go 14
-
తెలుగు మీడియం కొనసాగించాలి
– కలెక్టరేట్ ఎదురుగా జీఓ నెం.14 జీఓ కాపీలు దగ్దం కర్నూలు (న్యూసిటీ): మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియాన్ని కొనసాగించాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎన్.నరసింహుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం.14 కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. తెలుగుమీడియం ఎత్తేస్తే మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామశేషయ్య మాట్లాడుతూ తెలుగు జాతి, తెలుగు భాషను కాపాడటానికి తెలుగుదేశం పార్టీ ఏర్పడిందని గొప్పలు చెప్పే నాయకులు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం తక్షణమే జీఓ నెం.14ను రద్దు చేయాలని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జి.ఆనంద్, జిల్లా కార్యదర్శి జి.ఆనంద్‌కుమార్, జిల్లా నాయకులు నాగరాజు, శశికుమార్, రఫీ, తిరుమల చౌదరి పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై స్పందించండి
► అధికారులకు కలెక్టర్ జగన్మోహన్ ఆదేశం ► ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ► కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఆదిలాబాద్ అర్బన్ : ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలని జిల్లా కలెక్టర్ ఎం. జగన్మోహన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి తీసుకున్న చర్యల వివరాలను తనకు అందజేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్‌తో పాటు డీఆర్వో సంజీవరెడ్డి గ్రీవెన్స్‌కు హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలసత్వం వహించకూడదని, ఏ రోజుకారోజు సమస్యలు వస్తుంటాయని, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా విన్నవించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఫోనిన్ను సద్వినియోగం చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో జలపతి నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవో ప్రకారం వేతనాలివ్వాలి ఆదిలాబాద్ రిమ్స్‌లో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానం ద్వారా పని చేస్తున్న 48 మంది సెక్యూరిటీ గార్డులకు జనవరి నుంచి అమలైన జీవో 14 ప్రకారం వేతనాలు ఇవ్వాలి. ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇవ్వాలి. రిమ్స్ డెరైక్టర్‌కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. జీవో ప్రకారం వేతనాలిస్తూ సెక్యూరిటీలకు న్యాయం చేయాలి. - వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు, ఆదిలాబాద్