జిల్లా వ్యాప్తంగా 50 షాపుల ఏర్పాటు
{పణాళిక రూపొందిస్తున్న కలెక్టర్ కరుణ
తక్కువ ధరలకు మందులు
ఇప్పటికి నడుస్తున్న దుకాణాలు ఎనిమిది
వరంగల్ : ఔషధాల ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే దిశగా జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ ధరకు ఔషధాలు లభించే జనరిక్ మందుల షాపులను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. 50 జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసేలా కలెక్టర్ వాకాటి కరుణ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వరంగల్ నగరంలో ఏడు, మహబూబాబాద్‌లో ఒకటి కలిపి మొత్తం ఎనిమిది జనరిక్ మందుల దుకాణాలను ఉన్నాయి.
వీటిలో ఎంజీఎంలోనే రెండున్నాయి. ఈ షాపుల ఏర్పాటుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అతి తక్కువ ధరలకు ఔషధాలు అందుబాటులోకి రానున్నాయి. మందుల(మాలుక్యుల్)పేరుతో విక్రయించే వాటిని జనరిక్ ఔషధాలుగా, కంపెనీల బ్రాండ్ పేరుతో విక్రయించే వాటిని బ్రాండెండ్ ఔషధాలుగా పరిగణిస్తారు. ఎక్కువగా అ వసరమయ్యే ఔషధాలను పేదలకు అతి తక్కువ ధరలకు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ ఔషధాల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నాయి.