Girish Bapat
-
పుణే ఉప ఎన్నికపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: పుణే ఎంపీ గిరీశ్ బాపత్ మృతితో తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న ఆ ఎంపీ స్థానానికి వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఈసీని ఆదేశిస్తూ బాంబే హైకోర్టు ఇచి్చన ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి జూన్ 16వ తేదీతో ముగుస్తున్న కారణంగా ఆ ఒక్క స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణ వృథా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం వ్యాఖ్యానించింది. ‘‘ ఈ స్థానం ఖాళీగా ఉంటే ఈసీ ఇన్ని రోజులు ఈసీ ఏం చేస్తున్నట్లు?. ఇలాంటి సందర్భాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పాటించాల్సిన విధివిధానాలపై మార్గదర్శకాలను త్వరలో వెలువరిస్తాం’ అని బెంచ్ పేర్కొంది. గత ఏడాది మార్చి 29వ తేదీన ఇక్కడి బీజేపీ ఎంపీ గిరీశ్ బాపత్ కన్నుమూశారు. ఈ స్థానానికి ఉపఎన్నికలు ఉండవని ఈసీ చెప్పడంతో పుణేకు చెందినన సుఘోష్ జోషి గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. పుణే స్థానం ఖాళీ అయినప్పటి నుంచీ పలు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. పుణే విషయంలో ఈసీ గతంలో ఇచ్చిన వివరణ హేతుబద్ధంగా లేదు. అందుకే అక్కడ తక్షణం ఉప ఎన్నిక నిర్వహించండి’’ అంటూ ఈసీని బాంబే హైకోర్టు ఆదేశించింది. వాటిని ఈసీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. -
తప్పుచేసినట్లు చూపితే..ప్రాణం తీసుకుంటా: మంత్రి
ముంబై: తాను అవినీతికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ప్రాణాలను వదులుతానని మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి గిరీశ్ బాపత్ అన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్(ఎమ్ఎల్సీ) వేదికగా ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలను నిరూపిస్తే కేవలం రాజకీయ సన్యాసం ఒక్కటే కాదని.. అసలు ఈ భూమి మీద నుంచి తాను సెలవు తీసుకుంటానని అన్నారు. ఎమ్ఎల్సీ వేదికగా ప్రతిపక్ష లీడర్ ధనంజయ్ ముండే చేసిన ఆరోపణలకు ఆయన పై విధంగా స్పందించారు. ఎన్సీపీ ఇప్పటివరకు పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండే, ఎడ్యుకేషన్ మినిష్టర్ వినోద్ టవ్దేలపై ఎన్సీపీ ఆరోపణలు చేసింది. పౌర సరఫరాల శాఖలో పప్పుధాన్యాల ధరలను ఎక్కువ చేసి ప్రజలకు విక్రయించారని ఇందులో దాదాపు రూ.2,500-2,800 కోట్ల మేర అవినీతి జరిగిందని ధనంజయ ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలు తప్పని తేలితే అదే శాఖ మంత్రి కింద సర్వెంట్ గా పనిచేస్తానని సవాలు విసిరారు. 15 ఏళ్ల పాటు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధారాలు ఆరోపణలు ఎన్నో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మీద చేసిందని అన్నారు. ప్రస్తుతం అధికార బీజేపీ తప్పు చేసిందని తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. -
నిర్మాణ పనుల్లో భారీ అవకతవకలు
ముంబై: రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఓ ప్రైవేటు సంస్థ రూ. 5000 కోట్ల మేర లబ్ధి పొందిందని, దీనిపై సీబీఐ, సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)లతో సంయుక్త విచారణ జరిపించాలంటూ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) రాష్ట్ర శాసనసభకు సిఫార సు చేసింది. దేశ రాజధాని నగరంలో మహారాష్ర్ట సదన్తోపాటు అంధేరీలోని ఆర్టీఓ కార్యాలయం, హైమౌంట్ అతిథి గృహ నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలు జరిగాయని పీఏసీ ఆరోపించింది. ఈ నివేదిక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శుక్రవారం దీనిని సభలో ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తన నివేదికలో ఈ అంశాలను పొందుపరిచిందన్నారు. ‘ వివిధ శాఖల కార్యదర్శులతో సంప్రదింపులు జరపడంతోపాటు వారి వద్దనుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకున్నాం. అంతేకాకుండా ఆయా పనులను తనిఖీ కూడా చేశాం. పనులు జరిగే సమయంలో సదరు కాంట్రాక్టర్ నిబంధనలను సరిగా పాటించలేదని భావిస్తున్నాం. సరైన ఒప్పందం కుదుర్చుకోలేదు. అనేకసార్లు పనులను పొడిగించడంతో ఆ భారం ప్రభుత్వ ఖజానాపై పడింది. ఆర్టీఓ టెస్టింగ్ ట్రాక్, ఆవాస భవన నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యత కూడా అంతంతమాత్రమే. టెండర్లు కూడా పిలవలేదు. ఈ పనుల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనమూ కలగలేదు. కాంట్రాక్టర్‌కు రూ. 5,000 కోట్లకంటే ఎక్కువ లబ్ధి కలిగింది. అన్ని అంశాలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలి. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా నివేదికను సమర్పించాలి. ఇది అంతర్రాష్ర్ట ప్రాజెక్టు అయినందువల్ల దీనిపై సిట్ దర్యాప్తు ముగిసిన తర్వాత ఆ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని కోరారు. మహారాష్ట్ర సదన్ నిర్మాణ పనులు జరిగిన తీరు ఏమాత్రం మాకు నచ్చలేదు. ప్రభుత్వం నియమించిన కన్సల్టెంట్స్, ఆర్కిటెక్టులు బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు అందులో సరైన వసతులు కూడా లేవు. అయితే ఉన్నతాధికారులకు మాత్రమే భారీస్థాయిలో వసతులు కల్పించారు’ అని ఆరోపించారు. -
బాలాజీ మందిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఘోర్పడి ప్రాంతంలోని బాలాజీ మందిరాన్ని బీజేపీ ఎమ్మెల్యే గిరీష్ బాపట్ శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ నిర్వాహకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోపాల్ చింతల్, దిలీప్ కవడే, కంటోన్మెంట్ మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్ మంత్రి, బాలాజీ మం దిర మాజీ అధ్యక్షుడు చంద్ర శేఖర్‌రెడ్డి, కె.చెం చయ్య, కార్యవర్గ సభ్యులు సుబ్బారాయుడు పాల్గొన్నారు.