Go On Strike
-
జనవరి 8 సమ్మెలో ఆరు బ్యాంకు సంఘాలు
సాక్షి, ముంబై: జనవరి 8న దేశవ్యాప్తంగా చేపట్టనున్న అఖిల భారత సమ్మెకు పలు బ్యాంకింగ్ సంఘాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబిఎ) ప్రకారం ఆరు బ్యాంకు సంఘాలు కూడా సమ్మెలో చేరనున్నాయి. ఆరు ఉద్యోగ సంఘాలు (ఏఐబీఈఏ, ఏఐబీఓఏ,బీఎఫ్ఎప్ఐ, ఐఎన్ బీఈఎఫ్, ఐఎన్ బీఓసీ, బీకేఎస్ఎంఈ) సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయ. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇచ్చింది. అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరాలని నిర్ణయించాయి. దీంతో అధికారికంగా ఆ రోజు (జనవరి 8, బుధవారం) సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్లైన్ లావాదేవీలు ప్రభావితం కావు. మరోవైపు ఈ యూనియన్లలో ఉద్యోగుల సభ్యత్వం చాలా తక్కువ కాబట్టి బ్యాంకు కార్యకలాపాలపై సమ్మె ప్రభావం తక్కువగా ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. -
పెట్రోల్ బంకుల బంద్
దేశంలోని పెట్రోల్ డీలర్స్ ..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లనుంచి గురువారం రోజు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నవంబరు 15న దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నారు. చమురు మార్కెటింగ్ కంపెనీలు నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు. ఈ మేరకు గురువారం కొనుగోళ్ల నిలిపి వేత బంద్ ను, నవంబర్ 15న పూర్తి బంద్ ను పాటిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి సారాదిందు పాల్ చెప్పారు. అలాగే ప్రస్తుతం 3 శాతంగా ఉన్న డీలర్ల కమిషన్ ను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 53,500 పెట్రోల్ పంపులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కొనసాగుతున్న ఆందోళన భాగంగా డీలర్లు ఇప్పటికే "బ్లాకౌట్" నిరసన కార్యక్రమాన్ని అక్టోబర్ 19 , 26 తేదీల్లో 7-7.15 గంటల మధ్య 15 నిమిషాలు చేపట్టినట్టు చెప్పారు. -
సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు
చెన్నై: దేశంలోని 10 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈనెల 29 నుంచి సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకింగ్ రంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా సమ్మెకు దిగనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జెనరల్ సెక్రెటరీ సీహెచ్ వెంకటాచలమ్ తెలిపారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొంటాయని ఆయన తెలిపారు. తొమ్మిది యూనియన్ల లో సభ్యత్వం కలిగిన దాదాపు 10 లక్షల మంది ఇందులో పాల్గొననున్నారు.