Golden Retriever
-
పేరుకే కుక్క కానీ కోట్ల లో సంపాదన .
-
ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!
విశ్వాసానికి మారుపేరు శునకం. అందుకే చాలా మంది జంతు ప్రేమికులు కుక్కల్ని పెంచుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది అయితే వాటిని కుటుంబ సభ్యులుగానే భావిస్తూ.. ప్రత్యేకంగా గదిని కేటాయించడం సహా ఇళ్లంతా హాయిగా తిరిగేలా స్వేచ్చనిస్తారు. వాటి ఆకలిదప్పుల్ని తీరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అయితే ఒక్కోసారి సమయానికి ఆహారం పెట్టడం మర్చిపోయారే అనుకోండి.. పరిస్థితి ఇదిగో ఈ వీడియోలో చూపించినట్లు ఉంటుంది. ఆకలికి తాళలేక ఓ గోల్టెన్ రిట్రీవర్ డాగ్ కిచెన్‌లోకి దూరింది. ఎలాగోలా కష్టపడి టేబుల్‌పై ఉన్న ఫుడ్ కంటేనర్‌ను నోటకరచుకుంది. అయితే అంతలోనే యజమాని రావడంతో పాపం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. (అప్పటివరకు క్షణమొక యుగంలా గడిపాడు) ‘‘నో!! ఏం చేస్తున్నావు? ఇప్పుడు నిన్ను చూసేశాను!’’ అని కాస్త గొంతు పెద్దది చేసి అరవడంతో బిక్కముఖం వేసింది. చేసిన పనికి యజమాని కళ్లల్లోకి సూటిగా చూడలేక.. నోట్లో ఉన్న బాక్స్‌ను కిందపడేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్యూట్ వీడియో పెట్లవర్స్ను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ గోల్డెన్ రిట్రీవర్ చేష్టలు చూసినవారంతా తమ ఇంట్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయని, వీడైతే బాక్స్ వదిలేసి వెళ్లాడు గానీ, మా లాబ్రడార్ మాత్రం ఇంట్లో ఉన్న తినుబండారాలన్నీ ఖాళీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. దొంగతనం చేసి పట్టుబడిన వాడిలా వాడు చూస్తున్న బేళ చూపులు చూసైనా తిట్టడం ఆపేయాల్సింది అంటూ జాలి చూపిస్తున్నారు.(అంతా చేసి అమాయకుడిలా ఆ ఫేసు చూడు ) -
పెంపుడు కుక్క చూపిన విశ్వాసం
-
కుక్క విశ్వాసంపై మరో వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి పట్ల మనిషికి లేని అత్యంత విశ్వాసం కలిగిన పెంపుడు జంతువేది అంటే ఎవరైనా కుక్క అని తేలిగ్గా చెప్పేస్తారు. యజమాని పట్ల కుక్క కుండే విశ్వాసానికి సంబంధించి అనేక సంఘటనలు, అనేకసార్లు చూసే ఉంటాం. మనం తేలిగ్గా చెబుతాంగానీ అవి యజమానికి ఏమైనా అయితే ఎంత భారంగా ఫీలవుతాయో, ఎంతగా ఆరాట పడతాయో తెలియజేసే మరో సంఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హైలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని దాకింగ్ నగరంలో హఠాత్తుగా ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఓ అంబులెన్స్ వచ్చి ఆమెను స్ట్రెచర్ మీద ఎక్కించుకుంది. ఆమె వెంట వచ్చిన కుక్క ఆమెను వదిలిపెట్టకుండా స్ట్రెచర్‌పై చేతులేసి యజమానురాలిని లేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ యజమానురాలు కొద్దిగా స్పృహలోకి రావడంతో ఆమెను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది, అంబులెన్స్‌లోకి ఆ కుక్కను కూడా అనుమతించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రి వరకు వెన్నంటి వచ్చిన ఆ కుక్క తన యజమానురాలికి చికిత్స సమయంలో కూడా పక్కనే ఉంది. ఆ యజమానురాలు పూర్తిగా స్పహలోకి రాగానే ఆ కుక్కను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆ యజమానురాలి పేరు, ఇతర వివరాలు తెలియవుగానీ కుక్క మాత్రం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినది. తాము అసలు పెంపుడు జంతువులను ఆస్పత్రిలోకి అనుమతించమని, అయితే ఇక్కడ పేషంట్‌ను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని, అందుకు సహకరిస్తున్న కుక్కను చూసి అనుమతించామని ‘జాంగ్ జియాంగ్’ ఆస్పత్రి హెడ్ నర్సు ప్రకటించింది. -
హై.. బ్రీడ్