Girlfriend killed
-
వాలంటైన్స్‌డే రోజే ఢిల్లీలో దారుణం.. ప్రియురాలిని చంపి, ఫ్రిజ్‌లో దాచేసి..
న్యూఢిల్లీ: తనను ప్రేమించి మరో యువతిని ఎందుకు పెళ్లాడుతున్నావని నిలదీసినందుకు ప్రాణంతీశాడో దుర్మార్గుడు. చంపేసి ఊళ్లోని తన దాబాలో ఉన్న రిఫ్రిజరేటర్లో దాచాడు! రెండు, మూడు రోజుల క్రితం జరిగిన ఈ హత్యోదంతం ప్రేమికుల దినోత్సవం (ఫిబ్రవరి 14) రోజే వెలుగు చూడటం గమనార్హం. ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం నైరుతి ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సాహిల్ గెహ్లాట్(24) గత కొన్ని సంవత్సరాలుగా హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్ అనే యువతితో సహజీవనంలో ఉన్నాడు. 2018 జనవరిలో ఉత్తమ్ నగర్‌లోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమకు, తర్వాత సహజీవనానికి దారితీసింది. అప్పటి నుంచి సొంతూళ్లలో ఇంట్లో వాళ్లకు తెలీకుండా ఢిల్లీలో సహజీవనం చేస్తున్నారు. నిక్కీ సాహిల్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే ఇటీవల గెహ్లాట్ తల్లిదండ్రులు అతడికి వేరే అమ్మాయితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం సాహిల్ ప్రియురాలికి చెప్పలేదు. అయితే ఎట్టకేలకు పెళ్లి విషయం తెలుసుకున్న నిక్కీ అతడిని నిలదీసింది. మరొకరిని పెళ్లాడితే వేరే కేసులో ఇరికిస్తానని బెదిరించింది. కాగా ఫిబ్రవరి 9వ తేదీన సాహిల్‌కు మరో అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. దీంతో నిక్కీ అతనికి ఫోన్ చేసి ఉత్తమ్ నగర్‌లోని తన ఫ్లాట్‌కు రమ్మని చెప్పింది. నిందితుడు తన కారులో బాధితురాలి ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఆమెను కారులో బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కూడా పెళ్లి చేసుకోవద్దని ఆమె ఒత్తిడి చేసింది. అంతేగాక అదే ఫిబ్రవరి 9న ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లేందుకు ముందే ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకుంది. తనతో పాటు గోవాకు రావాలని అడగ్గా.. సాహిల్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన గెహ్లాట్ కారులో మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో అమ్మాయిని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తన దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. దాబాలోని ఫ్రిజ్‌లో పెట్టి దానికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. అదే రోజు(ఫిబ్రవరి 10 ఉదయం) వేరే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. నిందితుడు గెహ్లాట్‌ను ఢిల్లీ దగ్గర్లోని కయిర్ గ్రామంలో అరెస్ట్చేశామని పోలీస్ స్పెషల్ కమిషనర్ చెప్పారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. మృతదేహం రిఫ్రిజిరేటర్ లోపల చెక్కుచెదరకుండా ఉండటం గుర్తించారు. నెమ్మదిగా కుళ్ళిపోవడం ప్రారంభించిందని, ఆమె శరీరంపై గొంతు నులిమిన గుర్తులు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడు కశ్మీర్ గేట్ సమీపంలో ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్య జరిగిన ప్రాంతాన్ని ఇంకా ధృవీకరించబడలేదు. -
చిత్తూరు: సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలో దారుణం
-
యువతిని హతమార్చిన ప్రేమోన్మాది.. కొట్టిచంపిన గ్రామస్తులు!
