gated communities
-
‘గేటెడ్’ నేరాల నిరోధానికి యాప్
సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో నేరాల నిరోధానికి ఒక యాప్‌ను రూపొందించాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఇతర నివాసితులకు ఇబ్బందులు కలిగించేలా చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపడితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. హద్దు మీరితే హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి ఫేజ్–13లోని ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లాస్ క్లబ్ హౌస్ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిందని.. దీనిపై ఫిర్యాదు చేసినా యాజమాన్య సంఘం చర్యలు తీసుకోవడంలేదంటూ హరిగోవింద్ ఖురానారెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. కమిషనర్లకు అధికారం.. హైదరాబాద్ పోలీస్ చట్టంలోని సెక్షన్ 22 కింద ఊరేగింపుల నియంత్రణ, వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో క్రమశిక్షణ పాటించటం, ఏదైనా వీధి లేదా బహిరంగ ప్రదేశాల్లో సంగీతం, పాటల నియంత్రణ, హైదరాబాద్ సిటీ లౌడ్ స్పీకర్ నియమాలు–1963, హైదరాబాద్, సికింద్రాబాద్ (పబ్లిక్ ప్లేస్ ఆఫ్ హాల్ట్/పీస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్/ అమ్యూజ్మెంట్) నియమాలు–2005, శబ్ద కాలుష్య (నియంత్రణ) నియమాలు–2000, జీవో 172లోని పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ (ఈఎన్‌వీ) నిబంధనల ప్రకారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అధికారం కమిషనర్, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు ఉంది అని హైకోర్టు స్పష్టంచేసింది.తీర్పులో పేర్కొన్నసూచనలు, ఆదేశాలు..1) ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ విల్లా ఓనర్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుల నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన ఉప కమిటీని ఏర్పాటు చేయాలి. వీరు ప్రధానంగా సీనియర్ సిటిజన్లు/మహిళలు/రిటైర్డ్ ఉద్యోగులై ఉండాలి. వీరు క్లబ్‌హౌస్ వంటి ప్రదేశాల్లో నిఘా ఉంచవచ్చు. 2) అసోసియేషన్ ఓ యాప్ లాంటి ప్లాట్‌ఫామ్/అప్లికేషన్‌ను రూపొందించాలి. దీని ద్వారా సభ్యులు ఫిర్యాదులు/సందేశాలను పంపవచ్చు. దీని నిర్వహణకు ప్రత్యేక టీమ్ ఉండాలి. సబ్–కమిటీ సభ్యులు మాత్రమే యాక్సె స్ కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలి. ఫిర్యాదులు/సందేశాలను ఆ సభ్యులకు పంపాలి. సబ్–కమిటీ సభ్యులు ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచాలి. 3) వచి్చన ఫిర్యాదులపై వెంటనే చర్య తీసుకొని కార్యనిర్వాహక కమిటీకి నివేదించాలి. ఏదైనా చట్టవిరుద్ధమైన చర్యలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 4) గేటెడ్ కమ్యూనిటీ క్లబ్‌హౌస్ వినియోగానికి అసోసియేషన్ నిర్దిష్టంగా చేయవలసినవి, చేయకూడని పనుల జా బితాను రూపొందించాలి. క్లబ్‌హౌస్‌ను దుర్వినియోగం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. 5) నగర పోలీసు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి, నేరాల నియంత్రణకు, ఇతర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లకు అవసరమైన సలహాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 6) వేధింపులు, నేరాలు జరిగినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలో తగిన చర్యలు తీసుకోవడానికి సంబంధిత పోలీస్ స్టేషన్/టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సూచనలను కూడా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేయాలి. 7) వీలైతే గేటెడ్ కమ్యూనిటీలు/అసోసియేషన్లు/ఫ్లాట్ అసోసియేషన్లలోని నేరాలపై ఫిర్యాదు చేయడానికి, సమాచారం ఇచ్చే వ్యక్తి/ఫిర్యాదుదారుడి గుర్తింపును గోప్యంగా ఉంచేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అప్లికేషన్ (యాప్)ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అందించాలి. -
Hyderabad: కొత్త పుంతలు తొక్కుతున్న సిటీ కల్చర్
నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు చిన్నపాటి అందమైన ఊళ్లను తలపిస్తున్నాయి. వీటి నిర్వహణా వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న ఆరోగ్యకరమైన పోటీ సిటీలో వేళ్లూనుకున్న గేటెడ్ కల్చర్‌కు కొత్త రంగులు అద్దుతోంది. అయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పుకున్నంత గర్వంగా ఐయామ్ బిలాంగ్స్ టు పలానా కమ్యూనిటీ అని చెప్పుకునేలా నిర్వహణ కాంతులీనుతోంది.బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశుడి లడ్డూ వేలంలో రూ.1.26 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. కరోనా టైమ్‌లో కోకాపేట్‌లోని రాజపుష్పా ఆట్రియా రికార్డ్ స్థాయిలో వ్యాక్సినేషన్ డ్రైవ్స్ అద్భుతంగా నిర్వహించి తమ కమ్యూనిటీని కరోనా కేసుల్లో జీరోకి చేర్చారు. వందల సంఖ్యలో కుటుంబాలు నివసించే గేటెడ్ కమ్యూనిటీల్లో ఉట్టిప డుతున్న ఐక్యతకే కాదు నిర్వహణా సామర్థ్యానికి కూడా ఇవి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.సెక్యూరిటీలో హై‘టెక్’.. సీసీ టీవీలు, కెమెరాలు అనేవి ప్రతి కమ్యూనిటీలో ఇప్పుడు సర్వసాధారణం. కాగా బయోమెట్రిక్ ఫేస్ రికగ్నైజేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నివాసితుల భద్రతకు భరోసా ఇస్తున్నారు. ఇక అత్యంత సుశిక్షితులైన సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుంటున్నారు. టోల్ గేట్ తరహాలో ప్రతి వాహనానికీ ఒక ఆర్ఎఫ్ఐడీ ఇస్తున్నారు. ఆ ఐడీ ఉన్న వాహనం వస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది. ప్రతి గంటకూ ఒకసారి డ్రోన్స్‌తో తనిఖీలు చేసేందుకు త్వరలోనే ఏర్పాట్లు చేయనున్నామని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి చెప్పడం ప్రస్తావనార్హం.నిర్వహణలో నీట్‌గా.. వసతులు కలి్పంచడంలో మాత్రమే కాదు మెయిన్టెనెన్స్ వసూళ్లలో సైతం కమ్యూనిటీలు పోటీపడుతున్నాయి. గత నాలుగేళ్లలో సిబ్బందికి ఏటా పది శాతం జీతాలు పెంచుతూనే, నివాసితులకు మాత్రం నిర్వహణా వ్యయం రూపాయి కూడా పెంచకుండా మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీల నిర్వహణ చరిత్రలో కొత్త రికార్డ్ సృష్టించింది. మరోవైపు కమ్యూనిటీ పరిధిలో నాలుగేళ్లలో 70కి పైగా సీసీటీవీలు ఏర్పాటు చేయడం ద్వారా నివాసితుల భద్రత పటిష్టంగా మార్చారు. నివాసితుల సమస్యల పరిష్కారానికి బ్లాక్స్ వారీగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. బిల్డర్ నిర్ణయించిన మెయిన్టెనెన్స్ ఛార్జీలను కమ్యూనిటీ, ఇతరత్రా ఆదాయ మార్గాలు ద్వారా తగ్గించుకుంటున్నాయి. అభివృద్ధి కోసం సమావేశాలువినాయకచవితి మొదలుకుని దాదాపు అన్ని కుల మతాలకు చెందిన పండుగలనూ ఘనంగా నిర్వహిస్తూనే, వరల్డ్ కప్ విజయం లాంటి అపురూప సందర్భాలకూ అప్పటికప్పుడు స్పందిస్తూ కార్య క్రమాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి నుంచి సంవత్సరారంభం దాకా కాదేదీ సెలబ్రేషన్‌కి అనర్హం అన్నట్టు గేటెట్ కమ్యూనిటీలు సందడి చేస్తున్నాయి. నల్లగండ్లలోని అపర్ణ సైబర్ కమ్యూన్లో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా 5వేల లాంతర్లతో సంబరాలు చేశారు. నానక్‌రామ్‌గూడలోని మై హోమ్ విహంగలో అన్నదానాలు నిర్వహించారు. ఇక డ్రగ్స్, సైబర్ నేరాలు తదితర అంశాల మీద అవగాహన, యోగ, ధ్యానంపై శిక్షణా కార్యక్రమాలు రోజువారీగా జరుగుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచిన కరోనా... ఆధునిక వసతుల్లో పోటీపడుతున్న గేటెడ్ కమిటీలన్నీ సంపూర్ణంగా ఆరోగ్యసేవలపై శ్రద్ధ పెట్టేలా చేసిన ఘనత కరోనాదే. మహమ్మారి విజృంభణ సమయంలో ఈ కమిటీలన్నీ బలోపేతం అవడమే కాకుండా వ్యాక్సినేషన్, శానిటైజేషన్ వంటి అంశాల్లో పోటీ.. వంటివి గేటెడ్ కమ్యూనిటీలను శక్తివంతగా మార్చాయి. ఆక్సిజన్ ప్లాంట్లు, అంబులెన్స్‌లూ ఏర్పాటు చేసుకున్నారు. ఒంటరి వృద్ధుల కోసం 14 ఆస్పత్రులతో, డయాగ్నసిస్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నామని, అలాగే క్లినిక్, ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నామని గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధి బద్రీనాథ్ చెప్పడం గమనార్హం.ప్రోత్సహిస్తున్నాం.. అవార్డులు ఇస్తున్నాం..మా పరిధిలో అనేక గేటెడ్ కమ్యూనిటీలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నివాసితులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. నిర్వహణలో పోటీ తత్వాన్ని మరింత పెంచడానికి వారి సేవల్ని అభినందించడానికి మేం అవార్డులు ఇస్తున్నాం. తాజాగా పచ్చదనం విషయంలో మే ఫెయిర్ విల్లాస్‌కు ఇచ్చాం. ఇందులో ఎకరం స్థలంలో ఫారెస్ట్ పెంచారు. అంతేకాక 800, 900 ఏళ్ల నాటి చెట్లను రీలొకేట్ చేశారు. అదే విధంగా అత్యాధునిక మోషన్ కెమెరాలు వినియోగిస్తున్న ఇని్ఫనిటీ విల్లాస్‌కు బెస్ట్ సెక్యూరిటీ అవార్డు ఇచ్చాం. అలాగే వ్యర్థాల రీసైక్లింగ్‌లో అద్భుత పనితీరు కనబరుస్తున్న ముప్పా ఇంద్రప్రస్థకు బెస్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ గుర్తింపుని అందించాం. – రమణ, అధ్యక్షులు, తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్స్పర్యావరణ హితం.. పురస్కార గ్రహీతలం‘సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండే దానికి మించి మా కమ్యూనిటీలో 45 నుంచి 50 శాతం ఎక్కువ పచ్చదనం ఉన్నట్టు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్స్ (ఐజీబీసీ) గుర్తింపుని ఇచి్చంది’ అని చెప్పారు ఖాజాగూడ నుంచి నానక్‌రామ్ గూడ వైపు వెళ్లే దారిలోని చౌరస్తాలో ఉన్న గ్రీన్ గ్రేస్ గేటెడ్ కమ్యూనిటీ కి చెందిన బద్రీనా«థ్. సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్స్, బాత్రూమ్ సింకులు తదితరాల నుంచి పోయే వేస్ట్ వాటర్‌ని రీసైకిల్ చేసి గార్డెనింగ్, కారిడార్స్, రోడ్ల శుభ్రతకు వినియోగిస్తున్నారు. పర్యావరణ హిత కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి గతంలో తాము కట్టిన రూ.10 లక్షలు నీటి బిల్లులకు డిపాజిట్‌గా మారి గత 45 నెలల నుంచి మాకు నీటి బిల్లు కట్టే అవసరం లేకుండా పోయిందని చెబుతున్నారు. అంతే కాక ఐజీబీసీ గుర్తింపు వల్ల ఆస్తి పన్నులో 20 శాతం రిబేటు కూడా సాధించగలిగామని చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్న తొలి గేటెడ్ కమ్యూనిటీ తమదేనని డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆటోమేటిక్ రెస్క్యూ డివైజెస్ వల్ల కరెంట్ పోయినా లిఫ్ట్ మధ్యలో ఆగకుండా మరో ఫ్లోర్ దాకా వెళ్లి ఆగి డోర్ తెరుచుకుంటుంది. ఇలాంటి ఎన్నో పకడ్బందీ ఏర్పాట్ల ద్వారా నివాసితులకు మేలు చేయడంతో పాటు పురస్కారాలెన్నో అందుకున్నాం. – బద్రీనాధ్, గ్రీన్ గ్రేస్ కమ్యూనిటీ -
ఫ్లాట్ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? ఏం చేస్తే బెటర్!
సాక్షి, హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు ఎంత వ్యయమవుతోందో.. అదే స్థాయిలో వసతుల చార్జీలూ తడిసిమోపెడవుతున్నాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్వా్కష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ పిచ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ పార్క్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ హాల్, గెస్ట్ రూమ్స్, 7 స్టార్ రెస్టారెంట్.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ ధరలోనే వసతుల చార్జీలు కూడా కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్, గ్రీనరీ, పైప్డ్ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము పేరిట రూ.2– 3 లక్షల వరకూ బాదుతున్నారు. చదవండి: గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్ రికార్డు ఓసీ రాకముందే వసూళ్లు.. ► ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. నిర్మాణ సంస్థలు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ విభాగాలు సైతం నియంత్రించడంలేదు. ► మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్.. అంటూ కొనుగోలుదారుకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను పర్యవేక్షించే వారే కరువయ్యారు. ► భౌతికంగా ఆయా వసతులను డెవలపర్ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం ఉండదు. వెంచర్లలో రిసార్ట్ అంటూ.. ► ఓపెన్ ప్లాట్లు చేసే బిల్డర్లు అపార్ట్మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలోనూ కల్పిస్తామంటూ భారీగా వసూలు చేస్తున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదా రులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే. కానీ.. బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ► వీకెండ్ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్ కోర్స్, క్లబ్‌హౌస్ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇలా చేయొచ్చు. ► అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే భరించాలి. ఒకే ఏరియాలో ఉండే 3– 4 ప్రాజెక్ట్‌లకు ఒకే క్లబ్‌హౌస్ కట్టుకోవటం ఉత్తమం. ► అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకేలా ఉండాలి. ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. ►హౌసింగ్ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. ప్రచారంగా మారిన వసతులు కొనుగోలుదారులను ఆకర్షించాలంటే ఆధునిక వసతులనేవి అనివార్యం. పిల్లలు, యువత, పెద్దల కోసం వేర్వేరుగా వసతులకు ఎక్కువ స్థలం వదలాల్సి ఉంటుంది. ఆ స్థలం ధర, వసతుల కల్పనకు అయ్యే ఖర్చు అన్నింటినీ కొనుగోలుదారుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. సౌకర్యాలతో పాటు ఇంటి విలువ కూడా పెరుగుతోంది. దీంతో అపార్ట్మెంట్ ధరలో 10– 15 శాతం వరకు వసతుల చార్జీలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ వసూలు చేయడం సరికాదు. – ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ కార్పడ్ ఫండ్ లెక్కించడంలేదు.. పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశాను. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయింది. ఆ సమయంలో కార్పస్ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్మెంట్ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్ ఫండ్ పరిగణనలోకి తీసుకోవటం లేదు. – అజయ్, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి అదనంగా రూ.10లక్షలు చెల్లించా స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లలకు క్రచ్, ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. ప్రస్తుతం బెంగళూరుకు బదిలీ అయింది. అపార్ట్మెంట్ సొసైటీకి అప్పగించిన రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. – ఉజ్వల్, ఐటీ ఉద్యోగి -
మైలో, మైగేట్కు పెరుగుతున్న ఆదరణ.. ఇంతకు ఏంటివి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ సిటీలో ఇప్పుడు మొబైల్ యాప్‌ల ట్రెండ్ నడుస్తోంది. వందలకొద్దీ కుటుంబాలు నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీల్లో వీటికి ఆదరణ మరింత పెరిగింది. ఇరుగు..