మీరెక్కడున్నారో చెప్పే గ్లిమ్ప్స్..
ఆఫీసు నుంచి ఇంటికెళ్లడం కొంచెం ఆలస్యమైనా సరే.. వెంటవెంటనే ఆప్తుల నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయా? ఎక్కడున్నావు? ఎంతసేపు పడుతుంది? అన్న ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేస్తున్నారా? ఇకపై వారి స్మార్ట్‌ఫోన్స్‌లో గ్లిమ్ప్స్ అప్లికేషన్ ఉండేలా చూసుకోండి. అంతా సరిపోతుంది.
ఎలాగంటారా? ఏ నిమిషానికి మీరు ఎక్కడున్నదీ దీనిద్వారా ఇతరులకు తెలియజేయవచ్చు మరి. ఆఫీసు నుంచి బయలుదేరిన వెంటనే ఒకసారి ఆన్ చేస్తే చాలు. మీరు ముందుగా ఫీడ్ చేసిన నెంబర్లకు మీరున్న ప్రాంతపు సమాచారం తెలిసిపోతుంది.