కర్నూలు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తోంది. సార్వత్రిక ఎన్నికలతోపాటు మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జయాపజయాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్సార్సీపీ త్రిసభ్య కమిటీ సభ్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి, విశ్వరూప్‌లు కర్నూలుకు వస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. కర్నూలులోని దేవీ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న సవీక్ష సమావేశానికి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో పాటు నందికొట్కూరు నియోజకవర్గం, ఓర్వకల్లు, కల్లూరు మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు హాజరు కావాలని ఆయన కోరారు.
అలాగే సాయంత్రం 4 గంటలకు నంద్యాలలోని పద్మావతినగర్‌లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, డోన్, శ్రీశైలం నియోజకవర్గాలతో పాటు పాణ్యం, గడివేములకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరు కావాలని సూచించారు. మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ సమీక్ష సమావేశాలకు హాజరు కావాలని కోరారు. అలాగే ఆయా మండల గ్రామ స్థాయి నాయకులు, జిల్లా కేంద్ర కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల కన్వీనర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లాకు త్రిసభ్య కమిటీ సభ్యుల రాక
Published Fri, May 30 2014 1:23 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement
Advertisement