Giving birth
-
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్‌ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్‌గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్‌కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
కాన్పు తర్వాత ఉద్యోగానికి..
నిన్న మొన్నటి దాకా మీ లోకం వేరు. పెళ్లి చేసుకున్నారు. ఉద్యోగం చేస్తున్నారు. కాని ఇప్పుడు? మీరొక తల్లి. ఒక బుజ్జి అద్భుతం మీ జీవితంలోకి వచ్చింది. ఆ తబ్బిబ్బులోనే ఒక సతమతం కూడా ఉంటుంది. పాలు పట్టడం (అదంత సులువైన పని కాదు మనం ఊహించినంత), స్నానం చేయించడం, నిద్ర పుచ్చడం... ఇవన్నీ కొంత కాలం పాటు అర్థం కావు. మెల్లగా పరిస్థితి అదుపులోకి వస్తుంది. మీ బుజ్జికి మీరు మీకు మీ బుజ్జి అర్థం కావడం మొదలెడతారు. కన్ను మూసి తెరిచేలోపు ఆరు నెలలు గడిచిపోతాయి. మీరు ఆఫీసుకు తిరిగి వెళ్లే సమయం వచ్చేస్తుంది. ఆలోచించి చూస్తే ఆఫీసులో పని చేయడం గత జన్మలా అనిపిస్తుంది. మళ్లీ ఆ డ్యూటీకి అలవాటు పడాలి. గతంలో భార్య డ్యూటి, ఉద్యోగి డ్యూటి. ఇప్పుడు తల్లి డ్యూటీ కూడా. చాలా ఆందోళనగా అనిపిస్తుంది. కాని ఏం పర్లేదు. కొన్ని టిప్స్ పాటిస్తే అంతా బాగుంటుంది. ఎవరు చూడాలి? మీరు డ్యూటీకి జాయిన్ కావాల్సిన ఒకటి రెండు వారాలకు ముందే ఆయా చూడాలా? డే కేర్‌లో వదులుతారా? లేదంటే అమ్మ/అత్త చూసుకుంటారా... డిసైడ్ అవ్వాలి. ఉద్యోగానికి వెళ్లే రోజు నుంచి మాత్రమే వీరి చేతుల్లో బుజ్జిని పెట్టకుండా రెండు వారాల ముందు నుంచే మెల్లగా అలవాటు చేయాలి. మొదట వారికి అప్పజెప్పి ఒకటి రెండు గంటలు బయటకు వెళ్లిరావాలి. దాంతో మానసికంగా మీకు పాప/బాబు నుంచి దూరంగా పనికి వెళ్లే సమయం అలవాటు అవుతుంది. అదే సమయంలో బ్యాక్ అప్ ప్లాన్ కూడా కావాలి. అంటే ఆయా రాకపోతే, డే కేర్ ఆ రోజు వీలు కాకపోతే, ఇంట్లో వాళ్లు లేకపోతే ఎవరు వచ్చి బాబును చూస్తారో ముందే ప్లాన్ చేసి వారికి చెప్పి పెట్టాలి. వారు అంత నమ్మకమైన వారు కావాలి. బుజ్జిని వారికి కూడా అలవాటు చేయాలి. రొటీన్‌ని అలవాటు చేయాలి చంటి పిల్లలు ఒక రొటీన్లో పడటం మంచిది. అది కూడా అలవాటు చేయాలి. ఆడుకునే సమయం, నిద్ర పోయే సమయం, స్నానం చేసే సమయం, తిండి తినిపించే సమయం ఇవి అలవాటు చేయడం ముఖ్యం. దానికి తగ్గట్టు మీ నిద్రను విశ్రాంతిని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగిగా, తల్లిగా కూడా మీరు అలసి పోయే అవకాశం ఎక్కువ. అంతే కాదు మీరు ఆఫీసుకు వెళితే బాబును చూసుకునేవారు కూడా ఈ రొటీన్‌ను ఫాలో అవుతారు. జోల పాడి నిద్ర పుచ్చడం, బుజ్జగించి తినిపించడం మీకు లాగే ప్రేమగా, ఓపికగా చేసే మనిషి దొరకడమే మీరు ముఖ్యంగా భావించి వెతకాలి. తిండిని సిద్ధం చేయండి చంటికి ఆరునెలలు దాటాకే మీరు ఉద్యోగానికి వెళతారు కాబట్టి మీ చంటి ఏమి తింటే మంచిదో మీరు తెలుసుకున్నారు కాబట్టి ఆ తిండిని మీరు సిద్ధం చేసి మీరు లేనప్పుడు వెతుక్కునే బాధ లేకుండా చూడాలి. ఆ తిండి పెట్టే చోటు ఫిక్స్‌డ్‌గా ఉండాలి. మీ బాబును చూసుకునేవారికి ఆ తిండి ఎలా సిద్ధం చేసి తినిపించాలో మీరు ప్రాక్టీసు చేయించాలి. తరువాయి వారు చూసుకుంటారు. పనులు ప్లాన్ చేసుకోండి మీరు ఎప్పటికప్పుడు ఆఫీసు పనులు ఇంటి పనులు ప్లాన్ చేసుకోవాలి. ఇంటి పనులు వీకెండ్లో చేసుకుంటూ ఆఫీసు పనులు ఏ రోజుకారోజు పెండింగ్ లేకుండా చూసుకోవాలి. ఆఫీసు అయ్యాక ఇల్లు చేరి మీ పాపను గుండెకు హత్తుకోవాలి కాబట్టి ఆఫీసులో పిచ్చాపాటి మాట్లాడి టైమ్ వేస్ట్ చేసి లేట్ అవర్స్ పని చేయవద్దు. అంతే కాదు ‘చంటి బిడ్డ ఉంది’ అనంటే కొంత పని మీ కొలిగ్స్ షేర్ చేసుకుంటారు. ఆ మాత్రం బరువు వారి మీద వేయండి. మొత్తానికి పని భారం నెత్తిన లేకుండా చూసుకుంటే మీ బాబుతో మీకున్న సమయాన్ని సంతోషంగా గడపొచ్చు. సిసి టీవీని బిగించుకోండి ఇది అత్యంత ముఖ్యం. బిపి రాకుండా ఉంటుంది. ఇవాళ రేపు మైక్ ఉన్న కెమెరాలు దొరుకుతున్నాయి. వాటిని బిగించుకుంటే మీ పాప/ బాబు ఎలా ఉన్నారో, కేర్ టేకర్ సరిగా చూసుకుంటూ ఉందో లేదో ఒక కన్నేసి పెట్టే వీలుంటుంది. ఆఫీసుకు వెళ్లే తల్లికి ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పవచ్చు. ఇవి ఏమంత ఖరీదు కూడా కాదు. అలాగే మీ ఆఫీస్‌లో, ఫ్రెండ్స్‌లో, కాలనీలో ఉన్న కొత్త తల్లులతో ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోండి. ఒకరికొకరు ఉన్నామనే ధైర్యం ఉంటుంది. చాలా సందేహాలకు అక్కడే సమాధానం దొరుకుతుంది. గిల్ట్‌ను పక్కన పెట్టండి అయ్యో చంటి పిల్లాణ్ణి వదిలిపెట్టి ఉద్యోగానికి వెళుతున్నానే అన్న గిల్ట్‌ను వదిలిపెట్టండి. మీ బంగారానికి ఏం కావాలో అవన్నీ చూసే మీరు ఉద్యోగానికి వెళుతున్నారు. కుటుంబం కోసం, మీ సంతానం కోసమే మీరు పని చేస్తున్నారు. అది మాత్రమే కాదు మీ కోసం కూడా మీరు ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఉద్యోగం ఇష్టమైతే ఆ ఇష్టం ఉన్నందుకు గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. పని చేయండి. పెంచండి. పని చేస్తూ చక్కగా పెంచడంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే మిమ్మల్ని మించినవారు లేరు. క్వాలిటీ టైమ్ మీ గొంతు... నవ్వు... మాటలు వినడం మీ పాపకు ఇష్టం. మీ బాబు అదే కోరుకుంటాడు. కనుక వారితో క్వాలిటీ టైమ్‌ను మీరు గడపాలి. వారు నిద్రపోయే సమయంలో మీరు ఉన్నంత మాత్రాన, మీ డ్యూటీ సమయంలో మీ బుజ్జి మేలుకుని ఉన్నంత మాత్రాన క్వాలిటీ టైమ్ కుదరదు. అందువల్ల మీ ఇద్దరూ యాక్టివ్‌గా ఉండే టైమ్ ఏదో సెట్ చేసుకుని ఆ టైమ్‌లో ఇద్దరూ రోజూ తప్పనిసరిగా గడపాలి. ఇలా చేయండి మాతృత్వం ఎంత ముఖ్యమో ఉద్యోగమూ అంత ముఖ్యమే. ప్రసూతి సెలవులు ముగిశాక ఉద్యోగానికి వెళ్లకతప్పదు. వర్కింగ్ ఉమన్‌గా ఉంటూ తొలి కాన్పు తర్వాత ఉద్యోగానికి తిరిగి వెళుతుంటే కనుక ఎన్నో సందేహాలు... ఆందోళనలు. మరేం పర్వాలేదు. ఈ టిప్స్ పాటించండి. -
‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’
బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు. వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు.. ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. (చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’) అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్ చేసుకొండి అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్ #WATCH | ...Today we don't want our parents to live with us. A lot of modern women in India want to stay single. Even if they get married, don't want to give birth. Paradigm shift in our thinking,it's not good: Karnataka Health Min on World Mental Health Day,at NIMHANS, Bengaluru pic.twitter.com/LkX7Ab7Sks — ANI (@ANI) October 10, 2021 -
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు..
కాన్పు కోసం వస్తే కాసులు పిండేస్తున్నారు.. ప్రసవం చేస్తే వేలకు వేలు గుంజేస్తున్నారు.. సొమ్ము ఇవ్వలేని నిరుపేదలను నీచంగా చూస్తున్నారు.. మాటలతోనే మనసును కుళ్లబొడుస్తున్నారు.. మానవత్వం మరిచి.. ఆమ్యామ్యాల కోసం అర్రులు చాస్తున్నారు. చిత్తూరు జిల్లా ఆస్పత్రిలో సిబ్బందే, రాబందులై ప్రజలను పీక్కుతింటున్నారు. చిత్తూరు రూరల్: చిత్తూరు నగరంలోని జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం అధిక సంఖ్యలో పేదలే వస్తుంటారు. సరిహద్దు ప్రాంతం కావడంతో తమిళనాడువాసులు కూడా ప్రసవం కోసం ఇక్కడికే వస్తుంటారు. రోజుకు సగటున 25 నుంచి 30 కేసులు డెలివరీ కోసం వస్తుంటాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అదేపనిగా డబ్బులు దండుకుంటున్నారు. వసూళ్లు ఇలా.. ప్రసూతి విభాగంలో ఉదయం, రాత్రి, అత్యవసరమైతే మధ్యాహ్న వేళల్లో ప్రసవం కోసం ఆపరేషన్లు జరుగుతుంటాయి. ఇక్కడ సిబ్బందిలో కొందరు బిడ్డను చూపించిన వెంటనే కాసులు అడుగుతున్నారు. అది కూడా రూ.1000 లేదా రూ.2000 అనుకుంటే పొరబాటే. ఏకంగా రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణులు, తమిళనాడు వాసులను టార్గెట్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆపరేషన్ అయిన వెంటనే బెడ్‌పైకి మార్చాలని, క్లీనింగ్ పేరు చెప్పి రూ.1000 చొప్పున వసూలు చేస్తున్నారు. పురిటినొప్పులే నయం.. చిత్తూరు ఆస్పత్రికి ప్రసవానికొచ్చే వారికి పురిటినొప్పుల కంటే.. అక్కడ పనిచేసే సిబ్బంది తీరుతో పడే ఇబ్బందులే అధికం అంటే అతిశయోక్తి కాదేమో. వారు అడిగిన డబ్బులిస్తే పని చేస్తారు. లేకుంటే డబ్బు కోసం పీడిస్తారు. ఇచ్చే వరకు దుర్భాషలాడుతారు. ఆ మాత్రం డబ్బులు ఇవ్వలేనివాళ్లు ఎందుకొచ్చారంటూ.. తీవ్రంగా అవమానిస్తారు. డబ్బులిచ్చే వరకు జలగల్లా పట్టుకుంటారు. వారిని అడిగేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రజలను పీల్చి పిప్పిచేస్తున్నారు. ►4 పలమనేరుకు చెందిన కోకిల(19) కాన్పు కోసం తమిళనాడులోని వేలూరులో అరుకంబడి ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ సరైన వసతులు లేకపోవడంతో గతవారం చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో చేరింది. ఇక్కడ ఆపరేషన్ చేయడంతో ఆడబిడ్డ జన్మించింది. అయితే బిడ్డను చేతిలో పెట్టగానే ఆస్పత్రి సిబ్బంది కోకిల తల్లిని రూ.20 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.10 వేలు గుంజేశారు. బిడ్డను ఏమైనా చేస్తారేమో అని భయపడి డబ్బు ఇచ్చామని బాధితురాలు కంటతడి పెట్టింది. ►4 తిరుత్తణికి చెందిన అనిత(25) ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రిలో చేరి, ఆదివారం డిశ్చార్జ్ అయ్యింది. ఆమె కుటుంబ సభ్యుల వద్ద కూడా సిబ్బంది రూ.10 వేలు లాగేశారు. అడిగినంత ఇస్తేనే.. మీ బిడ్డను బయటకు తెస్తాం అంటూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ మాత్రం ఇవ్వలేని వారు మీకెందుకు బిడ్డలంటూ హేళన చేశారు. బాధితులు చేసేది లేక అప్పుచేసి.. వారికి అడిగినంతా ముట్టజెప్పారు. -
