ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్ల్లు కీలకం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఆయా పార్టీల తరఫును నియమితులైన ఏజెంట్ల పాత్ర కీలకం కానుంది. ప్రతి ఓటును అధికారులు వారి కళ్లెదుటే లెక్కిస్తారు. లెక్కింపు పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా ఉండేందుకే ఏజెంట్ల నియామకానికి ఎన్నికల సంఘం అంగీకరించింది. ఈవీఎంలను క్షుణ్ణంగా గమనించాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏజెంట్లపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
ఏజెంట్లకు అర్హులు వీరు..
ఏజెంట్లు జిల్లా వాసులై ఉండాలి
18 ఏళ్లపై వారు మాత్రమే అర్హులు
నేర చరిత్ర, ప్రవర్తన సరిగాలేని వారు అనర్హులు
ఇష్టారాజ్యంగా బయటకు.. లోపలకు తిరగరాదు
బ్యారికేడ్లను దాటి లోపలికి చొచ్చుకుని రాకూడదు
మద్యం తాగి కౌంటింగ్ కేంద్రాలకు రాకూడదు
ఎన్నికల సంఘం జారీ చేసిన పాస్‌లు ఉన్న వారినే కేంద్రాల్లోకి అనుమతిస్తారు -7.30 గంటలకే కేటాయించిన టేబుళ్ల వద్ద కూర్చోవాలి
{Mమ శిక్షణతో వ్యవహరించాలి
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఏజెంట్లు ముందుస్తుగా సంబంధిత ఎన్నికల అధికారుల ద్వారా పాసులు తీసుకోవాలి