
ఆపిల్ జ్యూస్‌తో గ్యాస్ట్రో, డీహైడ్రేషన్‌కు చెక్
గ్యాస్ట్రో, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆపిల్ జ్యూస్‌తో మంచి ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
టొరంటో: గ్యాస్ట్రో, డీహైడ్రేషన్ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు ఆపిల్ జ్యూస్‌తో మంచి ఉపశమనం లభిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స చేయించుకున్న పిల్లలకంటే ఆపిల్ జ్యూస్ సేవించిన పిల్లల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
‘గ్యాస్ట్రో, డిహైడ్రేషన్ సమస్యలు చాలా సాధరణమైనవే అయినా వీటితో బాధపడుతున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ఇటువంటివారు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల సమస్యలు రాకుండా అడ్డుకట్ట పడుతుంది. అయితే తక్కువ డిహైడ్రేషన్‌కు గురైన పిల్లల్లో మాత్రం ఆపిల్ జ్యూస్ ఎటువంటి ఫలితాన్నివ్వలేకపోయింది. 6 నుంచి 60 నెలల పిల్లలపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంద’ని కాల్గరీ యూనివర్సిటీ(కెనడా) శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.