ప్రసవం అయిన 14 రోజులకే విధుల్లోకి!
లక్నో : ‘సృష్టిలో దేవుడు స్త్రీకి అత్యంత శక్తిని ఇచ్చాడు. బిడ్డలను కనడమే కాదు వారి పాలనను కూడా అంతే సక్రమంగా చూస్తుంది’ అంటోంది ఐఎఎస్ అధికారి సౌమ్య పాండే. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఐఏఎస్ అధికారి సౌమ్య పాండే ప్రసవం అయిన 14 రోజులకే తిరిగి విధుల్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. కుమార్తెతో డ్యూటీ చేస్తున్న సౌమ్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చదవండి: ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో బిజీగా మహమ్మారి పనులు.. ‘కోవిడ్–19 సమయంలో సక్రమంగా పనులు చేయడం మనందరి కర్తవ్యం’ అంటున్న సౌమ్య కరోనా సమయంలో ఎస్డీఎం అధికారిగా నియమించబడ్డారు. డెలివరీ అయిన 14 రోజుల తరువాత తన మూడు వారాల కుమార్తెతో కార్యాలయానికి వచ్చి, పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ– ‘గ్రామంలోని మహిళలు గర్భధారణ సమయంలో ఇంటి సంబంధిత పనులన్నీ చేస్తారు. ప్రసవించిన తరువాత ఆ పనులతో పాటు పిల్లల సంరక్షణ కూడా చేస్తారు. అదేవిధంగా, నా మూడు వారాల శిశువుతో పరిపాలనా పని చేయగలుగుతున్నాను. చదవండి: ఘజియాబాద్‌లో బీజేపీ బంధువు దారుణ హత్య ఈ పరిస్థితులలో నా కుటుంబం నాకు మద్దతు ఇచ్చింది. తహసీల్, ఘజియాబాద్ జిల్లా పరిపాలన నాకు ఒక కుటుంబం లాంటిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు ఘజియాబాద్‌లో ఎస్డిఎమ్ ఆఫీసర్‌గా ఉన్నాను. సెప్టెంబరులో నా ఆపరేషన్ సమయంలో 22 రోజుల సెలవు వచ్చింది. ప్రసవించిన రెండు వారాల తర్వాత నేను తహసీల్‌లో చేరాను. ఈ అంటువ్యాధి సమయంలో పనిచేసేటప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీల అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల’ని సౌమ్య పాండే సూచనలు చేసింది. -
పసికందుకు తల్లి ప్రేమను దూరం చేసిన కరోనా
ఔరంగాబాద్ : కరోనా వైరస్..బంధాలను, బంధుత్వాలను దూరం చేస్తుంది. 30 ఏళ్ల మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కొన్ని రోజుల్లోనే కరోనాతో మృత్యువాత పడింది. ఈ ఘటన మహారాష్ర్టలోని ఔరంగాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..మే 28న మూత్రపిండాల సమస్యతో గర్భిణీ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అదే రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజున నిర్వహించిన పరీక్షలో మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలకు తోడు కరోనా కూడా సోకడంతో పరిస్థితి విషమించి మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే చిన్నారికి మాత్రం వైరస్ సోకలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఔరంగాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య 1,834కు పెరగగా, గత 24 గంట్లోనే 65 కొత్త కేసులు నమోదయ్యాయి. (టిక్‌టాక్ స్టార్ పై కేసు నమోదు ) -
శభాష్ అనిపించుకున్న ఐఏఎస్ అధికారిణి
రాంచీ : ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో మంది తాపత్రయపడతారు.. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివించరు. అందరికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కావాలి.. కానీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి మాత్రం నామోషీగా భావిస్తారు. ఈ తంతు సమాజంలో ఎప్పటి నుంచో పాతుకు పోయి ఉన్నదే. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగిణి మాత్రం ఇందుకు భిన్నంగా నిలిచింది. ఐఏఎస్ అధికారిగా ఉన్న ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించింది. ప్రభుత్వాస్పత్రిలో నవ శిశువుకు జన్మనిచ్చి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ సంఘటన జార్ఖండ్ జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో కిరణ్ కుమార్ పాసి అనే మహిళ జిల్లా కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గర్భవతి అయిన ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పురిటి నొప్పులు రావడంతో ముందుగా నిర్ణయించుకున్నట్లే ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లకుండా సర్కారు దవాఖానకు వెళ్లి అక్కడ తన బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కిరణ్ కుమార్, తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అయినా ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలకు నమ్మకం పెరిగి వారిలో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ విషయంపై డాక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఐఏఎస్ అధికారి డెలవరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం గర్వంగా ఉందన్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు తీసుకు రావడానికి దోహదపడుతుందని డాక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు మరో మహిళ ఐఏఎస్ అధికారి నాన్సీ సహేతో సహా అనేక మంది అధికారులు ఆసుపత్రికి చేరుకుని కిరణ్ కుమార్‌ను అభినందిస్తున్నారు. -
67 ఏళ్లకు మాతృత్వం.. విచారణ తప్పదేమో..!
బీజింగ్ : మారుతున్న జీవన శైలితో చాలామంది మహిళలకు గర్భధారణ సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి వారికి మాతృత్వపు మమకారాన్ని అందించేందుకు కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్..ఇన్ విట్రో ఫెర్టిలిటీ) విధానం అందుబాటులోకి వచ్చింది. అయితే, చైనాలో టియాన్ (67) అనే వృద్ధురాలు మాత్రం సహజ గర్భం దాల్చి వార్తల్లో నిలిచారు. 67 ఏళ్ల వయసులో సహజ గర్భం దాల్చిన తొలి చైనా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె గత శుక్రవారం పడంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, టియాన్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో వారు విచారణ ఎదుర్కొనక తప్పేట్టు లేదు. ఎందుకంటే చైనాలో ‘ఇద్దరు పిల్లల విధానం’ అమల్లో ఉంది. (చదవండి : 74 ఏళ్ల వయసులో మాతృత్వం.. తీవ్ర విమర్శలు) ఇదిలాఉండగా.. 2016లో చైనా తీసుకొచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ సత్ఫలితాలను ఇవ్వలేదు. దశాబ్దాలుగా ‘ఒకే బిడ్డ ముద్దు.. రెండో బిడ్డ వద్దు’ విధానానికి అలవాటు పడిన అక్కడి ప్రజలు.. రెండో బిడ్డను కనేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ రిపోర్టు వెల్లడించింది. చైనాలో మొదటి బిడ్డను కనే మహిళల సగటు వయసు 2016లో 24.3 సంవత్సరాలుగా ఉంటే.. అది 2019లో 26.9 కి చేరింది. చైనా తెచ్చిన ‘ఇద్దరు పిల్లల విధానం’ ఫలితంగా వృద్ధ దంపతులు రెండో సంతానాన్ని కనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. ఇక 2017లో నమోదైన జననాల్లో 51 శాతం రెండో సంతానం కావడం విశేషం, 2016లో ఇది 40 శాతం మాత్రమే ఉంది. పెద్ద వయసులో రెండో బిడ్డను కనేందుకు వృద్ధులు ఆసక్తి చూపుతున్నారనడానికి టియాన్ దంపతులే ఉదాహరణ. అయితే, టియాన్ దంపతులపై విమర్శలు వస్తున్నాయి. ముసలి వయసులో బిడ్డకు జన్మనిచ్చారని, ఇప్పుడు ఆ చిన్నారి ఆలనాపాలనా మిగిలిన వారిద్దరి పిల్లలపై పడుతుంది కదా అని విమర్శిస్తున్నారు. మరోవైపు.. మూడో బిడ్డ తమకు దేవుడిచ్చిన వరమని టియాన్ దంపతులు అంటున్నారు. ఆమెకు ‘టియాన్సి’(స్వర్గం నుంచి వచ్చిన చిన్నారి)గా నామకరణం చేశారు. టియాన్ రిటైర్డ్ డాక్టర్ కావడం గమనార్హం. (చదవండి : తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం) -
కడుపులోని బిడ్డ.. కళ్ల ముందు!
ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా స్త్రీ అనుభవించే మాతృత్వపు మధురిమను మాటల్లో వర్ణించలేం. కడుపులో బిడ్డ కదిలినప్పుడల్లా ఆనందపడిపోతూ, ఎప్పుడెప్పుడు బుజ్జి ప్రాణాన్ని ఒళ్లో పెట్టుకొని లాలిద్దామా అంటూ తల్లి నవమాసాలూ అపురూపంగా మోస్తుంది. మరి.. కడుపులో ఉండగానే బిడ్డను కళ్లారా చూసుకునే అవకాశం వస్తే? సూపర్ కదూ! అలాగే, గుండెజబ్బుతో ఆస్పత్రికి వచ్చిన ఓ రోగికి స్కానింగ్‌లు, పరీక్షలు చేశాక ఎక్స్‌రే ఫిల్మ్‌లు పట్టుకొని చూస్తూ.. వైద్యులు అతడి గుండెకు చిల్లు పడింది చూడమంటూ అతడి గుండెను లైవ్‌లో కళ్లముందు చూపెడితే? లైవ్ హోలోగ్రామ్ (3డీ రూపాన్ని) పాయింటర్‌తో టచ్ చేస్తూ అటూ ఇటూ తిప్పిచూపిస్తూ వివరిస్తే? ఇది కూడా సూపర్ కదూ! అందుకే వీటిని నిజం చేసే టెక్నాలజీని ఇజ్రాయెల్‌కు చెందిన రియల్ వ్యూ కంపెనీతో కలసి ఫిలిప్స్ కంపెనీ ఇప్పుడు అభివృద్ధి పరుస్తోంది. ఈ టెక్నాలజీతో కడుపులోని బిడ్డను 3డీ హోలోగ్రామ్ రూపంలో కళ్లముందు కనిపించేలా చేయడమే కాదు.. ఆ బిడ్డను అటూఇటూ తిప్పుతూ అన్ని వైపులా చూపిం చొచ్చు కూడా! ఇదెలా సాధ్యమంటే.. ఫిలిప్స్ పరిశోధకులు తయారుచేసిన ఇంటర్వెన్షనల్ ఎక్స్-రే, కార్డియాక్ అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ల ద్వారా శరీరంలోని అవయవాలను 3డీ చిత్రాలుగా మలుస్తారు. రియల్వ్యూ సిస్టమ్ ద్వారా ఆ 3డీ చిత్రాలను హోలోగ్రాఫిక్ రూపంలో లైవ్‌లో ప్రదర్శిస్తారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు సైతం అవయవాలను లైవ్‌లో నిశితంగా పరిశీలించేందుకూ దీంతో వీలుంది.