government G.O
-
TS: వీఆర్ఏల సర్ధుబాటు.. జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు
-
హోంశాఖ జారీ చేసిన జీవోపై ఎల్లోమీడియా వక్రభాష్యం
-
ఆ జీవో టీడీపీకి, ఎల్లో మీడియాకి అర్థం కాలేదేమో!
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 1పై టీడీపీ, ఎల్లోమీడియా వక్రభాష్యం చూపిస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాల సభల నిషేధానికంటూ దుష్ప్రచారం నిర్వహిస్తోంది. జీవోలో స్పష్టంగా మార్గదర్శకాలు పేర్కొన్నప్పటికీ.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే రీతిలో రాతలను ఎల్లోమీడియా ద్వారా ప్రొత్సహిస్తోంది టీడీపీ. ఇంతకీ జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసిన మార్గదర్శకాలను ఓసార పరిశీలిస్తే.. ఏపీ ప్రభుత్వం తరపున హోం శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 1.. ప్రజల భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలు సూచించింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై సభల నిర్వహణతో ప్రజలకు ఇబ్బందులు ఉంటాయని అందులో పేర్కొంది. హైవేలపైనా సభలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. అంతేకాదు.. ప్రజలకు ఇబ్బందుల్లేని పబ్లిక్ గ్రౌండ్స్‌లో, ప్రత్యామ్నాయ ప్రైవేట్ స్థలాల్లో సభలను నిర్వహించుకోవాలని సూచించింది. మున్సిపల్, పంచాయతీ రోడ్లు మరింత ఇరుకుగా ఉన్నందున.. పబ్లిక్ మీటింగ్స్ శ్రేయస్కరం కాదని పేర్కొంది ప్రభుత్వం. ఇరుకు రోడ్లలో సభలతో ప్రజనలకు హానికరమని స్పష్టం చేసింది. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో లిఖితపూర్వక కారణాలు తెలియజేసే దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశం జారీ చేసింది కూడా. రోడ్డు వెడల్పు, మీటింగ్ సమయం, స్థలం, ఎగ్జిట్ పాయింట్స్, ఆ సభలకు హాజరయ్యే జనాభా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది ప్రభుత్వం. సభలు పెట్టేవారికి పోలీసులు ప్రత్యామ్నాయ ప్రదేశాలు సూచించాలని కూడా ప్రభుత్వం ప్రస్తావించింది ఆ మార్గదర్శకాల్లో. ప్రజల భద్రత, వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని, జిల్లా పోలీస్ యంత్రాంగం సభలకు అవసరమైన స్థలాలు గుర్తించాలని ఆదేశాల్లో పేర్కొంది. ట్రాఫిక్, ప్రజల రాకపోకలు, ఎమర్జెన్సీ సేవలు.. నిత్యావసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా గుర్తించాలని ఆదేశించింది. స్పష్టంగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చినా దుష్టచతుష్టయం దుష్ప్రచారం నిర్వహిస్తోంది. సభలు, ర్యాలీలు మొత్తానికే నిషేధించారంటూ వక్రభాష్యం చెప్తోంది. -
దళిత వ్యతిరేక జీఓకు నిరసనగా నేడు ధర్నా
తాళ్లపూడి(కె.గంగవరం) : వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు విచారణకు వస్తున్న సమయంలో రెండు రోజుల ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను నిరసిస్తూ రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆయన, పార్టీ నాయకులు పండు గోవిందరాజు, బత్తుల అప్పారావు, జనిపెల్ల సాయి, చిల్లే నాగేశ్వరరావు, సాదే నారాయణమూర్తి ఆదివారం తాళ్లపూడిలో విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లుగా స్టేలతో నడిపించుకు వస్తున్న శిరోముండనం కేసు ఎట్టకేలకు విచారణకు రాగా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తు జీవోను విడుదల చేసిందని ఆరోపించారు. ఎటువంటి కారణమూ లేకుండా పీపీని తొలగించడం ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలను సూచిస్తోందన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తు సోమవారం రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు నియోజకవర్గంలోని దళితులు, దళిత సంఘాల నేతలు తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. -