పొరుగు ఎవరుంటారు? వారి ఇష్టాఇష్టాలేమిటి? రోజువారీగా ఈ సముదాదాల నివాసాలకు బయటి వ్యక్తులు ఎవరు.. ఎప్పుడు వస్తున్నారు.. వంటి సమస్యలను పరిష్కరించేందుకు సపర్లోకల్ మొబైల్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వారి కోసం మైలో, మైగేట్ వంటి సూపర్ మొబైల్యాప్ల వినియోగంలోకి రావడంతో నగరవాసులకు ప్రతి పనీ సులభతరమవుతుండడం విశేషం. మైలోకు.. మహా ఆదరణ మియాపూర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న వెంకట్‌కు క్రికెట్ అంటే మహా ఇష్టం. కానీ తానుండే ప్రదేశంలో తనలా ఆ ఆటపై ఆసక్తి ఉన్న వారెవరో తెలియదు. తన అభిరుచులు, ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉన్నవారితో స్నేహం చేయడమేకాదు.. వీలుంటే క్రికెట్ ఆడేందుకు స్నేహితులను కలుపుతోందీ ఈ ‘మైలో’ మొబైల్యాప్. నగరానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీ సిద్ధం చేసిన ఈ యాప్‌ను పలు గేటెడ్ కమ్యూనిటీల్లో వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా ఇరుగుపొరుగు వారిని మరింత దగ్గరచేయడం, ఇష్టాయిష్టాలు, అభిరుచులు పరస్పరం పంచుకోవడం. కష్ట సుఖాలు షేర్ చేసుకునేందుకు ఈ యాప్ ఓ అవకాశం కల్పిస్తుండడం విశేషం. ఇది యాప్‌ల కాలమనీ.. ►నెటిజన్లుగా మారిన మహానగర సిటీజన్లు.. ఐటీ, బీపీఓ, కేపీఓ, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు, విద్యార్థులు, వయోధికులు, మహిళలు, చిన్నారులు.. రోగులు ఇలా అన్ని వర్గాల వారికీ కోరిన సేవలను ఇంటి ముందుకు తీసుకొచ్చేందుకు మొబైల్ యాప్స్ అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. ►ఆహారం, ఔషధాలు, వైద్యసేవలు, వైద్యపరీక్షలు, వివిధ రకాల సేవలు, షాపింగ్ తదితర అవసరాలను తీర్చే యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తరుణంలో ఇప్పుడు సపర్ లోకల్ మొబైల్ యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి ఇటీవలి కాలంలో విశేష ప్రజాదరణ పొందుతుండడం నయా ట్రెండ్‌గా మారింది. మై గేట్‌తో మరో సౌలభ్యం.. ►గేటెడ్ కమ్యూనిటీల్లో స్థానికుల అవసరాలను తీరుస్తున్న మరో యాప్ ‘మైగేట్’ మొబైల్ యాప్. ఈ యాప్ ద్వారా ఆయా నివాస సముదాయాలకు బయటి వ్యక్తులు, వర్కెటింగ్ సిబ్బంది తదితరులు ఎవరు..ఏయే సమయాల్లో వచ్చారు? పిల్లల స్కూల్ వ్యాన్ ఏ సమయానికి వస్తుంది? క్యాబ్ సర్వీసులు ఏ సమయంలో లోపలికి వచ్చాయి? పనిమనిషి ఏ సమయంలో లోనికి ప్రవేశిస్తుంది.. తొలుత ఎవరి ఇంట్లో పని చేస్తుంది. ఆమె తీరిక వేళలు ఏమిటి..మీ ఇంటికి వచ్చేందుకు ఆమెకు ఏ సమయంలో వీలవుతుంది? తదితర వివరాలన్నీ నోటిఫికేషన్స్, అలర్ట్ రూపంలో మొబైల్‌కు అందనుండడం విశేషం. ►ఈ యాప్‌లు భద్రమే కాకుండా.. ఆయా పనులను సులభతరం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బెంగళరు, ఢిల్లీ, చెన్నై తదితర నగరాల్లో సపర్లోకల్ మొబైల్ యాప్‌లను గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు విరివిగా వినియోగిస్తున్నారని.. నగరంలోనూ ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో జోరందుకుందని చెబుతున్నారు. -
Solar Power: హైదరాబాద్ నగరంలో పవర్ హౌస్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగం విషయంలో గ్రేటర్ వైఖరి మారుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పంపిణీ సంస్థలపై ఆధారపడ్డ గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, టౌన్‌షిప్‌లు.. సొంత ఉత్పత్తిపై దృష్టి సారించాయి. భవనాలపై సోలార్ రూఫ్ టాప్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని అవసరాలకు సరిపడా సొంతంగా విద్యుత్ తయారుచేసుకుంటున్నాయి. అంతేకాకుండా మిగులు విద్యుత్‌ను పంపిణీ సంస్థలకు సరఫరా చేసి.. నెలవారీ బిల్లులను సగానికిపైగా తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 9,515 సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల నుంచి 212 మెగావాట్లకుపైగా విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా.. గ్రేటర్ పరిధిలోని 8,309 సోలార్ మీటరింగ్‌లో అత్యధికంగా 143.3 మెగావాట్ల విద్యుత్ గ్రేటర్‌లోనే ఉత్పత్తి అవుతోంది. సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఒకసారి ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే.. 25 ఏళ్ల పాటు కరెంట్‌కు ఢోకా లేకపోవడంతో ఇళ్ల యజమానులు దీనిపై దృష్టి సారించారు. ప్రత్యక్షంగా నెలవారీ బిల్లులను తగ్గించుకోవడమే కాకుండా.. సంస్థపై విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని కూడా తగ్గిస్తున్నారు. సోలార్ ప్యానెళ్లకు తయారీ కంపెనీ పదేళ్ల గ్యారంటీ ఇస్తోంది. ఆ తర్వాత వార్షిక నిర్వహణ ఒప్పందానికి అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు తతెత్తితే.. టీఎస్రెడ్కోలో కానీ, ఇంటిగ్రేటెడ్ సెంటర్లో కానీ ఫిర్యాదు చేస్తే.. నిపుణులు వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. మచ్చుకు కొన్ని ►బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఓ బహుళ అంతస్తుల నివాస సముదాయంలో 518 కుటుం బాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలకు నెలకు రూ.12 నుంచి 14 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు యజమానులంతా కలిసి రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూఫ్‌టాప్ పలకలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం నెలకు 85 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా నెలవారీ విద్యుత్ బిల్లు రూ.4 నుంచి 6 లక్షలకు తగ్గింది. ►నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో సౌర ఫలకం సగటున ఏడాది 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ యూనిట్‌కు రూ.9 చెల్లిస్తుంది. తాజా సౌర విద్యుత్ ఉత్పత్తితో తన విద్యుత్ ఖర్చును ఏడాదికి రూ.1.50 కోట్లకు తగ్గించుకుంది. ►రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలోని పరిపాలనా భవనాలు సహా విద్యార్థి వసతి గృహాల వార్షిక కరెంట్ బిల్లు రూ.కోటికిపైగా వచ్చేది. సౌర ఫలకాల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. ►శామీర్‌పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ 710 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లులు తగ్గించుకున్నారు. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ఫలకాలను బిగించడంతో నెలకు రూ. 2.5 లక్షల బిల్లు ఆదా అవుతోంది. ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. సాధారణ విద్యుత్ కనెక్షన్‌తో పోలిస్తే.. సోలార్ ఫలకాలు కొంత ఖర్చుతో కూడింది. ఒకసారి పెట్టుబడి పెడితే ఎక్కువ కాలం లబ్ధి చేకూరే అవకాశం ఉండటంతో వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఔత్సాహికులకు ఒకటి నుంచి 3 కిలోవాట్లకు 40 శాతం, 3 నుంచి 500 కిలోవాట్ల వరకు 20 శాతం సబ్సిడీ ఇస్తోంది. – రఘుమారెడ్డి, సీఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది మా గేటెడ్కమ్యూనిటీలో 10 బహుళ అంతస్తుల భవనాలు ఉన్నాయి. వీటికి గతంలో నెలకు రూ.14 లక్షల వరకు కరెంట్ బిల్లు వచ్చేది. 2019 జూలైలో రూ.2.6 కోట్లతో సోలార్ రూప్‌టాప్ ఫలకాలు ఏర్పాటు చేశాం. దీంతో నెలవారీ కరెంట్ బిల్లు రూ.6 లక్షలకు పడిపోయింది. వేసవికాలంలో ఉత్పత్తి ఎక్కువగా వస్తోంది. తమ అవసరాలు తీరగా.. మిగిలిన విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాం. – కె.యాదగిరిరెడ్డి, అధ్యక్షుడు, గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ (చదవండి: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ? ) -
హైదరాబాద్‌లో పెరుగుతున్న విల్లా కల్చర్
ఊరి బయట ఉండాలి.. అంగట్లో అన్నీ ఉండాలి.. ఇప్పుడు నగరవాసులకు కావల్సిందిదే.. దాని కోసం ఖర్చుకూ వెనుకాడటం లేదు.. ఒక్కో విల్లాను అర ఎకరం, ఎకరం విస్తీర్ణంలోనూ నిర్మిస్తున్నారు. దానికి తగ్గట్లే శివార్లలో విల్లా కల్చర్ కొత్త సొబగులు అద్దుకుంటోంది.. మినీ నగరాల సృష్టికి నాంది పలుకుతోంది.. పుణే, ఢిల్లీ, ముంబై వంటి మెట్రోలకు దీటుగా బెంగళూర్, మేడ్చల్, శ్రీశైలం హైవేల మీద ఈ కల్చర్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ కల్చర్‌లో భాగంగా.. ఒకే ప్రాంగణంలో పదులు, వందల సంఖ్యలో ఇళ్లు లేదా ఫ్లాట్స్ ఉండటం, నివాసితులకు అవసరమైన విధంగా జిమ్స్, క్లబ్ హౌస్‌లు... వంటివాటిని నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. అయితే, విల్లా కల్చర్ అంతకుమించిన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తూ విలాసాలకు ఆకాశమే హద్దు అన్నట్టుగా విస్తరిస్తోంది. పోష్ పీపుల్ తమ మోడ్రన్ లైఫ్ స్టైల్ సిగ్నేచర్‌గా దీన్ని మార్చుకుంటున్నారు. సుదూరమైనా.. ప్రశాంతంగా.. కాంక్రీట్ జంగిల్‌గా మహానగరం విస్తరిస్తుండటంతో హైదరాబాద్‌కు కనీసం 30 నుంచి 50 కి.మీ. దూరంలో నివసించడానికి కూడా సిటీజనులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. పచ్చని ప్రాంతాల్లో ప్రశాంతమైన పరిసరాలను కోరుకుంటున్నారు. జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, టెన్నిస్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, ఇతర స్పోర్ట్స్ప్లేస్లు, ఆహ్లాదాన్నిచ్చే పార్కులు, విందు వినోదాలకు క్లబ్‌హౌస్‌లు వంటి వసతులతో టౌన్‌షిప్స్ పుట్టుకొస్తున్నాయి. పట్టణం సాక్షిగా పల్లె ప్రేమ.. ఇంటి ముందు ఆడుకునే పిల్లలు, పచ్చని చెట్లు, పార్కుల్లో పిచ్చాపాటీ మాట్లాడుకునే పెద్దలు, నీటి కొలనులు, ఆధ్యాత్మికత పంచే ఆలయాలు... ఇలాంటి పల్లె వాతావరణం వైపు నగరవాసులు తిరిగి దృష్టి మళ్లిస్తున్నారు. పట్టణంలో ఉండే ఆధునిక వసతులు, పల్లెల్లోని పరిసరాల ప్రశాం తతను వీరు కోరుకుంటున్నారు. దీంతో విల్లాలు, అత్యాధునిక టౌన్‌షిప్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. లంకంత ఇల్లు.. అడుగడుగునా థ్రిల్లు.. ఒకప్పుడు ఎకరా, అర ఎకరా స్థలంలో ప్లాట్లు వేసి విక్రయించేవారు. ఈ విల్లా కల్చర్ పుణ్యమాని ఇప్పుడు అదే విస్తీర్ణంలో లంకంత ఇల్లు కడుతు న్నారు. నిజానికి వాటిని ఇళ్లు అనడం కన్నా చిన్న పాటి ఊర్లు అనొచ్చేమో... వేలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన మాన్షన్లు, వాటికి నలువైపులా రోడ్లు, స్విమ్మింగ్‌పూల్, సెంట్ర లైజ్డ్ బయోగ్యాస్ సరఫరా, 2 కి.