Global rating agency
-
2024 వృద్ధి 6.8 శాతం: మూడీస్
న్యూఢిల్లీ: భారత్ 2024 క్యాలెండర్ ఇయర్ వృద్ధి అంచనాను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను 6.8 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ‘‘అంచనాల కంటే బలమైన’’ ఆర్థిక గణాంకాలు తమ తాజా అంచనా పెంపునకు కారణంగా పేర్కొంది. జీ20 దేశాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించింది. 2025లో దేశ వృద్ధి రేటును 6.4 శాతంగా రేటింగ్ దిగ్గజం పేర్కొంది. 2023లో దేశ ఎకానమీ ఊహించినదానికన్నా అధికంగా మంచి పురోగతిని సాధించినట్లు తెలిపింది. ప్రభుత్వ మూలధన వ్యయాలు, పటిష్ట తయారీ కార్యకలాపాలు 2023లో భారత్ బలమైన వృద్ధి ఫలితాలకు దోహదపడ్డాయని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. -
2023-24లో వృద్ధి 6 శాతం: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 శాతానికే పరిమితం అవుతుందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేసింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ మందగించడం, అసాధారణ రుతుపవనాల ప్రతి కూలతలు, వడ్డీరేట్ల పెంపు వంటి అంశాలు తమ అంచనాకు కారణంగా తెలిపింది. కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలిక ధోరణి అయినప్పటికీ, వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాను 5 నుంచి 5.5 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొంది. (ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్) అంతర్జాతీయ క్రూడ్ ధరల తీవ్రత దీనికి కారణంగా పేర్కొంది. కాగా, 2024-25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి అంచనాలను 6.9 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. 2022–23 భారత్ వృద్ధి రేటు 7.2 శాతంకావడం ఇక్కడ గమనార్హం. మరోవైపు 2023లో ఆసియా పసిఫిక్ ప్రాంత వృద్ధి అంచనాను 3.9 శాతంగా అంచనావేస్తున్నట్లు ఎస్అండ్పీ తెలిపింది. (ఉద్యోగులకు గుడ్‌న్యూస్..అంచనాలకు మించి భారీగా జీతాల పెంపు!) -
‘మొండిబకాయిల’ పరిష్కారానికి కొంత సమయం: ఎస్అండ్పీ
న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, రుణ వృద్ధికి మరికొంత సమయం పడుతుందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ బుధవారం పేర్కొంది. ఈ మేరకు సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘ఆర్థికాభివృద్ధి అంశాలు బాగున్నప్పటికీ, బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్య పరిష్కారానికి మరి కొంత సమయం’ అన్న ప్రధాన అంశంపై ఈ నివేదిక రూపొందింది. సంస్థ క్రెడిట్ ఎనలిస్ట్ అమిత్ ఈ అంశాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు... - మైనింగ్, మౌలిక రంగంలో ఇబ్బందులు మొండి బకాయిలు, రుణ వృద్ధి మందగమన సమస్యలకు కారణాలు. ఈ సమస్యల పరిష్కారంతో బ్యాంకుల ‘రుణ’ నాణ్యతా మెరుగుపడుతుంది. - కీలక రంగాల పురోగతితో కంపెనీల అదాయాలు పెరుగుతాయి. ఇది మొండి బకాయిల సమస్య పరిష్కారానికి దోహదపడుతుంది. - అయితే మొండిబకాయిల సమస్య దీర్ఘకాలం కొనసాగడం మంచిదికాదు. దీనివల్ల ఆర్థిక రంగంలో ఇబ్బందులు తీవ్రమయ్యే అవకాశం ఉంది. - అభివృద్ధి, సమర్థవంతమైన పాలన తత్సబంధ అంశాలపై మోడీ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. ఈ హామీలను నెరవేర్చడం వృద్ధి బాటలో కీలకం.