ఐటీడీఏకు పచ్చజెండా
రాష్ట్ర విభజన నేపథ్యంలో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ను మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ 17 విడుదల చేసింది. దీంతో ఇన్నాళ్లూ కర్నూలు ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా ఇకపై ప్రత్యేక ఐటీడీఏగా ఆవిర్భవించనుంది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు మహబూబ్‌నగర్ ఐటీడీఏలో అంతర్భాగం కానున్నాయి. సంస్థకు పూర్తి స్వరూపం ఏర్పడితే తప్ప స్థానిక చెంచులు సమగ్రాభివృద్ధి సాధించే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మన్ననూరు కేంద్రంగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలతో కూడిన నూతన ఐటీడీఏను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీఓ 17 విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలో లంబాడాలు, ఎరుకలులు, ఇతర గిరిజనులకు సంబంధించి మాడా (మాడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్) మాత్రమే పనిచేస్తోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో 12,982 మంది చెంచులుండటంతో నూతన ఐటీడీఏ మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. పీటీజీ (అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాలు) ప్రాజెక్టు అధికారి నూతన ఐటీడీఏకు ఎక్స్అఫీషియో పీఓగా వ్యవహరిస్తారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గిరిజన సంక్షేమాధికారులు ఎక్స్ అఫీషియో ఏపీఓలుగా వ్యవహరిస్తారు. అయితే జిల్లాలో మాడా, పీటీజీకి పీఓ లేకపోవడంతో సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరక్టర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐటీడీఏకు కూడా సోషల్ వెల్ఫేర్ డీడీ ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. నల్లగొండ జిల్లాలోనూ గిరిజన సంక్షేమ శాఖకు పూర్తిస్థాయి అధికారి లేకపోవడం గమనార్హం. సిబ్బంది బదిలీపై రావాల్సిందే! కొత్తగా ఏర్పాటయ్యే ఐటీడీఏ పరిధిలోకి జిల్లాలో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు 11 పీహెచ్‌సీలు, 46 ఆరోగ్య ఉప కేంద్రాలు, 44 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, 11 ఆశ్రమ పాఠశాలలు చేరనున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన విభాగం మాడాకు బదిలీ కాగా, తాజా ఉత్తర్వులతో ఈ విభాగం ఐటీడీఏ అంతర్భాగం కానున్నది. అయితే నూతన ఐటీడీఏ ఏర్పడినా కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది నియామక ప్రక్రియ కొలిక్కి వచ్చేందుకు మరికొంత సమయం పట్టనుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయముండగా, నూతన ఐటీడీఏ కార్యాలయాన్ని మన్ననూరు మాడా ప్రాజెక్టు అధికారి కార్యాలయం లేదా క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సున్నిపెంట ఐటీడీఏ నుంచి సిబ్బందిని బదిలీ చేయాలంటూ త్వరలో లేఖ రాస్తామని మాడా ఇన్చార్జి పీఓ ‘సాక్షి’కి వెల్లడించారు. తొలి సమావేశంలోనే కోరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీడీఏ మొదటి జనరల్ బాడీ సమావేశంలోనే మన్ననూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరాం. చెంచు జనాభాలో 70శాతం మంది ఈ జిల్లాలోనే ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చెంచుల తలరాత మారుతుందని ఆశిస్తున్నాం. - శంకరయ్య, ఐటీడీఏ గవర్నింగ్ బాడీ మెంబర్ నేటికీ అభివృద్ధికి దూరంగా.. 25 ఏళ్ల క్రితం చెంచుల కోసం ఐటీడీఏ ఏర్పాటు చేసినా ఎక్కడో దూరంగా పొరుగు జిల్లాలో ఉండటంతో పెద్దగా ఉపయోగపడింది లేదు. అభివృద్ధికి దూరంగా చెంచులు నేటికీ జీవనం వెళ్లదీస్తున్నారు. మన్ననూరు ఐటీడీఓతో అభివృద్ధి చెందుతామనే ఆశ కనిపిస్తోంది. - శ్రీనివాసులు, చెంచు సేవా సంఘం