మీ. వాకింగ్ ట్రాక్, స్పా, బ్యూటీ సెలూన్, జిమ్నాసియమ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్నూకర్, బాస్కెట్ బాల్, పార్టీ లాన్, టీ కార్నర్, బాంక్వెట్స్, హోమ్ థియే టర్, గెస్ట్ రూమ్స్, లాంజ్, ఎలివేటర్ సౌక ర్యం, కనీసం 4 నుంచి 5 కార్లు పట్టేలా పార్కింగ్ప్లేస్ ఇలాంటి ఒక చిన్న అల్ట్రామోడ్రన్ సిటీకి అవ సర మైన సౌకర్యాలన్నీ ఒక విల్లాలోనే ఏర్పాటు చేస్తుండ డంతో ఇవి సిటీలోని రిచ్ పీపుల్ని ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్ టౌన్... మెరుపుల క్రౌన్.. ఎంట్రన్స్ ప్లాజా పేరిట దాదాపు 3 నుంచి 5 ఎకరాల దాకా స్థలాలు కేటాయించడం అంటేనే.. ఈ మోడ్రన్ సిటీస్ లుక్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. ఇక లోపలకి వెళితే.. కనీసం 60 నుంచి 100 అడుగులలో వెడల్పాటి రోడ్లు, సైక్లింగ్ ట్రాక్స్, రహదారులకు ఇరువైపులా పచ్చని చెట్లు, నలు చెరగులా కొలువైన శిల్పాకృతులు, డ్రిప్ వాటర్ ఇరిగేషన్ సిస్టమ్, నిర్ణీత దూరంలో పార్కులు, నాలుగైదెకరాల స్థలంలో గోల్ఫ్ కోర్టు దాదాపు 75 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్... వంటివాటిని చూస్తే... ఆహా ఇది ఏ విదేశీ నగరమో కదా అన్నంత అనుభూతి కలిగేలా విల్లాసం ఉట్టిపడేలా చేస్తున్నారు. ఇలాంటి మోడ్రన్ విల్లా కమ్యూనిటీస్‌లో ఒక విల్లా స్వంతం చేసుకోవాలన్నా... దాదాపుగా రూ. 20 నుంచి 25 కోట్ల వరకూ వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ నగరానికి చెందిన పేజ్ త్రీ పీపుల్, సినిమా రంగ ప్రముఖులు, సంపన్న వ్యాపారులు వెనుకాడడం లేదు. కాంక్రీట్ జంగిల్లో కోట్లు ఖర్చు చేసి ఫ్లాట్స్, బిల్డింగులతో పోలిస్తే ఇదే మేలు అనుకుంటూ కొందరు... సిటీ నుంచి వేర్వేరు ఊర్లకు వెళ్లి రిలాక్స్ అయ్యే బదులు ఇదే బెటర్ అంటూ మరికొందరు.. ఖరీదుకు వెనుకాడటంలేదు. వారంలోపే సేల్.. రియల్ బూమ్ కారణంగా గాని, విభిన్న వ్యాపారాల ద్వారా గానీ పెద్ద మొత్తంలో ఆర్థికంగా పెద్ద స్థాయికి చేరినవారు ఈ తరహా విల్లాలవైపు చూస్తున్నారు. ఒకప్పుడు స్టేటస్ కోసం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో కొనుగోలు చేయాలని అనుకునేవారు. అయితే, ఇప్పుడు అక్కడ ఉండేవారు కూడా శివారు ప్రాంతాలవైపే దృష్టి మళ్లించారు. దీంతో కనీసం రూ.20 కోట్లు ఖరీదైన విల్లాలు కూడా కేవలం వారంలోనే వెంచర్ మొత్తం అమ్ముడవుతున్న పరిస్థితులున్నాయి. ఇలాంటి కొన్ని వెంచర్లలో అయితే సదరు కొనుగోలు దారుని స్థితిగతులను ఇంటర్వ్యూ చేసిగానీ విల్లా విక్రయించడం లేదంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. – కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, చైర్మన్, కేఎల్ఆర్ ప్రాపర్టీస్ -
హైదరాబాద్ సిటీ చుట్టూ టౌన్‌షిప్‌లు
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణతో హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల్లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీ కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్పుల పాలసీ’ని తీసుకొచ్చింది. ఇంటి నుంచి పని (వాక్ టు వర్క్) ప్రదేశానికి కాలి నడకన వెళ్లాలనే నినా దంతో.. నివాస/ వాణిజ్య/ సంస్థ/వ్యాపార/ కార్యాల యాల సమ్మిళితంగా అచ్చమైన కొత్త నగరాల నిర్మాణా నికి నడుం బిగించింది. నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ.. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను ఎదురీదుతూ నరకాన్ని అనుభవిస్తు న్నారు. గంటల సమయం వృథా అవుతోంది. ఈ సమస్య లకు పరిష్కారంగా టౌన్‌షిప్పుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పాఠశాల, వైద్యం, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి సదుపాయాలు, అత్యున్నత జీవన ప్రమా ణాలతో వీటి నిర్మాణానికి సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్య దర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీచేశారు. ఓఆర్ఆర్కు 5 కి.మీల ఆవల.. ఓఆర్ఆర్కు 5 కి.