ఆండ్రాయిడ్ తాజా వెర్షన్... లాలిపాప్ | The latest version of Android ... Lollipop | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్ తాజా వెర్షన్... లాలిపాప్

Published Fri, Oct 17 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

ఆండ్రాయిడ్ తాజా వెర్షన్... లాలిపాప్

ఆండ్రాయిడ్ తాజా వెర్షన్... లాలిపాప్

శాన్‌ఫ్రాన్సిస్కో/న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో తాజా వెర్షన్ లాలిపాప్‌ను నేడు విడుదల చేయనున్నది. దీనితో పాటు  నెక్సస్ 6(స్మార్ట్‌ఫోన్), నెక్సస్ 9(ట్యాబ్), ఆండ్రాయిడ్ టీవీ- ద నెక్సస్ ప్లేయర్‌ను కూడా అందిస్తోంది.  వీటికి ముందస్తు బుకింగ్‌లు ఈ నెలలోనే ప్రారంభమవుతాయని, విక్రయాలు వచ్చే నెలలో ఉంటాయని గూగుల్ పేర్కొంది. యాపిల్ కంపెనీ కొత్త ఐపాడ్‌ను శుక్రవారం మార్కెట్లోకి తేనున్నది. ఒక్క రోజు ముందు గూగుల్ నెక్సస్ ఉత్పత్తుల గురించి వెల్లడించడం విశేషం. నెక్సస్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మోటొరొలా కంపెనీ, నెక్సస్ 9 ట్యాబ్‌ను హెచ్‌టీసీ, ద నెక్సస్ ప్లేయర్‌ను  ఆసూస్  కంపెనీలు తయారు చేశాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement