golden baba
-
బంగారు మాస్కు ధర 5 లక్షలు..
కాన్పూర్: కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరైంది. ముఖ్యంగా మాస్కుల పుణ్యమాని తోటి మనుషుల ముఖాలు చూడటం అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని మనోజ్ సెనగర్ అనే వ్యక్తి బంగారు మాస్కుతో వార్తల్లో నిలిచాడు. కాన్పూర్‌లో నివాసం ఉండే ఇతడికి బంగారం అంటే మక్కువట. ఇక రూ.5 లక్షల విలువైన బంగారంతో తయారు చేసిన ఈ మాస్కులో శానిటైజర్ వ్యవస్థ ఉండడం విశేషం. దీంతో ఈ బంగారు మాస్కును మరే విధంగానూ శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన శానిటైజేషన్ వ్యవస్థ వల్ల దీనిని దాదాపు ఇది 36 నెలల వరకు వినియోగించవచ్చని సెనగర్ తెలిపాడు. ఇక ఈ మాస్కుకు శివ శరణ్ అని పేరు కూడా పెట్టారు. మెడలో బంగారు గొలుసులు వేసుకుని తిరిగే సెనగర్‌ను అక్కవి స్థానికులు బప్పీ లాహరి, గోల్డెన్ బాబా అని పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టే ఏకంగా 5 లక్షల విలువైన బంగారు మాస్కుతో ఆయన మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు. అతని వద్దనున్న రివాల్వర్‌కు బంగారు కవర్, మూడు బంగారు బెల్టులు ఉన్నాయి. ఇంత విలువైన సొత్తును దొంగలు, శత్రువులను నుంచి కాపాడుకోవడానికి ఇద్దరు బాడీగార్డులను నియమించుకున్నాడు. చదవండి: కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌పై ఈసీ అనర్హత వేటు -
కన్వార్ యాత్రలో బంగారం బాబా
-
నడిచొచ్చే బంగారం ఈ బాబా
లక్నో: సుధీర్ మక్కర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్ బాబా’ అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్ యాత్రలో ఈ గోల్డెన్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ గోల్డెన్ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం. ఈ ఏడాది జూలై 21న కన్వార్ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభించాం. అయితే తొలుత ఈ ఏడాది కన్వార్ యాత్రకు దూరంగా ఉందామనుకున్నాను. కానీ నా అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేయడంతో సరేనని ఒప్పుకున్నాను. పరమ శివుని అనుగ్రహంతో ఈ ఏడాది కూడా విజయవంతంగా కన్వార్ యాత్ర పూర్తి చేసుకున్నాను’ అని తెలిపారు. ‘ఇక నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందనడంలో సందేహం లేదు. బంగారం ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. తొలుత 2-3గ్రాముల బంగారం ధరించేవాడిని. రాను రాను దాని బరువు పెంచుతూ పోయాను. ఈ ఏడాది 16కిలోల బంగారం ధరించి వచ్చాను. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను. అయితే ఈ బంగారం అంతా నేను సొంతంగా సంపాదించుకున్నదే. ఎవరి దగ్గరి నుంచి విరాళాలు, డబ్బు స్వీకరించి కొన్న బంగారం కాదు’ అన్నారు. ఈ బాబా ధరించే ఆభరణాల్లో గొలుసులు, దేవతల లాకెట్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది 250-300మంది అనుచరులతో బాబా కన్వార్ యాత్రలో పాల్గొంటారు. వారందరికి అవసరమైన ఆహారం, నీరు, అత్యవసర మందులతో పాటు సొంత అంబులెన్స్‌ను కూడా ఆయనే సమకూర్చుకుంటారు. -
20 కేజీల బంగారం.. 21 కార్లు, బౌన్సర్లు
న్యూఢిల్లీ : ‘దేవుడి దయ వల్లే నా దగ్గర ఉన్న బంగారం ప్రతి ఏడు పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలించి.. నా ఆరోగ్యం సహకరిస్తే మరిన్ని యాత్రలు చేస్తానంటున్నా’రు ‘గోల్డెన్ బాబా’ అలియాస్ సుధీర్ మక్కర్. ఈ బాబా ప్రతి ఏడాది 200 కిలోమీటర్ల పాటు సాగే కన్వర్ యాత్ర చేస్తారనే విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా కన్వర్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతం యాత్రలో భాగంగా ఢిల్లీ - మీరట్ రోడ్డులో ఉన్న ఒక రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘గోల్డెన్ బాబా’ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ‘బంగారం, కార్లు అంటే నాకు చాలా ఇష్టం. నేను మరణించే వరకూ వాటి మీద నా పిచ్చి ప్రేమ తగ్గదు. దేవుడు దయ వల్ల నా దగ్గర ఉన్న సంపద (బంగారం) ప్రతి ఏడాది పెరుగుతోంది. పరిస్థితులు అనుకూలించి, ముఖ్యంగా నా ఆరోగ్యం సహకరిస్తే ఇలాంటి యాత్రలు మరిన్ని చేస్తాను. మూడేళ్ల క్రితం నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. చికిత్సం కోసం ముంబైలో ఉన్న అన్ని ప్రముఖ ఆస్పత్రులను సందర్శించాను. కానీ ఉపయోగం లేదు’ అన్నారు. ఈ ఏడాది చేసే కన్వర్ యాత్ర 25వది. ఇదే తన చివరి కన్వర్ యాత్రగా ప్రకటించారు గోల్డెన్ బాబా. తన యాత్రా ప్రస్థానం గురించి చెప్తూ ‘నా తొలి యాత్ర పూర్తవడానికి అయిన ఖర్చు కేవలం 250 రూపాయలు మాత్రమే. ఆ సమయంలో భక్తులు పెట్టింది తింటూ, రోడ్డు పక్కన ఉండే ఆశ్రమాల్లో సేద తీరుతూ నా యాత్రను కొనసాగించాను. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రస్తుతం నేను నాతో పాటు ఒక ప్రత్యేక వంట మనిషిని, వాటర్ ప్రూఫ్ టెంట్‌ని, సిబ్బందిని తీసుకెళ్తాను. వాహానాల కోసమే దాదాపు 1. 25 కోట్లు ఖర్చు చేస్తున్నాను. వీటన్నింటి వల్ల భారీగా ఖర్చవుతుంది. అందుకే నా తొలి కన్వర్ యాత్ర నాకు చాలా ప్రత్యేకం అన్నారు. గతేడాది యాత్ర సందర్భంగా ఈ బాబా 14.5 కేజీల బంగారాన్ని ధరించగా.. ఈ ఏడాది దాదాపు 20 కేజీల బంగారాన్ని ధరించారు, 21 కార్లను, బౌన్సర్లను తీసుకెళ్తున్నారు. ఈ గోల్డేన్ బాబా సన్యాసిగా మారకముందు ఢిల్లీలోని గాంధీ నగర్ మార్కెట్లో వస్త్రాల వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఈ బాబాకు ఘజియాబాద్‌లో ఒక విలాసవంతమైన భవనం ఉంది. ఈ ఆస్తుల గురించి స్పందిస్తూ ‘నా తదనంతరం ఈ ఆస్తులన్ని నా ప్రియ శిష్యునికి చెందుతాయ’ని తెలిపారు. ప్రస్తుతం ఈ బాబా దగ్గర ఓ బీఎండబ్ల్యూ కారు, 2 ఆడీ కార్లు, రెండు ఇన్నోవాలున్నాయి. ఇవే కాక ఒక రోలెక్స్ వాచ్, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు వార్తలు వచ్చాయి. -
మళ్లీ వచ్చిన హరిద్వార్ గోల్డెన్ బాబా
-
20 కిలోల ‘బంగారు’బాబా
హరిద్వార్: బంగారం ధరించి తీర్థయాత్రలు చేసే సాధువు మరోసారి వార్తల్లో నిలిచారు. గోల్డెన్ బాబాగా పేరొందిన సుధీర్ మక్కర్ సుమారు 20 కిలోల బరువైన బంగారు ఆభరణాలు ధరించి హరిద్వార్‌లో జరుగుతున్న కన్వార్ యాత్రలో పాల్గొంటున్నారు. ఇది ఆయనకి 25వ యాత్ర కావడం విశేషం. గతంలోనూ కన్వార్ యాత్రలో మక్కర్ సుమారు రూ.4 కోట్ల విలువచేసే 12–13 కిలోల బంగారం, చేతికి రూ.27 లక్షల రోలెక్స్ గడియారం ధరించి సంచలనం సృష్టించారు. ఏటా ఆయన ఒంటి మీది బంగారం పెరుగుతూ ఉంది. గతేడాది 14.5 కిలోల బంగారు ఆభరణాలు ధరించగా, ఈ ఏడాది రూ.6 కోట్ల విలువైన 20 కిలోల ఆభరణాలతో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల్లో మక్కర్ తన ఖరీదైన వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 2016 జనవరిలో జరిగిన అర్ధకుంభమేళాలో ఆయన్ని చూడటానికి సాటి యాత్రికులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఆయనకు ఎల్లవేళలా ఇద్దరు పోలీసులు కాపలా కాస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లినా అక్కడి ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. -
20 కిలోల బంగారం.. 200 కి.మీ. యాత్ర
హరిద్వార్ : ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి గోల్డెన్ బాబాగా పేరొందిన సుధీర్ మక్కర్ ప్రతి ఏటా హరిద్వార్ నుంచి ఢిల్లీ వరకూ సాగే కన్వర్ యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. 20 కిలోల బంగారు ఆభరణాలను ధరించే గోల్డెన్ బాబా ఈ ఏడాది సాగే 25వ కన్వర్ యాత్రలోనూ పాల్గొంటున్నారు. యాత్రలో పాల్గొనే ముందు బాబా కాషాయ దుస్తుల్లో, భారీ జ్యూవెలరీతో ఉత్తరాఖండ్‌లో మెరిశారు. 200 కిలోమీటర్లు యాత్ర ఆద్యంతం ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగనున్నారు.బంగారు ఆభరణాలను ప్రదర్శించాలనే మోజు తనకు లేదని, సిరిసంపదలకు నిలయమైన లక్ష్మీ దేవతకు ప్రతీకగానే తాను వీటిని ధరిస్తుంటానని ఆయన చెబుతుంటారు. వ్యాపారవేత్త నుంచి స్వామీజీగా మారిన సుధీర్ 25వ కన్వర్ యాత్రే తాను పాల్గొనే చివరి యాత్ర కావచ్చని చెప్పుకొచ్చారు. ఈసారి యాత్రలో తాను ఎక్కువ బంగారు ఆభరణాలను ధరించనని, వాటి బరువు కారణంగా తన మెడనరాలు దెబ్బతింటున్నాయని, ఓ కంటి చూపు కూడా మందగించిందని తెలిపారు. కొత్త బంగారు చైన్ రెండు కిలోలుండగా, శివ లాకెట్ కూడా బరువైనదేనని చెప్పారు. ఇక గోల్డెన్ బాబా యాత్రలో ఉండగా ఆయన బంగారం భద్రంగా ఉండేందుకు భారీ సెక్యూరిటీ నిత్యం ఆయనను అనుసరిస్తుంది. ఇక బాబా సైతం బయటి ఆహార పదార్థాలను తీసుకోకుండా తనతో పాటు వచ్చే తన వ్యక్తిగత ప్యాంట్రీలో తయారయ్యే ఆహారాన్నే తీసుకుంటారు.ఈ బాబాకు ఓ బీఎండబ్ల్యూ, రోలెక్స్ వాచ్, రూ 150 కోట్ల విలువైన ఆస్తులున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. -
ఈ బాబా వాచీ ఖరీదు రూ.27 లక్షలట!
హరిద్వార్: సాధారణంగా బాబా, సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి అనుకుంటాం. కానీ ఇటీవల హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాకు హాజరైన ఓ బాబాను చూస్తే ఈ అభిప్రాయం తప్పేమోనన్న అనుమానం కలుగుతుంది. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోతూ సదరు సన్యాసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఏకంగా మూడున్నర కిలోల బంగారాన్ని ధరించి గంగానదిలో స్నానమాచరించి వస్తున్న బాబాను చూసి అక్కడున్నవారంతా నోళ్లు వెళ్లబెట్టారు. కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు, కమండలం తదితరాలతో సాదాసీదాగా ఉండాల్సిన సన్యాసి కాస్తా రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో మెరిసిపోయాడు. ఒకటా రెండా మెడ నిండా బంగారు గొలుసులు, లాకెట్లు.. అన్ని చేతివేళ్లకు బరువైన ఉంగరాలు. చేతికి పెద్ద వెడల్పాటి కడియం, డైమండ్ వాచ్. ఇలా సన్యాసులకు భిన్నమైన అవతారంతో తన శిష్యులు, అనుచరుల మందీ మార్బలంతో గంగా స్నానమాచరించడం ఆసక్తికరంగా మారింది. వజ్రాలు పొదిగిన ఆయన చేతి వాచీ సుమారు రూ. 27 లక్షల ఖరీదు చేస్తుందట. అయితే సన్యాసికి ఇంత బంగారం ఎందుకు అని ఎవరైనా అంటే ఈ బాబా అనుచరులు, శిష్యులకు కోపం వస్తుంది. బంగారం ఎంత స్వచ్ఛమో, ఎంత అమూల్యమో తమ గురువుకూడా అంతే విలువైనవాడంటూ వెనకేసుకొస్తున్నారు. మా గోల్డెన్ బాబా సేవలు అమూల్యమైనవంటూ మురిసిపోతున్నారు కాగా గోల్డెన్ బాబాగా చెప్పుకునే ఈయన గతంలో ఢిల్లీలో బట్టల వ్యాపారం చేసేవాడట. ఈయన అసలు పేరు సుధీర్ కుమార్ మక్కడ్(53 ). అయితే అప్పుడు ఎన్నో పాపాలు, పొరబాట్లు చేశానంటున్నాడీ గోల్డెన్ బాబా. ఆ పాపాలను కడిగేసుకోవడానికి సన్యాసిగా మారిపోయానంటున్నాడు. వ్యాపారం చేసే క్రమంలో చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సన్యాసం స్వీకరించానని చెబుతున్నాడు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కష్టపడుతున్న పేద తలిదండ్రులకు, ఇతర స్వచ్ఛంద కార్యక్రమాలకు, ధార్మిక కార్యక్రమాలకు సహాయం చేస్తుంటానని చెబుతున్నాడు.