మీ. వెలుపల (నిషేధిత ప్రాం తాలు మినహా) కొత్త టౌన్‌షిప్‌ల నిర్మాణానికే ఈ పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుత లేఅవుట్ రూల్స్ వీటికి వర్తించవు. పాలసీలోని నిబంధనలకు లోబడి టౌన్‌షిప్పులకు టీఎస్–బీపాస్ విధానం కింద హెచ్ఎండీఏ అనుమతులనిస్తుంది. వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీని అవసరమైతే సవరణలతో గడువు పొడిగిస్తారు. పదేళ్లలో టౌన్షిప్ నిర్మాణం ముసాయిదా అనుమతి నాటి నుంచి పదేళ్లలోపు టౌన్‌షిప్పుల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. అవస రాన్ని బట్టి ప్రాజెక్టు గడువును పొడిగిస్తారు. టౌన్‌షిప్పులను నిర్మించదలచిన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు/ప్రైవేటు డెవలపర్లు/ కంపెనీలు/స్పెషల్ పర్పస్ వెహికల్స్/సంస్థలకు ఈ పాలసీ వర్తించనుంది. వంద ఎకరాలు, ఆపై విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మాణానికి ఎంపికచేసే స్థలం కనీసం 30 మీటర్ల రహదారితో అనుసంధా నమై ఉండాలి. 300 ఎకరాలు, ఆపై స్థలాలకు 36 మీటర్ల రహదారి అవసరం. టౌన్షిప్ గరిష్ట నిర్మిత స్థలంపై ఎలాంటి పరిమితుల్లేవు. టౌన్షిప్ స్థలాన్ని దగ్గర్లోని 30 మీటర్ల రహదారితో అనుసంధానిస్తూ డెవలపర్లు 30 మీటర్ల రహదారిని నిర్మించాలి. మొత్తం సైట్ ఒకేచోట ఉండాలి. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు సైట్ మధ్య నుంచి వెళ్తుంటే గనుక మినహాయింపునిస్తారు. సమీకృత వర్క్‌స్టేషన్ రోడ్లు, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలకు కేటాయింపులుపోగా, మిగిలిన స్థలంలో కనీసం నాలుగో వంతు నుంచి రెండో వంతు వరకు స్థలాన్ని ‘వర్క్‌స్టేషన్’ ఏర్పాటుకు కేటాయించాలి. వాణిజ్య కార్యాలయాలు, మార్కెట్, ఐటీ, ఐటీఈఎస్, చిన్నతరహా పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలు, రవాణా కేంద్రం ఇతర ఆహ్లాదకర కార్యకలాపాలతో వర్క్‌స్టేషన్ ఏర్పాటుచేయాలి. 300 ఎకరాలు, ఆపై భారీ విస్తీర్ణంలో నిర్మించే టౌన్‌షిప్పుల్లో కనీసం ఎనిమిదో వంతు స్థలాన్ని వర్క్‌స్టేషన్‌కు కేటాయించాలి. మిగిలిన స్థలంలో సగభాగాన్ని నివాస అవసరాలకు కేటాయించాలి. ప్రధాన వాణిజ్య కేంద్రం, షాపింగ్ ఏరియా, క్లబ్‌హౌస్, కమ్యూనిటీ కేంద్రాలు, లైబ్రరీ.. ఈ ప్రాధాన్య క్రమంలో వాణిజ్య స్థలాన్ని వినియోగించాలి. ఉన్నతవిద్య సదుపాయాన్ని వర్క్సెంటర్లో కల్పించవచ్చు. టౌన్షిప్లో అంతర్గతంగా, వెలుపల సమీపంలోని రవాణా సదుపాయం వరకు ప్రజారవాణా (ఎలక్ట్రిక్ వాహనాలు) సదుపాయం కల్పించాలి. నిర్దేశించిన మేరకు ఎల్ఐజీ/ ఈడబ్ల్యూఎస్ గృహాలు, రోడ్లు, లే అవుట్లో చూపిన మేరకు పచ్చదనం అభివృద్ధి చేయాలి. మొత్తం ప్రాంతంలో 10 శాతాన్ని పచ్చదనానికి కేటాయించాలి. సబ్ స్టేషన్, నీటి సరఫరా సంపులు, మురుగునీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పోలీస్‌స్టేషన్/ ఫైర్‌స్టేషన్ ఔట్ పోస్టులు, పబ్లిక్ పార్కింగ్ లాట్స్, శ్మశానవాటికలు, బస్‌స్టేషన్, ఇతర సదుపాయాలను వర్క్ సెంటర్లో భాగంగా స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలి. పేదలకు 10 శాతం కోటా ఆర్థికంగా బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం వర్గాల (ఎల్‌ఈజీ)కు 10 శాతం ఇళ్లను కేటాయించాలి. అయితే, వీటిని ప్రత్యేక బ్లాకులు/సెక్టార్లుగా నిర్మించవచ్చు. ప్రణాళికాబద్ధ అభివృద్ధి నీరు, విద్యుత్ పొదుపు, ఘణ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి పర్యావరణ అంశాలతో పాటు టౌన్‌షిప్‌ను ప్రణాళికాబద్ధంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. జీరో ఘన వ్యర్థాలు, జీరో వృథా నీరు కాన్సెప్ట్‌తో రీసైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పాలి. బ్లాకులు, సెక్టార్లవారీగా నివాస సముదాయాల్ని నిర్మించాలి. విద్యుత్ పొదుపు భవన నిబంధనలు (ఈసీబీసీ)ను అమలుచేయాలి. భూగర్భ కేబుల్ వ్యవస్థ, అధునాతన పరికరాలతో భద్రత వ్యవస్థ, గ్యాస్ పైప్‌లైన్ వంటి సదుపాయాలుండాలి. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. సత్వర అనుమతులు ప్రాథమిక వివరాలతో టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా తాత్కాలిక అనుమతులు జారీ చేస్తారు. అనంతరం 90 రోజుల్లోగా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలి. 