govermment
-
ఇంటికి ఇక డిజిటల్ నంబర్
భైంసా(ముథోల్) : పట్టణాల్లో ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు అనుసరిస్తున్నా అక్రమాలు ఆగడంలేదు. షాటిలైట్ ఆధారంగా జియోట్యాగింగ్ విధానంతో ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు ఇంటి పన్ను నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించినా అక్రమాలు నిలుపడంలో విఫలమవుతున్నారు. మున్సిపాలిటీల్లోని పెద్దపెద్ద భవనాలు, ఇళ్లు, వ్యాపార సముదాయాలకు డిజిటల్లో సూచించిన లోన్ల ప్రకారం పన్నులు రావడంలేదు. దీంతో ప్రభుత్వం పట్టణాల్లో ఇళ్లకు డిజిటల్ నంబర్లను కేటాయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో అమలులోకి తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మున్సిపాలిటీల్లో... జిల్లాలో నిర్మల్, భైంసా రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులు, 1.10లక్షల జనాభా ఉన్నారు. భైంసా మున్సిపాలిటీలో 23 వార్డులు, 56వేల జనాభా ఉన్నారు. పట్టణాల్లోని వార్డులను వార్డులుగా లేదా బ్లాకులుగా విభజిస్తారు. బ్లాకుకు ఒక నంబరును కేటాయించి ఇళ్లకు వరుసగా నంబర్లు నమోదు చేస్తారు. ఖాళీస్థలాలు, ప్లాట్లు ఉన్న వాటికి నంబర్లు కేటాయించి పన్ను నిర్ధారిస్తారు. మున్సిపాలిటీలో ఒకటవ వార్డును ఒకటవ బ్లాకుగా గుర్తిస్తే ఆ వార్డుకు సైతం ఒకటవ నంబరు నమోదవుతుంది. ఒకటవబ్లాకు, ఒకటవ వీది, ఒకటవ ఇంటి నంబరు(111) ఇలా డిజిటల్ నంబరు నమోదవుతుంది. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బ్లాకులు, వీధులను, ఇళ్లను ఇలా మూడంకెలతో నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వార్డు వారిగా డిజిటల్మ్యాప్లను ఆన్లైన్లో చేర్చి ఇల్లు, చిరునామా తెలుసుకునేలా పూర్తి సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. తొలగనున్న ఇబ్బందులు ఇళ్లకు డిజిటల్ నంబర్లు నమోదుచేస్తే ఇంటి పన్ను విషయంలో ఎలాంటి అవకతవకలు జరుగవు. మున్సిపాలిటీ నిర్ధారించిన ఆదాయం సమకూరుతుంది. ప్రజలకు చిరునామ ఇబ్బందులు తొలగుతాయి. పట్టణానికి ఎవరైనా కొత్తవారు వస్తే ఇంటి చిరునామా డిజిటల్ నంబరు ఆధారంగా తెలిసిపోతుంది. ఈవిధానంతో పౌర సరఫరాల శాఖ, పోస్టల్, పోలీసు, టెలికాం, విద్యుత్‌శాఖ, జనాభాగణన, ప్రైవేటు గ్యాస్ ఏజెన్సీలు, ఇతర సేవలకు సైతం ఇబ్బందులు తీరనున్నాయి. డిజిటల్ నంబర్లతో మున్సిపాలిటీల్లోనూ పారదర్శకత నెలకొనే అవకాశం ఉంటుంది. -
ఇంటింటికీ టీడీపీలో అధికారులు
–రాకపోతే బెదిరింపులు ∙ –ఆందోళనలో అధికారులు, సిబ్బంది సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్ర మం అధికారులకు తలనొప్పిగా మా రింది. మండలస్థాయి అధికారులు త ప్పకుండా తమతో పాల్గొనాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలతో పాటు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ విభాగాల అ ధికారులందరూ ఇంటింటికీ తెలుగుదేశంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే అధికారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయారోజుల్లో కార్యాలయాల్లో పనులు స్తంభిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమం కా కుండా అధికార పార్టీకి చెందిన కార్యక్రమంలో అధికారులు ఎలా పాల్గొం టారని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఎవరూ పాల్గొనడం లేదని చెబు తున్నారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఎలక్ట్రికల్, హౌసింగ్, పంచాయతీరాజ్ ఏఈలు, ఏపీఎంలు, అంగ¯ŒSవాడీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో నిర్బం ధంగా పాల్గొనాల్సి వస్తోంది. తాము రామని చెబితే ఎక్కడ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనన్న భయంతో వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు నుంచి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నా రు. శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సహజమైన శైలిలో ఏలూరు మండలం కోటేశ్వర దుర్గాపురం గ్రామ కార్యదర్శిని మెడపట్టుకుని డ్రైనేజీపై తోశారు. ‘ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది. నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న పం చాయతీ కార్యదర్శి కన్నీళ్లు పెట్టుకున్నా రు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసే ధైర్యం మాత్రం చేయలేదు. మరోవైపు జీతాల కోసం ఆందోళన చేస్తున్న అంగ¯ŒSవాడీ ఉద్యోగులపై ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు దురుసుగా మా ట్లాడటం, రాజకీయాలు చేస్తున్నారం టూ ఆరోపించడంపై ఉద్యోగులు నిరస న వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అధికారులను వాడుకోవడం రాజ కీయం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు.