Government liquor policy
-
వైన్ నిల్వలు వదిలించుకొనేందుకు రూ. 1,700 కోట్లు
పారిస్: ప్రభుత్వ ఖజానాలో కాసులు గలగలలాడడానికి ఎవరైనా మద్యం అమ్మకాలు పెంచుతారు. కానీ ఫ్రాన్స్ మద్యానికి డిమాండ్ లేకపోవడంతో ఆ నిల్వలను వదిలించుకోవడానికి దాదాపు రూ.1,700 కోట్లు (20 కోట్ల యూరోలు) ఖర్చు చేయాలని నిర్ణయించింది. కోవిడ్ సంక్షోభం, ఆ వెంటనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాలన్నీ ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు వైన్ వంటి వాటికి ఖర్చు చెయ్యడం బాగా తగ్గించేశారు. తక్కువ ధరకు లభించే బీర్‌కు అలవాటు పడిపోయారు. దీనికి వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఫ్రాన్స్ సహా యూరప్ దేశాల్లో ఇటీవల కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కబోత భరించలేని ప్రజలు వైన్ బదులుగా బీర్ ఎక్కువగా తాగుతున్నారు. చాలా మంది ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా జనరేషన్ జెడ్(1996 నుంచి 2010 మధ్య పుట్టినవారు) మద్యం తాగడానికి ఇష్టపడడం లేదు. ఫలితంగా వైన్‌కి డిమాండ్ పడిపోయింది. మరోవైపు వైన్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బోర్డాక్స్ ప్రాంతంలో వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీంతో ప్రభుత్వమే ఆ వైన్‌ను కొనుగోలు చేసేందుకు 20 కోట్ల యూరోలు కేటాయించింది. అదనంగా ఉన్న వైన్‌ను కొనుగోలు చేసి దానిలోని ఆల్కాహాల్‌ను శానిటైజర్లు, శుభ్రతా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి తయారీలో వినియోగించనుంది. ఇలా చేయడం ద్వారా మళ్లీ వైన్‌కు డిమాండ్ పెరుగుతుందనే ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైన్ వినియోగం యూరప్ దేశాలైన ఇటలీలో ఏడు శాతం, స్పెయిన్‌లో 10 శాతం, ఫ్రాన్స్‌లో 15 శాతం, జర్మనీలో 22 శాతం, పోర్చుగల్‌లో 34 శాతం మేర తగ్గిపోయింది. -
అదో పెద్ద బూతు పాలసీ
ప్రభుత్వ మద్యం పాలసీపై బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు ధ్వజం సాక్షి, అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం పాలసీ పెద్ద బూతు పాలసీ, ప్రజాకంటక పాలసీ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. ఈ విధానం ఏ ఒక్కరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్టుషాపులను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం దారుణమని, బెల్టుషాపులు తొలగిస్తామని సీఎం చెబుతున్నాడంటే ఇప్పటికి ఉన్నట్టే కదా? అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు, ప్రభుత్వ స్కూళ్లకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండకూడదు, అదే ప్రైవేటు గుళ్లు, ప్రైవేటు స్కూళ్ల దగ్గర అయితే మద్యం షాపులు పెట్టుకోవచ్చా? అంటే ఆ స్కూళ్లకు, ఆ గుళ్లకు వెళ్లే వాళ్లు మనుషులు కాదా? అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్యలోనే షాపులుండటం వల్ల తాగుబోతులతో మహిళలు నానా మాటలు పడాల్సి వస్తోందని, చిన్నారులు కూడా జుగుప్సాకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అంతగా మద్యం తాగించాలనుకుంటే ఏ సూపర్ మార్కెట్లలాగానో ఊరిబయట ఓ కాంప్లెక్సు కట్టించుకుని అక్కడ అమ్ముకోవాలిగానీ, ఇళ్ల మధ్యలో, గుళ్ల మధ్యలో మద్యం అమ్ముతూ మహిళల మాన ప్రాణ రక్షణకు విలువ లేకుండా చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.