పుష్కరాలకు తగ్గిన రద్దీ
రాజమండ్రి: గోదావరి పుష్కరాలకు బుధవారం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. తొలి రోజుతో పోల్చుకుంటే భక్తులు తగ్గారు. రాజమండ్రిలోని రేవులను పరిశీలిస్తే.. ఒక్క పుష్కర ఘాట్ వద్దే ఎక్కువ మంది జనాభా కనిపిస్తున్నారు. కోటిలింగాల రేవు వద్ద భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మిగతా ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించడం లేదు. దీంతో పుష్కర స్నానానికి 5 నిమిషాలు పడుతోంది.
పుష్కరాల ప్రాంతంలో అనవసరంగా ఉన్న బారికేడ్లను సిబ్బంది తొలగించారు. అక్కడక్కడా ఘాట్ల వద్ద పోలీసులు కనిపిస్తున్నారు. మంగళవారంతో పోలిస్తే భక్తులు మెరుగు పడ్డారు. వీఐపీ ఘాట్లను సాధారణ భక్తులకు అందుబాటులో ఉంచారు. తొలిరోజే ఇలాంటి పని చేసి ఉంటే ప్రమాదం తప్పేదని భక్తులు అంటున్నారు.