పెట్రోల్ బంకుల బంద్ | Petroleum Dealers To Go On Strike On November 15 | Sakshi
Sakshi News home page

పెట్రోల్ బంకుల బంద్

Published Thu, Nov 3 2016 5:17 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

పెట్రోల్ బంకుల బంద్

పెట్రోల్ బంకుల బంద్

దేశంలోని  పెట్రోల్  డీలర్స్ ..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ లనుంచి  గురువారం రోజు  కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు నవంబరు 15న   దేశవ్యాప్తంగా బంద్ కు దిగనున్నారు.  చమురు మార్కెటింగ్ కంపెనీలు  నుంచి తమకు తగ్గుతున్న మార్జిన్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఆల్ ఇండియా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు.  ఈ మేరకు  గురువారం  కొనుగోళ్ల నిలిపి వేత బంద్ ను, నవంబర్ 15న పూర్తి బంద్ ను  పాటిస్తున్నట్టు పశ్చిమ  బెంగాల్  యూనిట్  ప్రధాన కార్యదర్శి  సారాదిందు పాల్ చెప్పారు. 

అలాగే  ప్రస్తుతం 3 శాతంగా ఉన్న డీలర్ల కమిషన్ ను 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.  దేశవ్యాప్తంగా 53,500  పెట్రోల్ పంపులు ఈ నిరసనలో పాల్గొంటారని తెలిపారు. కొనసాగుతున్న ఆందోళన  భాగంగా డీలర్లు ఇప్పటికే  "బ్లాకౌట్" నిరసన కార్యక్రమాన్ని  అక్టోబర్ 19 , 26  తేదీల్లో   7-7.15 గంటల మధ్య 15 నిమిషాలు చేపట్టినట్టు చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement