Gauru Venkata Reddy
-
రేపటి నుంచి రైతు భరోసా యాత్ర
కర్నూలు జిల్లాలో వారం రోజులు వైఎస్ జగన్ పర్యటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 5(గురువారం) నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకూ వారం పాటు ఈ యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. ఈ నెల 5న హైదరాబాద్ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు. ఆ తర్వాత 6వ తేదీన శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. -
జిల్లాకు త్రిసభ్య కమిటీ సభ్యుల రాక
కర్నూలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జయాపజయాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, విశ్వరూప్‌లు కర్నూలుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. కర్నూలులోని దేవీ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సవీక్ష సమావేశానికి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే సాయంత్రం 4 గంటలకు నంద్యాలలోని పద్మావతినగర్‌లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు పాణ్యం, గడివేములకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలని సూచించారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సమీక్ష సమావేశాలకు హాజరు కావాలని కోరారు. అలాగే ఆయా మండల గ్రామ స్థాయి నాయకులు, జిల్లా కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు. -
రేపు వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశాలు శుక్రవారం కర్నూలు, నంద్యాలలో నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని దేవీ ఫంక్షన్ హాలులో ఉదయం నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి కర్నూలు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ నాయకులతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరుకావాలని కోరారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో నిర్వహించనున్న సమావేశానికి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లి, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు పాణ్యం, గడివేములకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలన్నారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సమీక్షలో పాల్గొనాలన్నారు. వీరితో పాటు ఆయా మండల, గ్రామస్థాయి నాయకులు, జిల్లా, కేంద్ర కమిటీ సభ్యులు కూడా హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సమీక్షలో త్రిసభ్య కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, విశ్వరూప్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నట్లు గౌరు పేర్కొన్నారు.