Garikapati Rammohan Rao
-
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
-
బీజేపీలో చేరిన నలుగురు టీడీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు గురువారం బీజేపీలో చేరారు. తెలుగుదేశం ఎంపీలైన సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ గురువారం సాయంత్రం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వీరి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా వారికి పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినట్టు ప్రకటించారు. అయితే, కాలికి గాయం కావడంతో గరికపాటి మోహన్‌రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదని, కానీ, బీజేపీలో చేరేందుకు సమ్మతి తెలుపుతూ ఆయన కూడా పత్రం పంపించారని, దీంతో ఆయనను కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రగతి.. అమిత్ షా నేతృత్వంలో బీజేపీ సాధిస్తున్న విజయాలను చూసి.. ఏపీ ప్రయోజనాల కోసం బీజేపీ చేరాలని చాలాకాలంగా నలుగురు టీడీపీ ఎంపీలు భావిస్తూ వచ్చారని, ఇందులో భాగంగా టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తామని తమను వారు కోరారని తెలిపారు. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్ షా సమ్మతించారని, ఈ మేరకు విలీన పత్రాన్ని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందజేశామని తెలిపారు. విలీనం పూర్తికావడంతో ఇకపై వీరు బీజేపీ ఎంపీలుగా మారిపోయారని తెలిపారు. బీజేపీ సానుకూల రాజకీయాలను విశ్వసిస్తోందని, సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదం ధ్యేయంగా తాము ముందుకు సాగుతామన్నారు. వీరి చేరికల వల్ల ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. సుజనా చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రజల అభీష్టం ఎలా ఉందో స్పష్టమైందని, దీనిని గమనించి.. దేశ నిర్మాణంలో భాగం కావాలని, ఏపీ ప్రయోజనాల కోసం కృషి చేయాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్టు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని, అందువల్ల ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తమ లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4వ పేరాగ్రాఫ్‌లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు తెలిపారు. నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీకి ప్రస్తుతం సీతారామలక్ష్మీ, రవీంద్రకుమార్ మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
భారీ షాక్; రాజ్యసభలో టీడీపీ ఖాళీ!
సాక్షి, న్యూఢిల్లీ : మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఎన్నికల్లో ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యులు ఎంపీలు సుజనా సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు బీజేపీలో చేరనున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుకు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు నలుగురి సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్‌కు అందజేశారు. జాతి ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలు తమను ఆకర్షించాయని లేఖలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ 4 వ పేరగ్రాఫ్లో పేర్కొన్న అంశాలను అనుసరించి తమ పార్టీ సభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీకి ఇక ఇద్దరు రాజ్యసభ సభ్యులు మాత్రమే మిగిలారు. కాగా విజయవాడ ఎంపీ కేశినేని కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో టీడీపీ కాపు నేతలు రహస్యంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షించేందుకే సమావేశమయ్యామని వారు చెబుతున్నా.. పార్టీలో అంతర్గత సంక్షోభానికి ఇది నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదే విధంగా చంద్రబాబు సూచనల మేరకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
టీడీపీలో భారీ సంక్షోభం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ) -
చంద్రబాబు ధనాస్త్రం
అనంతపురం: పదేళ్లుగా వరుస పరాజయాలతో కుదేలైన టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడుకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. రాష్ట్ర విభజనలో రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించడం.. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటాలు చేసి ప్రతిపక్ష పాత్రను పోషించకపోవడం వల్ల ప్రజల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకుతోంది. దాని ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తుందన్న భయంతో అన్నిదార్లూ తొక్కుతున్నారు. ఓటర్లపై ధనాస్త్రాన్ని వాడిగా ప్రయోగిస్తేనే విజయం సాధిస్తామని చంద్రబాబు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే నిధుల సేకరణ, పంపిణీలో నిమగ్నమయ్యారు. భారీగా ఫండ్స్ సేకరణ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహనరావు ద్వారా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే వలసలకు తెరతీశారు. తాము చెప్పిన ప్యాకేజీలకు అంగీకరిస్తే.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఎర వేశారు. వారినుంచి ప్యాకేజీల రూపంలో చంద్రబాబు భారీ ఎత్తున పార్టీ ఫండ్‌ను సేకరించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు అయిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావు సేకరించిన నిధులు.. కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి తీసుకున్న పార్టీ ఫండ్‌ను సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే జిల్లాలకు చేర్చాలని చంద్రబాబు భావించారు. కానీ.. ఆలోగానే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు, జెడ్పీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన విషయం విదితమే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ధనం, మద్యం, అక్రమాయుధాల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి డీజీపీ ప్రసాదరావు భారీ ఎత్తున చెక్‌పోస్టులు ఏర్పాటు చేయించారు. ఇందులో భాగంగా ఒక్క అనంతపురం జిల్లాలోనే 113 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ చెక్‌పోస్టుల్లో రోజూ వారీ చేసే తనిఖీల్లో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తోన్న డబ్బులు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. జిల్లాలకు పార్టీ ఫండ్‌ను చేరవేయడానికి ఏకంగా ఓ పోలీసు ఉన్నతాధికారి సహాయం అర్థించారు. పోలీసు ఉన్నతాధికారి స్వామి భక్తి ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి అనుకూలంగా పోలీసు యంత్రాగాన్ని మలచడంలో కీలక భూమిక పోషించే ఓ పోలీసు ఉన్నతాధికారి ఈ సారికూడా అదే పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నిధులను చేరవేసే బాధ్యతను ఆ పోలీసు ఉన్నతాధికారి తలకెత్తుకున్నారు. చంద్రబాబు తన కోటరీలోని నేతల ద్వారా వివిధ జిల్లాలకు ప్రత్యేక వాహనాల్లో పార్టీ ఫండ్‌ను చేరవేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో ఆ వాహనాలను తనిఖీ చేయడానికి పోలీసులు సిద్ధమైతే.. ఓ పోలీసు ఉన్నతాధికారి లైన్లోకి వస్తూ.. ఆ వాహనాన్ని తనిఖీ చేయకుండా వదిలివేయాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. ఇదే పద్ధతిలో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు పార్టీ ఫండ్‌ను తరలిస్తోన్న వాహనాన్ని సోమవారం అనంతపురం-కర్నూలు జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ఆ వాహనంలోనే చంద్రబాబు కోటరీలోని కీలకనేత ఉండటం.. ఆ నేత తన ఫోన్ ద్వారా ఓ పోలీసు ఉన్నతాధికారితో మాట్లాడించినట్లు సమాచారం. దాంతో.. ఆ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయకుండానే వదిలేశారు. సోమవారం అనంతపురంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు దూత రహస్యంగా సమావేశాన్ని నిర్వహించి.. పార్టీ ఫండ్‌ను పంపిణీ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
టీడీపీ అభ్యర్థులుగా గరికపాటి, తోట నామినేషన్లు
ఎవ్వరికీ సంతకం చేయని చంద్రబాబు మోత్కుపల్లి గైర్హాజరు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారాంకు అందజేశారు. గరికపాటి మూడు సెట్లు, సీతారామలక్ష్మి రెండు సెట్ల నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ఏ ఒక్కరినీ ప్రతిపాదిస్తూ అధినేత చంద్రబాబు సంతకాలు చేయలేదు. నామినేషన్ల దాఖలు కార్యక్రమానికీ వెళ్లలేదు. గరికపాటి, సీతారామలక్ష్మి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై 50 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తనకు అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఎవరినీ ప్రతిపాదించకపోగా, నామినేషన్ల దాఖలు కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. గరికపాటి నామినేషన్ పత్రాలపై పి.అశోక్ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పయ్యావుల కేశవ్ తదితరులు సంతకాలు చేశారు. సీతారామలక్ష్మి పత్రాలపై గాలి ముద్దుకృష్ణమ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి తదితరులు సంతకాలు చేశారు. టీడీపీ అభ్యర్థికే నా ఓటు: జేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే మద్దతిస్తానని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ చెప్పారు. ‘‘టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని చంద్రబాబు ఫోన్ చేశారు. అయితే ఇద్దరు టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. నాకు ఉన్నదే ఒక్క ఓటు. దానిని టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు వేయలేను కదా’’ అని చెప్పారు. మోత్కుపల్లి వద్దకు బాబు రాయబారం సాక్షి, హైదరాబాద్: ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీటు ఇస్తాం. ఖర్చును కూడా మేమే భరిస్తాం’’ అంటూ తెలుగుదేశం సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వద్దకు అధినేత చంద్రబాబు మంగళవారం పలువురు నేతలను రాయబారానికి పంపారు. వారి ప్రతిపాదనను విన్న మోత్కుపల్లి ఏమాత్రం స్పందించలేదు. తన మనసులో ఏముందో కూడా ఆయన బైట పెట్టలేదు. రాయబారానికి వచ్చిన నేతలు మాత్రం.. మోత్కుపల్లి అలక వీడారని, ఇక అంతా ప్రశాంతతేనని చెబుతున్నారు.