gastroenteritis
-
బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగేశాడు.. చివరికి..
జమైకా: కుటంబసమేతంగా విహారయాత్రకు వెళ్లిన బ్రిటీషతను ఒక బార్లో ఉన్న అన్ని కాక్ టెయిల్ డ్రింకులను తాగే ప్రయత్నం చేసి అనారోగ్యం పాలై అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో మృతి చెందిన సంఘటన జమైకాలోని సెయింట్ ఆన్స్ లో చోటు చేసుకుంది. దీంతో విహారయాత్ర కాస్తా విషాదాంతమైంది. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్(53) తన సహోదరి, పిల్లలతోపాటు ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేద్దామని జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు. అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నిటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అన్ని కాక్ టెయిళ్ళు తాగాక కడుపంతా కకావికలమై హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యుల్లో ఒకామె తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత బిగ్గరగా కేకలు వేసినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు గగ్గోలు పెట్టి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంతగా పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడని చెప్పారామె. పోలీసుల ప్రాధమిక విచారణలో అప్పటికే తెల్లవార్లూ బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారు. వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు. ఇదిలా ఉండగా అత్యవసర సమయంలో సాయం చేయడానికి సిబ్బంది లేకపోవడం వలననే తిమోతి చనిపోయినట్లు అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బక్రీద్ వేళ.. అక్కడ మేకల్ని ఎత్తుకెళ్తున్నారు! -
వింత వ్యాధి... రోజుకు 70 సార్లు వాంతులు... కానీ అంతలోనే!
ఏదైన వ్యాధి వస్తే తొందరగా తగ్గిపోయేంత వరకు మనస్సు ఒక పట్టాన కుదుటపడదు. అలాంటిది కొన్ని అరుదైన వ్యాధులతో పోరాడతూనే మరోవైపు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏ చిన్న అవకాశమైన దొరక్కుండా పోతుందా అనే ఆశతో ఎదురుచేసేవాళ్లను చూస్తే చాలా బాధనిపిస్తుంది కదూ. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతోంది. (చదవండి: టెన్నిస్ ప్లేయర్ ఆచూకిని సరైన ఆధారాలతో సహా తెల్పండి) అసలు విషయంలోకెళ్లితే....బోల్టన్‌కు చెందిన లీన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటూ అరుదైన పరిస్థితితో జీవితాన్ని గడుపుతోంది. పైగా ఆమె నిరంతర వికారం కడుపు నొప్పి కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదు ఆమె ఈ సమస్య కారణంగా ఏమి తినలేక జీర్ణించకోలేక అత్యంత బాధను అనుభవిస్తున్న సందర్భాలు అనేకం. అయితే ఆమెకు ఈ వ్యాధి ఉన్నట్లు తొలిసారిగా 2008లో గుర్తించడమే కాక గ్యాస్ట్రోపరేసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమెకు గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్‌ను అమర్చారు. అయితే ఆ పరికరానికి సంబంధించిన బ్యాటరీ అయిపోవడంతో పరిస్థితి మళ్లీ యథావిధికి వచ్చేసింది. పైగా ఆ బ్యాటరీలు చాలా అరుదుగా లభిస్తాయని, వాటిని మార్చడం కోసం దగ్గర దగ్గరగా సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు ఆమె ఈ వ్యాధి కారణంగా ఉద్యోగానికి దూరమవ్వడమే కాక కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె తను ఏవిధంగానైన తన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయంతో గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్ కొత్తబ్యాటరీ కోసం కావల్సిన డబ్బుల నిమిత్తం "గో ఫండ్ మీ" అనే వెబ్‌పేజీ ఓపెన్ చేసి తన శస్త్రచికిత్సకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో తనకు ఎవరైనా సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఆ వెబ్‌పేజ్‌కి సుమారు రూ. 3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. ఏది ఏమైన ఆమె ఆశావాహదృక్పథానికి అభినందిస్తూ...లీన్నే శస్త్ర చికిత్సకు కావల్సిన డబ్బులు సమకూరి త్వరితగతిన ఆ అరుదైన వ్యాధి నుండి బయటపడాలని ఆశిద్దాం. (చదవండి: అమెజాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పై నార్కోటిక్ డ్రగ్స్ కేసు) -
ఆపిల్ జ్యూస్‌తో గ్యాస్ట్రో, డీహైడ్రేషన్‌కు చెక్
టొరంటో: గ్యాస్ట్రో, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆపిల్ జ్యూస్‌తో మంచి ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స చేయించుకున్న పిల్లలకంటే ఆపిల్ జ్యూస్ సేవించిన పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ‘గ్యాస్ట్రో, డిహైడ్రేషన్ సమస్యలు చాలా సాధరణమైనవే అయినా వీటితో బాధపడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటువంటివారు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల సమస్యలు రాకుండా అడ్డుకట్ట పడుతుంది. అయితే తక్కువ డిహైడ్రేషన్కు గురైన పిల్లల్లో మాత్రం ఆపిల్ జ్యూస్ ఎటువంటి ఫలితాన్నివ్వలేకపోయింది. 6 నుంచి 60 నెలల పిల్లలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంద’ని కాల్గరీ యూనివర్సిటీ(కెనడా) శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.