google executive
-
గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టుకు సీటీవో గుడ్ బై
వాహనరంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. సిలికాన్ వ్యాలీ రోడ్లపై టెస్టింగ్ పరుగులు తీస్తున్న గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాకముందే ఆ ప్రాజెక్టు అధికారులు దానికి గుడ్ బై చెబుతున్నారు. దాదాపు ఏడున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టుకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీఓ)గా పనిచేసిన క్రిస్ ఉర్మ్ సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. ఉర్మ్ సన్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగడాన్ని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టు సీఈవో జాన్ క్రాఫ్సిక్, ప్రాజెక్టు అధికార ప్రతినిధి జానీ లూ నిర్ధారించారు. కొత్త ఛాలెంజ్‌కు తాను సిద్దమవుతున్నట్టు, కానీ తదుపరి ప్రాజెక్టు ఏం చేస్తానన్నది ఇంకా తెలియదని ఉర్మ్ సన్ తెలిపారు. కొత్త సాహసాలకు క్రిస్ ఉర్మ్ సన్ కు గుడ్ లక్ చెబుతూ ప్రాజెక్టు సీఈవో జాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్ల క్రితం సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు ఆలోచన తప్ప తమ దగ్గర ఇంకేమీ లేదని, ఈ ప్రాజెక్టును పరిశోధన అంకం నుంచి కారు తయారీ వరకు అభివృద్ధి చేయడంలో క్రిస్ కీలక పాత్ర పోషించారని జానీ లూ కొనియాడారు. లైఫ్ సేవింగ్ టెక్నాలజీ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుందని లూ ఆనందం వ్యక్తంచేశారు. అయితే ఈ ప్రాజెక్టులో కీలక పదవుల్లో ఉన్న అధికారులు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో ఈ ప్రోగ్రామ్‌కు ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న ఆంథోనీ లెవాన్‌డౌస్కీ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.అదేవిధంగా ప్రధాన సాప్ట్ వేర్ ఇంజనీర్ జియాజున్ జు, మరొక సాప్ట్ వేర్ డేవ్ ఫెర్గూసన్ లూ ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ ప్రాజెక్టు కోసం డజన్ మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టును స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీగా రూపొందించాలని గూగుల్ భావిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు యూనిట్ ను ఓ కంపెనీగా ఏర్పాటుచేసేందుకు గూగుల్ సన్నద్ధమవుతుందని అధికారులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఎక్స్ రీసెర్చ్ లాబోరేటరీ యూనిట్ లో ఒకటిగా ఈ ప్రోగ్రామ్ ఉంది. జూలైలో ఈ ప్రాజెక్టుకు మొదటి జనరల్ కౌన్సిల్‌ను కూడా నియమించారు. కాలిఫోర్నియా, అరిజోనా, వాషింగ్టన్, టెక్నాస్‌లో ఈ కారు 1.8 మిలియన్ మైళ్ల వరకు టెస్ట్ డ్రైవ్ కూడా నిర్వహించింది. అయితే ఇంకా పబ్లిక్ లోకి ఎప్పుడు తీసుకొస్తారన్నది గూగుల్ వెల్లడించలేదు. -
గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన సెక్స్ వర్కర్ కు జైలు
కాలిఫోర్నియా: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఉద్యోగి చావుకు కారణమైన వేశ్యకు అమెరికా కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. ఉద్దేశపూర్వకంగా ఓ వ్యక్తి మరణానికి కారకురాలు అయినందుకు అలిక్స్ కేథరిన్ టిషెల్ మాన్(27) అనే సెక్స్ వర్కర్ ను శాంతాక్రజ్ సుపీరియర్ కోర్టు దోషిగా తేల్చి, శిక్ష విధించింది. గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఫోరెస్ట్ హేయస్స్(51)కు హెరాయిన్ ఇంజక్షన్ ఇచ్చి అతడి చావుకు కారణమైంది. విలాసవంతమైన శాంతాక్రూజ్ ఓడలో 2013, నవంబర్ లో ఆమె ఈ దారుణానికి పాల్పడింది. 2014లో ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసు అధికారి ఒకరు కస్టమర్ లా నటించి వెయ్యి డాలర్లు అధికంగా ఇస్తామని చెప్పి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఫోరెస్ట్ హేయస్స్ కు హెరాయిన్ ఇంజక్షన్ ఇవ్వడమే కాకుండా చివరి క్షణాల్లో అతడికి ఎటువంటి సహాయం చేయలేదని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అత్యవసర వైద్య సేవల కోసం 911 నంబర్ కూడా ఫోన్ చేయలేదని పేర్కొంది. ఆమె చేసిన నేరం సీసీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. హత్యానేరంతో పాటు నిషేధిత మాదకద్రవ్యాలు కలిగివుండడం, సాక్ష్యాలు నాశనం చేయడం, వ్యభిచారానికి పాల్పడడం వంటి అభియోగాలు మోపింది. ఈ నేరాలన్నింటికీ కనీసం 15 ఏళ్ల జైలు పడుతుందని భావించారు. అయితే నేరం అంగీకరించి, క్షమాపణ చెప్పడంతో ఆమెకు ఆరేళ్ల శిక్ష పడింది. -
చక్కని ఉద్యోగం.. భూకంపానికి చిక్కాడు
శాన్ ఫ్రాన్సిస్కో: అతడిది చక్కటి ఉద్యోగం.. అదీకూడా గుగూల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా.. కాకపోతే అతడికి పర్వతారోహణల పిచ్చి కూడా ఉంది. అదే అతడి ప్రాణం మీదకు తెచ్చింది. నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా గూగుల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చనిపోయారు. స్వతహాగా సాహసికుడు అయిన డాన్ ఫ్రెడిన్ బర్గ్ హిమాలయ పర్వతాల్లో ఎవరెస్టు పర్వతారోహణకు వెళ్లే క్రమంలో బేస్ క్యాంపు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. హిమాలయాలు మొత్తం కంపించడంతో భారీ ఎత్తున కొండ చరియలు కూడా విరిగి పడిన విషయం తెలిసిందే. ఇవి డాన్ ఉన్న బేస్ క్యాంపుపై పడటంతో డాన్‌తో సహా మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గూగుల్ సంస్థ స్వయంగా ప్రకటించింది. చాలా కాలంగా గూగుల్ ప్రైవసీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి మౌంట్ ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో ఉండగా డాన్ ప్రాణాలు కోల్పోయాడు. డాన్ తోపాటు ఉన్న మరో ముగ్గురు గూగుల్ ఉద్యోగస్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. డాన్ తలకు బలమైన గాయం అవడం వల్ల ప్రాణాలు విడిచాడని అతడి సోదరి తెలిపింది.