Generic drug
-
టెస్టింగ్‌లో ఫెయిలైన సన్‌ఫార్మ హైబీపీ జెనరిక్ డ్రగ్: భారీ రీకాల్
న్యూఢిల్లీ: దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాకు అమెరికాలో భారీ షాక్ తగిలింది. అధిక రక్తపోటు చికిత్సలో వాడే జనరిక్ మందు అమెరికా మార్కెట్లో డిసల్యూషన్ టెస్టింగ్‌లో విఫలమైంది. దీంతో 34వేలకు పైగా జెనరిక్ మందుల బాటిళ్లను రీకాల్ చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారం అమెరికాలోని సన్ ఫార్మాకు చెందిన ఏంజినా అధిక రక్తపోటు, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ సమస్యకు చికిత్స చేయడానికి ఉపయోగించే Diltiazem హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది. వీటిని వాడటంతో తాత్కాలిక లేదా వైద్యపరంగా రివర్సిబుల్ ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణం కావచ్చు లేదా తీవ్రమైన ప్రతికూల ఆరోగ్య పరిణామాల సంభవించవచ్చని యూఎస్ ఎఫ్‌డీఏ హెచ్చరించింది. "స్టెబిలిటీ టెస్టింగ్ సమయంలో ఫెయిల్డ్ ఇంప్యూరిటీ(డీసెటైల్ డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్) స్పెసిఫికేషన్, ఎఫ్‌డీఏ ల్యాబ్‌లో డిసోల్యూషన్ టెస్టింగ్ ఫెయిల్యూర్ కారణంగా ప్రభావితమైన లాట్‌ను రీకాల్ చేస్తోంది. ముంబైకి చెందిన డ్రగ్ మేజర్ గుజరాత్‌లోని ప్లాంట్లోవీటిని ఉత్పత్తి చేస్తోంది. ఈ ఏడాది జనవరి 13న క్లాస్ II దేశవ్యాప్తంగా రీకాల్ (అమెరికా)ను ప్రారంభించింది. కాగా మల్టిపుల్ మైలోమా చికిత్సలో ఉపయోగించే జెనరిక్ ఔషధాల విక్రయాలకు అమెరికా హెల్త్ రెగ్యులేటర్ ఆమోదం పొందినట్టు సన్‌ఫార్మ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అందుబాటులో జనరిక్
జిల్లా వ్యాప్తంగా 50 షాపుల ఏర్పాటు {పణాళిక రూపొందిస్తున్న కలెక్టర్ కరుణ తక్కువ ధరలకు మందులు ఇప్పటికి నడుస్తున్న దుకాణాలు ఎనిమిది వరంగల్ : ఔషధాల ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే దిశగా జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ ధరకు ఔషధాలు లభించే జనరిక్ మందుల షాపులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 50 జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసేలా కలెక్టర్ వాకాటి కరుణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వరంగల్ నగరంలో ఏడు, మహబూబాబాద్‌లో ఒకటి కలిపి మొత్తం ఎనిమిది జనరిక్ మందుల దుకాణాలను ఉన్నాయి. వీటిలో ఎంజీఎంలోనే రెండున్నాయి. ఈ షాపుల ఏర్పాటుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకు ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. మందుల(మాలుక్యుల్)పేరుతో విక్రయించే వాటిని జనరిక్ ఔషధాలుగా, కంపెనీల బ్రాండ్ పేరుతో విక్రయించే వాటిని బ్రాండెండ్ ఔషధాలుగా పరిగణిస్తారు. ఎక్కువగా అ వసరమయ్యే ఔషధాలను పేదలకు అతి తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ ఔషధాల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాయి. -
జెనెరిక్ ఔషధ పరిశ్రమ పరుగులు
2020 నాటికి 28 బిలియన్ డాలర్లకు వృద్ధి న్యూఢిల్లీ: భారత్‌లో జెనెరిక్ ఔషధ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుతం 13 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ జెనెరిక్ మార్కెట్ 2020 నాటికి 28 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ విషయాన్ని పరిశ్రమ సమాఖ్య అసోచామ్, రీసెర్చ్ సంస్థ ఆర్‌ఎన్‌సీఓఎస్‌లు వాటి నివేదికలో పేర్కొన్నాయి. నివేదిక ప్రకారం.. భారతీయ కంపెనీలకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతులు లభించనుండటం, 2019 నాటికి దాదాపు 21 డ్రగ్స్ పేటెంట్ ముగియనుండటం వంటి అంశాలు జెనెరిక్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయి. తక్కువ ధరకే సిబ్బంది లభ్యంకావడం, వ్యాధులు పెరగడం, ఔషధాల డిమాండ్ వృద్ధి వంటి కారణాల వల్ల వచ్చే ఐదేళ్లలో దేశీ ఔషధ పరిశ్రమలో జెనెరిక్ వాటా 85 శాతానికి పెరగవచ్చు. గతేడాది 15 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా మార్కెట్ విలువ 2020 నాటికి 32 బిలియన్ డాలర్లకు చేరనుంది. వృద్ధులు సంఖ్య పెరగడం, ఆదాయ వృద్ధి, వ్యాధుల సంక్రమణ పెరుగుదల, దేశీ ఫార్మా కంపెనీల విస్తరణ వంటి అంశాల కారణంగా భారత్ టాప్-3 అంత ర్జాతీయ ఫార్మా మార్కెట్లలో ఒకటిగా ఆవిర్భవించనుంది. భారత్ ఫార్మా ఎగుమతులు ఎక్కువగా అమెరికా (28 శాతం), యూరప్ (18 శాతం), ఆఫ్రికా (17 శాతం), చైనా, జపాన్, దేశాలకు జరుగుతాయి.