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణ హత్య చోటుచేసుకుంది. ప్రేమోన్మాది ఓ యువతిని పాశవికంగా హతమార్చాడు. కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన సాంబయ్య కండ్రిగలో చోటుచేసుకుంది. చిత్తూరు నగరంలో సాంబయ్య కండ్రిగ హౌసింగ్ కాలనీలో యువకుడు చిన్న సుస్మిత అనే అమ్మాయిని కొన్ని రోజులుగా ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. అతడి ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించకపోవడంతో ఆమెపై ఆగ్రహం పెంచుకున్నాడు. అదే అక్కసుతో శుక్రవారం ఉదయం సుస్మిత వద్దకు వచ్చి కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేశాడు. వెంటనే స్థానికులు ప్రేమోన్మాది చిన్నాను ఆగ్రహంతో కొట్టిచంపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా చిత్తూరు ఉలిక్కిపడింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితురాలిని హత్య చేసి పూజలు
స్నేహితురాలిని హత్య చేసి పాతిపెట్టిన స్థలంలోనే ప్రేతాత్మకు భయపడి పూజలు చేసిన స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాగై జిల్లా ఉత్తరపు పొయ్గై నల్లూర్ కరైకులంలో ఉన్న ఖాళీ మైదానంలో 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం రోజున పువ్వులు, అగరవత్తులు, గాజు, రిబ్బన్ తదితరాలను అక్కడ ఉంచి పూజలు చేసి ఉండడం అక్కడి వారికి అనుమానం కలిగింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న వేలాంకన్ని పోలీసులు అక్కడికి వెళ్లి పూజలు చేసి ఉన్న స్థలంలో మట్టిని తవ్వి చూడగా అక్కడ ఓ యువతి శవం బయట పడింది. విచారణలో హతురాలు నాగై అక్కరై పేట దిడీర్ కుప్పానికి చెందిన జాలరి సింగారవేలు - దైవయానై దంపతుల కుమార్తె సూర్య అని తెలిసింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి అదే ప్రాంతానికి చెందిన ఆమె స్నేహితుడు జ్ఞానవేల్ (23), అతని మిత్రుడు దీపన్రాజ్ (23) సింగ శశికుమార్ (19) మరో 17 ఏళ్ల యువకులు ఇద్దరిని అరెస్టు చేశారు. విచారణలో ఐదుగురు సూర్యను హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. విచారణలో జ్ఞానవేలు, సూర్యను ప్రేమించాడు. గత సంవత్సరం సూర్య గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారు. ఆ తరువాత వీరిద్దరి ప్రేమకు సూర్య తల్లిదండ్రులు అడ్డుచెప్పారు. సూర్య గర్భిణి అయిన సంగతి బయట తెలియడంతో ఆమెను అందరూ తక్కువగా చూశారు. జ్ఞానశేఖర్‌కు చెడ్డ పేరు రావడంతో స్నేహితురాలిని హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. గత నెల 30వ తేదీ సూర్యను జ్ఞానవేల్ కలుసుకుని ఆమెను సమీపంలో ఉన్న మనోన్మణి ఆలయం వద్దకు రప్పించాడు. అక్కడ బైకులో సిద్ధంగా ఉన్న జ్ఞానవేల్, అతని మిత్రులు దీపన్ రాజ్‌ల సహాయంతో సూర్యను బైకులో సముద్ర తీరం వద్దకు తీసుకెళ్లారు. కారైకులం వద్ద బైకును స్నేహితునికి ఇచ్చి సూర్య, జ్ఞానవేల్ రహస్య ప్రదేశానికి వెళ్లిపోయారు. మరుసటి రోజు స్నేహితులు నలుగురు సూర్య, జ్ఞానవేల్ ఉన్న స్థలం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో నలుగురు ఆమెపై దాడి చేశారు. జ్ఞానవేల్ బ్లేడుతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తరువాత రెండు అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వి పాతిపెట్టినట్టు తెలిపాడు. ఈ క్రమంలో ప్రేతాత్మకు భయపడి జ్ఞానవేల్ పూజలు చేసినట్టు విచారణలో తెలిసింది.