30 రోజుల్లోగా తుది అనుమతులు జారీ కానున్నాయి. అనుమతులొచ్చిన 6 నెలల్లోగా పనులు ప్రారంభించాలి. అసోసియేషన్లకే టౌన్‌షిప్పుల నిర్వహణ టౌన్షిప్ రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్ పేరుతో అన్ని టౌన్‌షిప్పులు సలహామండలిని ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణను ఇవి పర్యవేక్షించాలి. డెవలపర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ప్రతినిధులూ దీనిలో ఉండాలి. టౌన్‌షిప్పుల నిర్మాణానికి ఇవీ ప్రోత్సాహకాలు – ఫీజు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా భూవినియోగ మార్పిడి. గ్రీన్ ఏరియా పది శాతానికి మించితే ఆపై స్థలానికి ఈ ఫీజు మినహాయింపు. – భూములపై 90 శాతం అభివృద్ధి చార్జీల మినహాయింపు. టౌన్‌షిప్పులో సకల సదుపాయాలను డెవలపరే కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన నీటి సరఫరా లైన్‌కు టౌన్‌షిప్‌ను అనుసంధానించడం, మురుగు కాల్వలు, సబ్స్టేషన్లు వంటివి డెవలపర్లు అభివృద్ధి చేయాలి. డెవలపర్ డబ్బులు చెల్లిస్తే స్థానిక అర్బన్ అథారిటీ ఈ ఏర్పాట్లు చేసిపెడుతుంది. – సైట్ ఏరియాలో 10 శాతం (గరిష్టంగా 10 ఎకరాలకు మించకుండా)లోపు ప్రభుత్వ/అసైన్డ్ భూములు వస్తుంటే, ప్రభుత్వం అంత మొత్తంలోని స్థలాన్ని ఇతర చోట తీసుకుని సదరు స్థలాన్ని డెవలపర్‌కు కేటాయిస్తుంది. – ప్లాన్ మంజూరు సమయంలో చెల్లించాల్సిన ఇంపాక్ట్ ఫీజును ఐదేళ్లకు వాయిదావేస్తారు. – ఈడబ్ల్యూఎస్/ఎల్ఐజీ ఇళ్ల నిర్మిత స్థలంపై 10 శాతం డెవలప్మెంట్ చార్జీలు మాఫీ. మధ్యతరహా ఆదాయ వర్గాలు (ఎంఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 75 శాతం, ఉన్నత ఆదాయ వర్గాల (హెచ్ఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 50 శాతం డెవలప్మెంట్ చార్జీలు మినహాయింపు. – టౌన్షిప్ నిర్వహణను రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్లు పర్యవేక్షించనున్న నేపథ్యంలో క్లబ్‌హౌస్ వంటి మౌలిక సదుపాయాలపై వంద శాతం ఆస్తిపన్నును, ఇతర అన్ని రకాల ఆస్తులపై 50% ఆస్తిపన్నులను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేసిన తొలి ఐదేళ్ల పాటు రాయితీ కల్పిస్తారు. – స్టార్ కేటగిరీ హోటళ్లు/ఆస్పత్రులు, మల్టీప్లెక్సులకు రాయితీ, ప్రోత్సాహకాలను అమల్లో ఉన్న ప్రభుత్వ విధానాలకు లోబడి అందిస్తారు. – అనుమతుల జారీ కోసం స్థలం తనఖా రిజిస్ట్రేషన్‌ను రూ.100 స్టాంప్ పైపర్‌పై నామమాత్రపు ఫీజుతో నిర్వహిస్తారు. – నాలా చార్జీలను నిబంధనల ప్రకారం చెల్లించాలి. – క్యాపిటలైజేషన్ చార్జీలు వంద శాతం మినహాయింపు. – సింగిల్ విండో పాలసీ కింద సమర్పించే అన్ని రకాల దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ 60 రోజుల్లోగా పరిష్కరిస్తారు. – వర్క్‌స్టేషన్‌లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలు, ఐటీ శాఖలు, టీఎస్–ఐఐసీ వంటి ప్రభుత్వ విభాగాలు సహకరిస్తాయి. -
నగరంలో విల్లామెంట్ గృహాలు
విల్లా+అపార్ట్మెంట్= విల్లామెంట్ 20 ఎకరాల్లో 700 గృహాలు వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఇదీ వరస! ఇప్పుడీ జాబితాలో విల్లామెంట్ చేరింది. విల్లా+అపార్ట్మెంట్ రెండూ కలిపితే విల్లామెంట్. నగరంలో కొత్త తరహా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్! ప్రాజెక్ట్ విశేషాలు సంస్థ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి మాటల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వ్యక్తిగత గృహాల్లో స్థలం తక్కువగా వస్తుంది. ఓపెన్ స్పేస్ ఎక్కువ రావటం కోసం కొత్తగా విల్లామెంట్ సంస్కృతికి తెరతీశాం. విల్లాల్లోని స్థలం, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు రెండూ కలిపి విల్లామెంట్లో ఉంటాయన్నమాట. షామీర్పేటలోని 27.18 ఎకరాల్లో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2 ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 20 ఎకరాల్లో విల్లామెంట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. ⇔ 20 ఎకరాల్లో మొత్తం 700 విల్లామెంట్లొస్తాయి. 240 గజాల్లో జీ+2 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2, పై అంతస్తులో 2 ఫ్లాట్లుంటాయి. 4 ఫ్లాట్లు కూడా 835 చ.అ.ల్లో విస్తరించి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్ల ధర రూ.18.85 లక్షలు, పై అంతస్తులోని ఫ్లాట్ల ధర రూ.17.85 లక్షలు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కొనుగోలుదారులకు ముందు స్థలం, పై అంతస్తులోని వారికి టెర్రస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ⇔ వసతుల విషయానికొస్తే.. 45 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, పార్కు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటాయి. ⇔ ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2లో కొంత భాగంలో అందుబాటు గృహాలను కూడా నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఆయా గృహాలు అమ్మకాలు 80 శాతం పూర్తయ్యాయి కూడా. 835 చ.అ.ల్లో ఉండే ఒక్కో ఇంటి ధర రూ.23 లక్షలు. ⇔ త్వరలోనే మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 నిర్మాణాలను ప్రారంభించనున్నాం.