Google Assistant
-
గూగుల్ అసిస్టెంట్ పాడే కరోనా వ్యాక్సిన్ పాట విన్నారా...!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్ లాంటి దేశాలను కరోనా సెకండ్ వేవ్ కుదిపివేస్తోంది. కరోనా వైరస్ ఎదుర్కొవడానికి పలు దేశాలు చేసిన పరిశోధనలతో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. కాగా కొంతమందికి వ్యాక్సిన్‌పై అనుమానం ఉండడంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్లో పాల్గొనేందుకు కోసం గూగుల్ తన వంతుగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఒక ప్రత్యేక ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్ వ్యాక్సిన్‌పై అపోహలును తీర్చుతూ ఒక పాటను పాడేలా గూగుల్ ఏర్పాటు చేసింది. మీరు మీ ఫోన్లో ‘ఓకే గూగుల్.. సింగ్ ది వ్యాక్సిన్ సాంగ్’ అనగానే గూగుల్ అసిస్టెంట్ పాట పాడుతుంది. ఈ పాటతో ప్రజలను వ్యాక్సిన్ చేయించుకునేలా ప్రోత్సహిస్తోందని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పాటలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ను , వ్యాక్సిన్ తయారీదారులను కీర్తిస్తూ లిరిక్స్ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో గూగుల్ అసిస్టెంట్ పాడే వ్యాక్సిన్ పాట వైరల్‌గా మారింది. ఈ పాటను విన్న ఓ నెటిజన్ ‘నేను వెంటనే వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుంటాన’ని తెలిపాడు. Google Assistant singing vaccine song pic.twitter.com/tmT2p2HvWh — Jason Lim🇸🇬🇭🇰🇹🇼🇹🇭🇲🇲 (@jas0nsg) May 7, 2021 చదవండి: Fact Check: 5జీ టెస్టింగ్ వల్లే కోవిడ్ సెకండ్ వేవ్..! -
గూగుల్ @కరోనా సెంటర్
న్యూఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల గురించి సమాచారాన్ని ఇకపై గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్‌లో కూడా తెలుసుకోవచ్చు. తాము కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు దగ్గరగా ఉన్న కోవిడ్ పరీక్షా కేంద్రాల గురించి తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. దీనికోసం గూగుల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), మై గవర్నమెంట్ నుంచి అధికారిక సమాచారాన్ని పొందనుంది. ఈ సమాచారం ఇంగ్లిష్తో పాటు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ లభించనుంది. ఈ సమాచారాన్ని పొందడం చాలా సులభం. గూగుల్‌లో నెటిజన్లు కరోనా గురించిన సమాచారాన్ని వెతికేటపుడు సెర్చ్ రిజల్ట్స్‌లో టెస్టింగ్ అనే బటన్ కూడా కనిపించనుంది. కరోనా వైరస్ నిర్ధారణ జరిపే ల్యాబ్ వివరాలు ఆ బటన్ నొక్కడం ద్వారా పొందవచ్చని గూగుల్ తెలిపింది. ఇదే సదుపాయం గూగుల్ మ్యాప్స్‌లో కరోనా నిర్ధారణ ల్యాబ్‌ల గురించి వెతికే వారికి కనిపించనుంది. ప్రస్తుతానికి 300 నగరాల్లోని 700 పరీక్షా కేంద్రాలను గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, మ్యాప్స్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని కేంద్రాల సమాచారాన్ని పొందుపరచేందుకు అధికారులతో కలసి పని చేస్తున్నట్లు పేర్కొంది. -
గూగుల్ అసిస్టెంట్‌లో అద్భుతమైన ఫీచర్!
టెక్ దిగ్గజం గుగూల్ మరో అద్భుతమైన ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఇంటర్ప్రెటర్ (దుబాసీ) మోడ్ అందరికీ అందుబాటులో రానుంది. ఈ రియల్ టైమ్ ట్రాన్సలేషన్ ఫీచర్‌ను వాడుకొని ప్రపంచంలోని దాదాపు 44 భాషల్లో మాట్లాడవచ్చు. మన దేశానికి చెందిన బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు, ఉర్దూ తదితర తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్ పనిచేస్తోంది. ఈ ఫీచర్ తెరిచి మనకు వచ్చిన భాషలో మాట్లాడితే చాలు.. అది వెంటనే మనకు కావాల్సిన భాషలో అనువాదం చేసి పెడుతోంది. విదేశీ పర్యటనకు, పక్క రాష్ట్రాలకు వెళితే.. అక్కడి భాష తెలియనివారికి ఈ ఫీచర్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త భాషలు నేర్చుకునేవారికి ఈ ఫీచర్ ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉండనుంది. మొదట 2019 జనవరిలో కన్జుమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్)లో ఇంటర్ప్రెటర్ మోడ్ గురించి మొదట పరిచయం చేసిన గూగుల్.. తమ కంపెనీకి చెందిన గూగుల్ హోమ్ డివైజెస్, స్మార్ట్ డిస్ప్లేలలో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ స్మార్ టెక్నాలజీని అన్ని స్మార్ట్ఫోన్లలో అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఇక ఫీచర్ పనిచేస్తుంది. అండ్రాయిడ్ ఫోన్లలో బైడిఫాల్ట్‌గా గూగుల్ అసిస్టెంట్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఐఫోన్లలో కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్ అసిస్టెంట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. ఈ ఫీచర్‌ను ఐఫోన్లో కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. ఈ దుబాసీని వాడటం ఎలా? గుగూల్ అసిస్టెంట్ ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను వాడటం చాలా సులువు. మీ స్మార్ట్ఫోన్లలోని గూగుల్ అసిస్టెంట్‌ను తెరిచి.. ఇంటర్‌ప్రిటెర్ మోడ్‌ను డైరెక్ట్‌గా వాడొచ్చు. ‘ఓకే గూగుల్ లేదా హే గూగుల్’ అనే వాయిస్ కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను తెరవచ్చు. లేదా అండ్రాయిడ్ ఫోన్లలో పవర్ బటన్‌ను ప్రెస్ చేయడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతోంది. - "Hey Google, be my Tamil translator" or "Hey Google, help me English From Telugu" వంటి కమాండ్స్‌తో డైరెక్ట్‌గా ఇంటర్‌ప్రిటెర్ మోడ్ ఓపెన్ అవుతోంది. మీకు ఏ భాష రాకుంటే.. ఆ భాషలో ఇంటర్‌ప్రెటెర్ మోడ్‌ను ఓపెన్ చేసి సంభాషించడమే. మీకు వచ్చిన భాషలో మాట్లాడితే.. కావాల్సిన భాషలోకి గూగుల్ అసిస్టెంట్ అనువాదం చేసి ఇస్తుంది. కొత్త కొత్త భాషలు నేర్చుకోవాలనుకునే వారికి ఇదెంతో పనికొచ్చే ఫీచర్ అని చెప్పవచ్చు.