జెనెక్స్ నానో వచ్చేసింది..
ఐదు వేరియంట్లలో లభ్యం
⇒ ధరలు రూ.1.99 లక్షల నుంచి రూ.2.89 లక్షల రేంజ్లో
⇒ మైలేజీ 23.6 కి.మీ. వరకూ
ముంబై: టాటా మోటార్స్ కంపెనీ కొత్త నానో కారును మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. పూర్తిగా మార్పులు, చేర్పులు చేసి జెనెక్స్ నానో పేరుతో ఈ కారును అందిస్తోంది. అధునాతన తాజా సాంకేతిక ఫీచర్లతో రూపాం దించిన ఈ కార్ల ధరలు రూ.1.99 లక్షల నుంచి రూ.2.89 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్లో ఉన్నాయని టాటా మోటార్స్ తెలిపింది.
5 ప్రధాన వేరియంట్లలో, 7 రంగుల్లో ఈ జెనెక్స్ నానోను కంపెనీ అంది స్తోంది. స్మార్ట్ సిటీ కారుగా దీనిని రూపొం దించామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్) మయాంక్ పరీక్ చెప్పారు. పాత నానో మోడళ్లనంటిన్ని ఆపేస్తున్నామని, సీఎన్జీ వేరియంట్‌ను మాత్రం కొనసాగిస్తామని పేర్కొన్నారు. తమ ప్రయాణికుల వాహన పోర్ట్‌ఫోలియోలో ముఖ్యమైన బ్రాండ్‌గా నానో కొనసాగుతుందని తెలిపారు. రెండేళ్ల నుంచి వినియోగదారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వినూత్నమైన ఫీచర్లతో ఈ జెనెక్స్ నానోను అందిస్తున్నామని వివరించారు.
మూడో నానో..
2009 మార్చిలో నానో కారును మొదటిసారిగా టాటా మోటార్స్ మార్కెట్లోకి తెచ్చింది. ప్రారంభ ధరగా రూ. లక్షకే ఈ కారును(బేసిక్ మోడల్) అందించింది. ఈ ధరకు లక్ష కార్లను విక్రయిం చింది. అమ్మకాలు ఆశిం చిన విధంగా లేకపోవడం తో పలు మార్పు చేర్పులు చేసి నానో ట్విస్ట్ పేరుతో రెండో నానోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నానో ట్విస్ట్ కూడా ఆశించిన ఫలితాలనివ్వకపోవడంతో తాజాగా జెనెక్స్ నానోను అంది స్తోంది. ఇప్పటివరకూ 2.7 లక్షల నానో కార్లు అమ్ముడయ్యాయి.
జెనెక్స్ నానో ప్రత్యేకతలు..
ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ జెనెక్స్ నానో కార్లు 22.9 కి.మీ, ఆటోమాటిక్ ట్రాన్సిమిషన్ ఫీచర్ లేనివి 23.6 కి.మీ. మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. డిజిటల్ ఇన్ఫో డిస్ప్లే, స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, 110 లీటర్ల లగేజ్ స్పేస్, 500కి.మీ. దూర ప్రయాణానికి వీలుగా ఉండేలా 24 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, ఎలక్ట్రానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్ వీల్, బ్లూ టూత్ కనెక్టివిటీతో కూడిన యాంఫీస్ట్రీమ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. వేగం పెంచేం దుకు స్పోర్ట్స్ మోడ్, ట్రాఫిక్ బాగా ఉన్నప్పుడు పదే పదే బ్రేక్‌లు, యాక్సిలేటర్లను వాడకుండా క్రీప్ ఫీచర్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ తెలిపింది.