విజయవాడ: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మందుల కొనుగోళ్లు, పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వైద్యాధికారులు, సిబ్బందిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, అసిస్టెంట్ డెరైక్టర్(ఇన్‌చార్జి) రాజేంద్రప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో ఎం.సావిత్రమ్మ, థియేటర్ స్టాఫ్ నర్సులు ముగ్గురు, ఇద్దరుఫార్మసిస్టులకి సోమవారం మెమోలు జారీ చేసింది.
గత ఏడాది జూలైలో ప్రభుత్వ ఆస్పత్రిలో అవకతవకలపై ఫిర్యాదులందుకున్న ఏసీబీ తనిఖీలు చేపట్టి, విచారణ జరిపింది. దానిపై నివేదిక అందుకున్న ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది.