు దిగారు. ఈ స మాచారం అందుకున్న పలు విద్యార్థి సం ఘాల నాయకులు కూడా పాఠశాల ఎదు ట బైఠాయించి నిరసనకు దిగారు. వెంట నే పాఠశాలను సీజ్ చేసి వార్డెన్‌ను కఠి నంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాలపై దాడి చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూసీ,టీఎన్‌ఎ స్‌ఎఫ్ ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నా యకులు పాల్గొన్నారు. సమాచారం అం దుకున్న డీఎస్పీ రవీందర్, వన్‌టౌన్ సీఐ నరేందర్ అక్కడికి చేరుకుని వారిని శాం తింపజేశారు. ఫిర్యాదు చేస్తే వెంటనే చర్య తీసుకుంటామని చెప్పడంతో బాలుడి తల్లి దండ్రులు వార్డెన్ సాయిరాంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ నరేం దర్ తెలిపారు. వార్డెన్‌పై చర్యలు తీసుకునేలా చూస్తామని ట్రస్మా నాయకులు యాద గిరి శేఖర్‌రావు. సౌగాని కొంరయ్య పేర్కొన్నారు.
విద్యార్థిపై వార్డెన్ వికృత చేష్టలు
Published Wed, Nov 20 2013 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM
Advertisement
Advertisement