ఇంటింటికీ టీడీపీలో అధికారులు
ఇంటింటికీ టీడీపీలో అధికారులు
Published Mon, Sep 18 2017 12:32 AM | Last Updated on Fri, Aug 10 2018 8:31 PM
–రాకపోతే బెదిరింపులు ∙
–ఆందోళనలో అధికారులు, సిబ్బంది
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్ర మం అధికారులకు తలనొప్పిగా మా రింది. మండలస్థాయి అధికారులు త ప్పకుండా తమతో పాల్గొనాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలతో పాటు స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ విభాగాల అ ధికారులందరూ ఇంటింటికీ తెలుగుదేశంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే అధికారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయారోజుల్లో కార్యాలయాల్లో పనులు స్తంభిస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమం కా కుండా అధికార పార్టీకి చెందిన కార్యక్రమంలో అధికారులు ఎలా పాల్గొం టారని ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని, ఎవరూ పాల్గొనడం లేదని చెబు తున్నారు. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఎలక్ట్రికల్, హౌసింగ్, పంచాయతీరాజ్ ఏఈలు, ఏపీఎంలు, అంగ¯ŒSవాడీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో నిర్బం ధంగా పాల్గొనాల్సి వస్తోంది. తాము రామని చెబితే ఎక్కడ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనన్న భయంతో వెళ్లాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు నుంచి ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని అధికారులు చెబుతున్నా రు. శనివారం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సహజమైన శైలిలో ఏలూరు మండలం కోటేశ్వర దుర్గాపురం గ్రామ కార్యదర్శిని మెడపట్టుకుని డ్రైనేజీపై తోశారు. ‘ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది. నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న పం చాయతీ కార్యదర్శి కన్నీళ్లు పెట్టుకున్నా రు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసే ధైర్యం మాత్రం చేయలేదు. మరోవైపు జీతాల కోసం ఆందోళన చేస్తున్న అంగ¯ŒSవాడీ ఉద్యోగులపై ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు దురుసుగా మా ట్లాడటం, రాజకీయాలు చేస్తున్నారం టూ ఆరోపించడంపై ఉద్యోగులు నిరస న వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అధికారులను వాడుకోవడం రాజ కీయం కాదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement