స్టైల్ కోసం ఓ హెల్ప్‌లైన్
సాక్షి, బెంగళూరు : ఇబ్బందుల్లో ఉన్న వారిని రక్షించేందుకు, న్యాయ సలహాలు సూచనలు అందించేందుకు, కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇలా ఇప్పటి వరకు అనేక సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన హెల్ప్లైన్ల గురించి మనం వినే ఉంటాం. అయితే నేటి యువతరం ‘స్టైల్, గుడ్ లుక్’ కోసం పడే ఇబ్బందులను తీర్చేందుకు ఇప్పడు ఓ హెల్ప్‌లైన్ అందుబాటులోకి వచ్చేసింది.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మంత్ర.కామ్ ‘లుక్గుడ్’ పేరిట దేశంలోనే మొట్టమొదటి సారిగా స్టైల్ సలహాలు అందించేందుకు ఓ హెల్ ్పలైన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం సాయంత్రమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ ఫాక్రీ, మంత్ర సంస్థ సీఈఓ ముకేష్ బన్సాల్ ఈ హెల్ప్‌లైన్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముకేష్ బన్సాల్ మాట్లాడుతూ...080-43541999 నంబర్‌తో హెల్ప్‌లైన్ (సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుంది.)ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ హెల్ప్‌లైన్‌కి ఫోన్‌చేసి తమ రోజువారీ వస్త్రధారణపై మాత్రమే కాక పార్టీలు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లకు హాజరుకావడం తదితర ప్రత్యేక సందర్భాల్లో వస్త్రధారణ ఎలా ఉండాలనే విషయంపై సూచనలు సలహాలు పొందవచ్చని తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్‌లో నిపుణులైన వ్యక్తులు ఈ సలహాలు, సూచనలు అందజేస్తారని వుుకేష్ బన్సాల్ వెల్లడించారు.