goat stealing
-
‘వేడుకున్నా కనికరించలేదు’.. అందుకే ఆ ఎస్ఐని చంపేశాం..
సాక్షి, చెన్నై: మేకలను దొంగలించిన తమను వదలిపెట్టాలని ఎంత వేడుకున్నా కనికరించకపోవడంతోనే ఎస్ఐను హతమార్చినట్టు నిందితులు పోలీసులకు వాంగ్ములం ఇచ్చారు. హంతకుల్లో ఇద్దరు మైనర్లు కావడంతో రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. తిరుచ్చి జిల్లా నవల్‌పట్టి పోలీస్‌స్టేషన్ స్పెషల్ ఎస్ఐ భూమినాథన్‌ను మేకల దొంగలు హత్య చేసిన ఘటన ఆదివారం సంచలనం సృష్టించింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన తిరుచ్చి పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేసింది. సెల్ సిగ్నల్స్ ఆధారంగా నవల్ పట్టికి చెందిన మణిగండన్(19)ని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: (మేకల దొంగల వీరంగం.. స్పెషల్ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా) ఆదివారం రాత్రి అతడిని అరెస్టు చేసే క్రమంలో గ్రామస్తులు అడ్డుతగిలారు. తుపాకీ నీడలో అతడిని అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు ఇద్దరు మైనర్లు( 14, 16) చిక్కారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. మేకలను దొంగలించి తప్పించుకు వెళ్తున్న తమను ఎస్ఐ పట్టుకున్నారని, వదలిపెట్టాలని ఎంతగా వేడుకున్నా వినలేదని.. ఎవరికో ఫోన్ చేసి త్వరగా రావాలని చెప్పడంతో తన వద్దనున్న కత్తితో దాడి చేశానని నిందితుడు మణిగండన్ పోలీసులకు వాంగ్ములం ఇచ్చాడు. మరణించినాంతరం అక్కడి నుంచి పారిపోయామని తెలిపాడు. ఈ ముగ్గురిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. నాలుగో వ్యక్తి కోసం వివరాలు సేకరిస్తున్నారు. -
మేకల దొంగల వీరంగం.. స్పెషల్ ఎస్సై హత్య.. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా
సాక్షి, చెన్నై : తిరుచ్చిలో మేకల దొంగలు వీరంగం సృష్టించారు. తమను పట్టుకునేందుకు వచ్చిన స్పెషల్ ఎస్ఐను హతమార్చారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా పోలీసులు దుండుగల కోసం జల్లెడ పడుతున్నారు. మృతుడి కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తిరుచ్చి జిల్లా తిరువేంబూరు సమీపంలోని నవల్ పట్టు పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఎస్ఐగా భూమినాథన్(51) పనిచేస్తున్నారు. భార్య కవిత(46), కుమారుడు గుహనాథన్ (22) ఉన్నారు. విధి నిర్వహణలో నిజాయితీ పరుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. తన జీతంలో సగం అనాథాశ్రమాలకు కేటాయించేవారు. శనివారం రాత్రి హెడ్ కానిస్టేబుల్ చిత్రై వేల్తో కలిసి గస్తీలో ఉన్నారు. చదవండి: సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం మేకల దొంగల కోసం ఛేజింగ్ చిన్న సూర్యర్ గ్రామ శివారులో గస్తీలో ఉండగా మేకల అరుపులను గుర్తించారు. రెండు మోటార్ సైకిళ్లపై నలుగురు యువకులు మేకలను దొంగలించి తీసుకెళుతుండడాన్ని గుర్తించారు. వారి కోసం చేజింగ్ చేశారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఆ దొంగలను చిత్రై వేల్ చేజింగ్ చేయలేకపోయారు. భూమినాథన్ వెనుకడుగు వేయకుండా తిరుచ్చి జిల్లా నుంచి పుదుకోటై జిల్లాలోకి ప్రవేశించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ ఎస్ఐ కీరనూర్‌శేఖర్‌కు కాల్ చేసి పుదుకోటై పల్లత్తు పట్టి గ్రామ శివారుకు రావాలని కోరారు. అయితే తమ వాళ్లు భూమినాథన్‌కు చిక్కడంతో మిగిలిన ఇద్దరు రెచ్చిపోయారు. కత్తులతో భూమినాథన్‌పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. కీరనూరు నుంచి శేఖర్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చదవండి: వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు దుండగుల కోసం గాలింపు అప్పటికే ఆయన మృతిచెందడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డీఐజీ శరవణ సుందర్, తిరుచ్చి ఎస్పీ సుజిత్‌కుమార్, పుదుకోటై ఎస్పీ నిషా పార్థీబన్ నేతృత్వంలోని బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దుండగులు పుదుకోటై జిల్లాకు చెందిన వారై ఉంటారని తేల్చారు. మార్గమధ్యలో ఓ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఈ చేజింగ్ దృశ్యాలు వెలుగుచూశాయి. దాని ఆధారంగా ఎనిమిది ప్రత్యేక బృందాలు దుండగుల కోసం గాలిస్తున్నాయి. రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ఎస్ఎస్ఐ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనను సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తూ ప్రకటన చేశారు. -
కారు డోర్ తెరిస్తే మ్మే..మ్మే..!
పోలీసులు ఒక కారును ఆపి డోర్ తెరిచారు అంతే..! మ్మే..మ్మే..అని రక్షించండో అన్నట్లు అరుస్తున్న మేకలను చూసి విస్తుపోయారు. కాళ్లు కట్టేసి, కొన్నిటికి మూతికి అడ్డంగా గుడ్డ కట్టేసి ఉన్న వాటిని బంధ విముక్తం చేశారు. ఇదేదో మేకల కిడ్నాప్లా ఉన్నట్లుందే అనుకుంటున్నారా?!..అయితే ఎస్ఐ రాజశేఖర్ సోమవారం చెప్పిన ఆ మ్మే..మ్మే..మేటరేమిటంటే.. ఆదివారం చిత్తూరు–అరగొండ రోడ్డులోని హైవే బ్రిడ్జి దగ్గర పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. ఒక స్విఫ్ట్ జైర్ కారులో 12 మేకలు పైవిధంగా ఉండటం చూసి అనుమానించారు. కారులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే వీళ్లు తిరుపతి శెట్టిపల్లెకు చెందిన టి.గిరి(34), పుల్లిచెర్ల మండలం ముతుకువారిపల్లెకు చెందిన భూపతి అలియాస్ కట్టప్ప(35), బంగారుపాళెం మండలం డీకే వూరుకు చెందిన కె.జ్యోతినాథ్(26), ఇందిరమ్మకాలనీకి చెందిన కె.భరత్(23) అని, వీరంతా మేకల దొంగలని, దొంగలించిన మూగజీవాలను విక్రయించేందుకు తరలిస్తున్నట్టు తేలింది. ఈ నెల 16న మండలంలోని మడవనేరిలో శివాజి, అజయ్‌కు చెందిన ఐదు మేకలు, ఈచనేరిలో కృష్ణయ్య చెందిన ఒక పొట్టేలు, ఒక గొర్రెను చోరీ చేసింది వీళ్లేనని వెల్లడైంది. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో నిందితుల ఇళ్ల నుంచి మరో 4 మేకలు, 4 పొట్టేళ్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్లు తవ – తవణంపల్లె చదవండి: వింత: కోడి ఆకారంలో మేక.. నిందితుల అరెస్టు చూపుతున్న ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి -
'మేకను దొంగిలించాడని చేతులు నరికేశాడు'
లాహోర్: తన మేకను దొంగిలించాడనే నెపంతో పదేళ్ల బాలుడి రెండు చేతులు నరికేశాడో కిరాతక భూస్వామి. పాకిస్థాన్ లోని పంబాబ్ ప్రావిన్స్ లోని చోటుచేసుకున్న ఈ ఘటన మానవతావాదులందరినీ కదలించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెషన్స్ కోర్టు అతడికి 10 రోజుల రిమాండ్ విధించింది. లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ జిల్లా చాక్బోలు గ్రామంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. భూస్వామి ముస్తాఫా గౌసఫ్ తన కొడుకు తబస్సుమ్ చేతులను తెగే వరకు పంపింగ్ మిషన్ పెట్టాడని బాలుడి తండ్రి నాసిర్ ఇక్బాల్ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఈనెల 21 తన కొడుకును ఎత్తుకుపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని వాపోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కుమారుడిని రోడ్డుపై వదిలేసి పారిపోయాడని చెప్పాడు. ఈ ఘనట గురించి మీడియా రావడంతో పంజాబ్ సీఎం షహబాజ్ షరీష్ స్పందించారు. కేసు నమోదు చేయడంలో అలసత్వం ప్రదర్శించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తబస్సుమ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతడిని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. తన మేకను దొంగిలించిన తబస్సుమ్ కు గుణపాఠం చెప్పాలనే అతడి చేతులను ఖండించినట్టు పోలీసులతో ముస్తఫా చెప్పాడు. అతడిపై హత్యాచారం కింద కేసు నమోదు చేశారు.