Google the company
-
‘గూగుల్’కు కోనాపురం కుర్రోడు
చెన్నారావుపేట : గూగుల్ కంపెనీ నిర్వహించిన ఇంట ర్వ్యూలో కోనాపురం గ్రామానికి చెందిన ఎడ్ల బక్కారెడ్డి, కవిత దంపతుల పెద్ద కుమారుడు థావణ్రెడ్డి ఎంపికయ్యాడు. స్విట్జర్లాండ్‌లోని జూరిక్ పట్టణంలో గల సంస్థ కార్యాలయంలో ఈనెల ఒకటిన విధుల్లో చేరాడు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నర్సంపేటలోని సెయింట్ మేరీ పాఠశాలలో 2000 సంవత్సరంలో 2వ తరగతి చదివానని తెలిపాడు. తన తండ్రికి విప్రో కంపెనీలో సీనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగం రావడంతో బెంగళూర్ వెళ్లామని చెప్పాడు. అక్కడే ఇంటర్ పూర్తి చేసి, 2014 వరకు సూరత్‌లోని నిట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చేశానని తెలిపాడు. జనవరి నుంచి మార్చి వరకు పదివూర్లు గూగుల్ కంపెనీ వారు ఇంటర్వ్యూలు నిర్వహించారని, ఇందులో భారతదేశం నుంచి 43 మందిని ఎంపిక చేయగా.. చెన్నారావుపేట మండలం కోనాపురం నుంచి తాను ఎంపికయ్యానని తెలి పాడు. ఏడాదికి రూ.79.80లక్షల వేతనం, ఇతర అలవెన్స్లతో కలిపి రూ.కోటి 10లక్షల వేతనం సంస్థ అందిస్తుందని వివరించాడు. కాగా, థవణ్రెడ్డి ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు బక్కారెడ్డి, కవిత, తాతయ్య, అమ్మమ్మలు రాధా రపు సాంబరెడ్డి, విజయ, ఎడ్ల రంగారెడ్డి, కౌసల్య హర్షం వ్యక్తం చేశారు. -
అంతరిక్షం అంచుల నుంచి.. ధ్వని కంటే వేగంగా!
వాషింగ్టన్: ఆకాశం నుంచి కిందికి దూకడంలో గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు సరికొత్త రికార్డు సృష్టించారు. అంతరిక్షం అంచుల దాకా బెలూన్‌తో వెళ్లి.. అక్కడి నుంచి ధ్వని కంటే వేగంగా కిందికి దూకేశారు! గూగుల్ నాలెడ్జి విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన 57 ఏళ్ల అలెన్ యూస్టేస్ ఈ ఘనత సాధించారు. స్ట్రాటోస్పియర్ పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ఆయన ఈ స్కైడైవింగ్ చేశారు. తొలుత పెద్ద బెలూన్‌కు వేలాడుతూ నిమిషానికి వెయ్యి అడుగుల చొప్పున రెండున్నర గంటలపాటు పైకి ప్రయాణించిన అలెన్ 1.35 లక్షల అడుగుల (41 కిలోమీటర్లు) ఎత్తులో స్ట్రాటోస్పియర్ చివరికి చేరుకున్నారు. అక్కడ అరగంట పాటు అంతరిక్షాన్ని, భూ వాతావరణం అందాలను చూస్తూ గడిపారు. ఆ తర్వాత బెలూన్ నుంచి విడిపోయారు. వెంటనే ఓ చిన్న రాకెట్లాంటి మాడ్యూల్ మండుతూ అలెన్‌ను వేగంగా కిందికి తోసింది. దీంతో.. ధ్వని కంటే వేగంగా.. అంటే సెకనుకు 340.29 మీటర్ల వేగాన్ని మించి 90 సెకన్ల పాటు కిందికి దూసుకొచ్చారు. ఉపరితలానికి 18 వేల అడుగుల ఎత్తులోకి రాగానే పారాచూట్‌ను విప్పుకొని నెమ్మదిగా నేలపై వాలిపోయారు. న్యూమెక్సికోలోని రాస్వెల్ వద్ద నిర్వహించిన ఈ స్కైడైవింగ్‌కు పారగన్ స్పేస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాంకేతిక సహకారం అందించింది. నేలకు సురక్షితంగా చేరుకున్న తర్వాత ఆనందంతో తబ్బిబ్బయిపోయిన అలెన్.. ‘అక్కడి నుంచి అంతరిక్షం నలుపును చూశాను. తొలిసారిగా వాతావరణం పొరలను చూశాను. చాలా అద్భుతంగా, అందంగా ఉంది’ అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. కాగా, ఇంతకుముందు అత్యధిక ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసిన రికార్డు ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్ పేరు మీద ఉంది. ఆయన కూడా న్యూమెక్సికో నుంచే 2012లో 38.969 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని స్కైడైవింగ్ చేశారు. -
ఆండ్రాయిడ్ తాజా వెర్షన్... లాలిపాప్
శాన్ఫ్రాన్సిస్కో/న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తాజా వెర్షన్ లాలిపాప్‌ను నేడు విడుదల చేయనున్నది. దీనితో పాటు నెక్సస్ 6(స్మార్ట్‌ఫోన్), నెక్సస్ 9(ట్యాబ్), ఆండ్రాయిడ్ టీవీ- ద నెక్సస్ ప్లేయర్‌ను కూడా అందిస్తోంది. వీటికి ముందస్తు బుకింగ్‌లు ఈ నెలలోనే ప్రారంభమవుతాయని, విక్రయాలు వచ్చే నెలలో ఉంటాయని గూగుల్ పేర్కొంది. యాపిల్ కంపెనీ కొత్త ఐపాడ్‌ను శుక్రవారం మార్కెట్లోకి తేనున్నది. ఒక్క రోజు ముందు గూగుల్ నెక్సస్ ఉత్పత్తుల గురించి వెల్లడించడం విశేషం. నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మోటొరొలా కంపెనీ, నెక్సస్ 9 ట్యాబ్‌ను హెచ్‌టీసీ, ద నెక్సస్ ప్లేయర్‌ను ఆసూస్ కంపెనీలు తయారు చేశాయి. -
గూగుల్ కే బుల్స్‌కు సొరచేపల ముప్పు!
న్యూయార్క్: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీకి సొరచేపల నుంచి ముప్పు ఎదురవుతోంది. పశ్చిమ అమెరికా నుంచి ఆసియా వరకూ సముద్రం అడుగున ఆ కంపెనీ వేసుకున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను సొరచేపలు కొరికేస్తున్నాయట. కేబుల్స్ వల్ల స్వల్ప అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. అయితే ఆహార వేట కోసం సొరచేపల నోటిలో అయస్కాంత క్షేత్రాలను గుర్తించే సెన్సర్లు ఉండటంతో అవి ఈ కేబుల్స్‌ను గుర్తించి దాడి చేస్తున్నాయట. దీన్ని నిరోధించేందుకు కేబుల్స్‌కు పైపూతగా కేవ్లార్ అనే సింథటిక్ ఫైబర్‌ను పైపొరగా వాడినా ఫలితం ఉండట్లేదని తెలుస్తోంది. -
ఇంటర్నెట్ను గూగుల్ కలుషితం చేస్తోంది
సర్వేయర్ జనరల్ స్వర్ణ సుబ్బారావు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా అధికారిక రహస్య సమాచారాన్ని బహిరంగంగా అందుబాటులోకి తెస్తూ గూగుల్ కంపెనీ ఇంటర్నెట్ను కలుషితం చేస్తోందని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు ఆరోపించారు. మ్యాపథాన్-2013 కార్యక్రమం ద్వారా సైన్యం, ప్రభుత్వానికి చెందిన రహస్య స్థావరాలను గూగుల్ బహిరంగ మ్యాపులలో చేర్చిందని, దీనిపై వివరణ కోరామని ‘పీటీఐ’కి తెలిపారు. వివరణనిచ్చేందుకు కంపెనీ ప్రతినిధులు తనను ఓ హోటల్లో కలుస్తామన్నారని, కానీ తనను ఆఫీసులోనే కలవాలని చెప్పానన్నారు. దేశ మ్యాపులు రూపొందించేందుకు సర్వే ఆఫ్ ఇండియా(ఎస్ఓఐ)కి మాత్రమే అధికారం ఉంది. అయితే నెటిజన్ల నుంచి సమీప ప్రాంతాల సమాచారాన్ని కోరిన గూగుల్.. వారి సమాచారం ఆధారంగా రక్షణశాఖకు చెందిన రహస్య స్థావరాలను సైతం మ్యాపులలో చేర్చింది.