ఆ పాఠశాలకు వెళ్తే.. ప్రాణాలు అరచేతిలో.. | School Building Is In Very Dangerous Condition | Sakshi
Sakshi News home page

ఆ పాఠశాలకు వెళ్తే.. ప్రాణాలు అరచేతిలో..

Published Wed, Mar 6 2019 12:33 PM | Last Updated on Wed, Mar 6 2019 12:34 PM

 School Building Is In Very Dangerous Condition - Sakshi

పెచ్చులూడిన గదిలో పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలు 

సాక్షి, కరీంనగర్‌రూరల్‌: ఒకవైపు శిథిలావస్థకు చేరిన భవనం.. మరోవైపు పైకప్పు పెచ్చులూడుతోంది. ఎప్పుడు పెచ్చులు పైన పడుతాయోనంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు కాలం గడుపుతున్నారు. పాఠశా ల భవనం శిథిలావస్ధకు చేరిందని, మరమ్మతులు చేయించాలంటూ విద్యాశాఖాధికారులకు పలు మార్లు నివేదికలు పంపించినప్పటికీ నిధుల కొరత సాకుతో పట్టించుకోవడం లేదు. తెలుగు మీడియంతో విద్యార్థుల సంఖ్య పడిపోయి పాఠశాల మూతపడే సమయంలో మూడేళ్లక్రితం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్‌ మీడియంతో విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరిగింది.
 

శిథిలావస్థలో గదులు..
కరీంనగర్‌ మండలం గోపాల్‌పూర్‌లో ప్రాథమిక పాఠశాల భవనాన్ని 1979లో అప్పటి కలెక్టర్‌ కేఎస్‌ శర్మ ప్రారంభించారు. దాదాపు మూడు దశాబ్ధాల క్రితం నిర్మించిన ఈ భవనంలో మొత్తం ఆరు తరగతి గదులుండగా వీటిలో 5 శిథిలావస్ధకు చేరాయి. రెండు గదుల్లో గోడలకు పగుళ్లు ఏ ర్పడ్డాయి. ప్రధానోపాధ్యాయురాలు గదితోపా టు మరో రెండు గదుల్లో పైకప్పు పెచ్చులూడిపోయి ఇనుప సలాకాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు పైకప్పు నుంచి పెచ్చూలూడి పైన పడుతాయో తెలియక ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రాణాల ను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. భవనం శిథిలావస్థకు చేరిందని మరమ్మతులు చేయించాలని పలుమార్లు విద్యాశాఖాధికారులకు ప్రధానోపాధ్యాయులు నివేదికలు పంపించినప్పటికీ నిధుల కొరత కారణంతో పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల భవనానికి మరమ్మతు చేయించినట్లయితే విద్యార్థులకు ఉపయోగపడుతుంది.
 

ఇంగ్లిష్‌ మీడియంతో ఆదరణ..
మొదట 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులతో కళకళలాడిన ఈపాఠశాల ప్రైవేట్‌ పాఠశాలల రాకతో 2010 సంవత్సరం నుంచి క్రమేపీ విద్యార్థుల సంఖ్యపడిపోయింది. విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోవడంతో ఉపాధ్యాయులను వేరే పాఠశాలలకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 2014లో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కేవలం 15 మంది విద్యార్థులతో పాఠశాల మూసివేత దిశలో ఉండగా ప్రభుత్వం ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. దీంతో అనూహ్యరీతిలో సమీప గ్రామాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు చేరడంతో 100కు చేరింది. అయితే ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథ కం వర్తింపచేయకపోవడంతో విద్యార్ధుల సంఖ్య క్రమేపీ తగ్గిపోయింది. మూడేళ్ల నుంచి 1వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన తరగతులు నిర్వహిస్తుండటంతో వి ద్యార్థుల సంఖ్య పెరుగుతోంది.  ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో ప్ర స్తుతం 46 మంది విద్యార్థులున్నారు. అంతేకాకుం డా పలు స్వచ్ఛందసంస్థలు, దాతల సహాయంతో విద్యార్థులకు స్కూల్‌ బూట్లు, నోట్‌బుక్స్, పరీక్షా ప్యాడ్లు అందించారు. దూరప్రాంతాల విద్యార్థుల కోసం పాఠశాల ఆధ్వర్యంలో ఆటోసౌకర్యం కూడా కల్పించారు.

ఇంగ్లిష్‌ మీడియంతో ప్రయోజనం..
ఒకప్పుడు విద్యార్థులు లేక మూతపడే పరిస్థితిలో ఉన్న పాఠశాల ఇప్పుడిప్పుడే కో లుకుంటుంది. ప్రైవేట్‌ కా న్వెంట్‌ స్కూళ్లకు చెందిన వ్యాన్లు గ్రామంలోకి రావడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడంలేదు. మూడేళ్లక్రితం ప్రభుత్వం ఇంగ్లిష్‌మీడియం ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దాతల సాయంతో విద్యార్థులకవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. రాబో యే విద్యాసంవత్సరంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, యువకులతో కలిసి విద్యార్థులను చేర్పి ంచేందుకు ప్రచార కార్యక్రమం చేపడుతాం.
– వి.కరుణశ్రీ, ప్రధానోపాధ్యాయురాలు


మరమ్మతు చేయించాలి
శిథిలావస్ధకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు మం జూరు చేయాలి. ప్రభుత్వం పట్టించుకో కుంటే దాతలు, స్థానిక ప్రజాప్రతినిధుల సాయంతో తాత్కాలిక మరమ్మతు చేయించేందుకు విరాళాలను సేకరిస్తాం.
– తుమ్మ అంజయ్య, ఎస్‌ఎంసీ చైర్మన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement