gold auction
-
రుణాలు చెల్లించని రైతుల బంగారం వేలం
విజయవాడ : వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు కృష్ణాజిల్లా చల్లపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. 207మంది రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు వేలం ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ...అధికారం చేపట్టిన తర్వాత మాత్రం రుణాల మాఫీలో నిర్లిప్తత వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతాల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నారు. -
అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురం: వ్యవసాయ రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు వద్ద బంగారం వేలం పాటను రైతులు సోమవారం అడ్డుకున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేలంపాట నిర్వహించకూడదని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చేసేదిలేక బ్యాంకు అధికారులు వేలంపాట నిలిపివేశారు. -
'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'
-
'బంగారం వేలంపాటలను ఆపమని కోరాం'
హైదరాబాద్: పంట రుణాల వసూలు చర్యలు నిలిపేయలేమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బ్యాంకర్లు తేల్చిచెప్పారు. రైతులకు నోటీసులు, బంగారం వేలంపాటలను ఆపలేమని స్పష్టం చేశారు. పంటల రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. రుణమాఫీ ఏ సంవత్సరం నుంచి వర్తిస్తుందో చెప్పలేదని అన్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబుతో బ్యాంకర్లు సమావేశమయ్యారు. రుణమాఫీపై విస్తృతంగా చర్చించారు. సర్కారు తకరారు ధోరణిని ఈ సమావేశంలో బ్యాంకర్లు ప్రస్తావించారు. రైతులకు నోటీసులు జారీ, బంగారం వేలంపాటలను ఆపమని కోరామని, అది సాధ్యంకాదని బ్యాంకర్లు చెబుతున్నారని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీపై స్పష్టత ఇస్తేనే నోటీసులు ఆపుతామన్నారని వెల్లడించారు. ఈ నెల 22 తరువాత రుణమాఫీపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీకి అంగీకరించడంలేదని వాపోయారు. కాని హామీని అమలుచేస్తామని చెప్పారు. రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి కూడా న్యాయం చేయాలనే అలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు.