Gas reserves
-
‘మహా’ మునక
భూమి లోపల ఉన్న శిలాజ ఇంధన నిల్వలను పూర్తిగా తోడేసినట్లయితే ఒక రోజున మనం అంటార్కిటికా హిమఖండానికి గుడ్‌బై చెప్పక తప్పదని తేలుతోంది. అదే జరిగినట్లయితే ప్రపంచ మహానగరాలు చాలావరకు మునిగిపోయే ప్రమాదం పొంచుకుని ఉంది. కోట్లాది సంవత్సరాల క్రమంలో భూ అంతర్భాగంలో పేరుకుపోయిన బొగ్గు, చమురు, గ్యాస్ నిల్వలను పూర్తిగా దహించివేసినట్లయితే అంటార్కిటికా హిమఖండ ం పూర్తిగా కరిగిపోయి సముద్ర మట్టం 50 నుంచి 60 మీటర్లు (160 నుంచి 200 అడుగులు) పెరుగుతుందని, దీంతో తీర ప్రాంతంలో ఉన్న విశ్వ మహానగరాలు మునిగిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇలా సముద్రంలో కలిసిపోనున్న మహానగరాల్లో టోక్యో, హాంగ్‌కాంగ్, షాంఘై, హాంబర్గ్, న్యూయార్క్‌తో పాటు మన కోల్‌కతా, చెన్నై, ముంబై కూడా ఉన్నాయని అంచనా. ఇప్పటికే సముద్ర మట్టానికి సమాన స్థాయిలో ఉంటున్న వందకోట్ల జనాభా కలిగిన తీరప్రాంత నగరాలు ఉనికిని కోల్పోనున్నాయి. అంటార్కిటికా ఆ స్థాయిలో కరిగిపోకూడదంటే శిలాజ ఇంధనం జోలికి వెళ్లకూడదని, వాతావరణంలోకి కార్బన్‌ను వదలకూడదని విజ్ఞుల ఉవాచ. -
గోదావరీ తీరంలో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక సమీపంలో గోదావరి తీరాన కొండుకుదురులంక ద్వీపంలో గ్యాస్ నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు ఆయిల్ ఇండియా సంస్థ తన అన్వేషణలో గుర్తించింది. గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేందుకు నాబార్స్ అనే అంతర్జాతీయ డ్రిల్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ, రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు ఆన్‌షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాల ద్వారా చమురు, సహజ వాయువులను వెలికితీస్తున్న సంగతి తెలిసిందే. -
రెండు విడతలుగా ఓఎన్జీసీ డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియాలో వాటాల విక్రయాన్ని రెండు విడతలుగా చేపట్టాలని కేంద్రం యోచిస్తోన్నట్లు సమాచారం. సరైన విలువను రాబట్టాలనే ఉద్దేశమే ఇందుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత డిజిన్వెస్ట్‌మెంట్ తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఓఎన్జీసీలో 5 శాతం, కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి క్యాబినెట్ ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఓఎన్జీసీ ద్వారా రూ. 11,477 కోట్లు, కోల్ ఇండియా ద్వారా రూ. 15,740 కోట్లు రావొచ్చని అంచనా. అయితే డిజిన్వెస్ట్‌మెంట్ విషయంలో ఇంకా చాలా ఆటంకాలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఓఎన్జీసీకి చెందిన కేజీ-డీ5 బ్లాకులో గ్యాస్ నిక్షేపాల అభివృద్ధిలో జాప్యం వెనుక కారణాలపై విచారణ జరుపుతున్న కమిటీ డిసెంబర్ 24 నాటికి నివేదిక సమర్పించగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పొరుగునే ఉన్న కేజీ-డీ6 బ్లాకులో రిలయన్స్ సంస్థ చమురు, గ్యాస్ ఉత్పత్తి దాదాపు నాలుగయిదేళ్ల క్రితమే ప్రారంభించేసింది. కానీ, కేజీ-డీ5లో ఓఎన్జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచి ఉత్పత్తి ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. కంపెనీ అంచనాల ప్రకారం 2018 నుంచి గ్యాస్, 2019 నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలోనే జాప్యంపై హైడ్రోకార్బన్స్ రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్ సారథ్యంలోని కమిటీ విచారణ చేపట్టింది.