govt actions
-
టెలికం స్పెక్ట్రమ్ వేలం
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ సేవల కోసం ఉద్దేశించిన ఎనిమిది బ్యాండ్లలో స్పెక్ట్రమ్ వేలాన్ని బేస్ ధర రూ.96,318 కోట్లపై నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 800, 900, 1800, 2100, 2300, 2500, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయనుంది. దివాలా పరిష్కార చర్యల పరిధిలోకి వచి్చన కంపెనీలకు సంబంధించి స్పెక్ట్రమ్ ఈ ఏడాదితో గడువు తీరిపోనుండగా, దీన్నీ వేలం వేస్తుంది. -
ఆరునెలల గరిష్ఠానికి చేరిన ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల ఖర్చు
సెంట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో ఆరునెలల గరిష్ఠాన్ని తాకినట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం..సెప్టెంబర్‌లో ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లపై చేసే ఖర్చులు ఆరు నెలల గరిష్టానికి పెరిగాయి. సెంట్రల్ ప్రాజెక్ట్‌ల అంచనా వ్యయం సెప్టెంబర్‌లో అసలు వ్యయం కంటే 21.92% ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఇది 19.08%గా ఉంది. దాంతో కేంద్రం అదనంగా రూ.4.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఫలితంగా ఇన్ఫ్రా ప్రాజెక్టులకు చేసే వ్యయం మొత్తం రూ.24.8 లక్షల కోట్లుగా ఉండనుంది. అయితే అవి పూర్తయ్యే సమయం కూడా అంతకు ముందు అంచనా వేసిన 36.96 నెలల నుంచి 38.63 నెలలకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆగస్టుతో పోలిస్తే ఆలస్యమవుతున్న ప్రాజెక్టుల సంఖ్య సెప్టెంబర్‌లో 830 నుంచి 823కు తగ్గాయి. కానీ అందులో 58శాతం రెండేళ్లుగా ఆలస్యమవుతున్న వాటి జాబితాలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో 46 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు నివేదికలో తెలిపారు. -
అక్రమాలకు పాల్పడిన వైద్యాధికారులపై చర్యలు
విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొనుగోళ్లు, పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వైద్యాధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, అసిస్టెంట్ డెరైక్టర్(ఇన్చార్జి) రాజేంద్రప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంవో ఎం.సావిత్రమ్మ, థియేటర్ స్టాఫ్ నర్సులు ముగ్గురు, ఇద్దరుఫార్మసిస్టులకి సోమవారం మెమోలు జారీ చేసింది. గత ఏడాది జూలైలో ప్రభుత్వ ఆస్పత్రిలో అవకతవకలపై ఫిర్యాదులందుకున్న ఏసీబీ తనిఖీలు చేపట్టి, విచారణ జరిపింది. దానిపై నివేదిక అందుకున్న ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది.