gowri sankar
-
బీసీలకు దామాషా ప్రకారం.. పదవులు దక్కాలి!
‘‘అణగారిన జనం సకాలంలో పురోగమించకపోతే కులం అనే విసుర్రాయి కిందపడి నలిగిపోతారని నేను భయపడుతున్నాను. అణగారిన కులాలను బలపరచట మంటే కుల విద్వేషాలను ప్రోత్సహించినట్లు కాదు. మనుషుల్ని వారి పుట్టుకను బట్టి హీనులుగా పరిగణించే పద్ధతి మనలో అంతరించిపోయిన రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు అవుతుంది’’ అన్న ఛత్రపతి సాహూ మహరాజ్... బలహీనవర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ 1902 జులై 26న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు భారత సామాజిక ఉద్యమాల చరిత్రలో బడుగులు మరిచి పోలేని రోజు..వందేళ్ళ క్రితమే సాహూ మహరాజ్ కొల్హాపూర్ సంస్థానంలో దళితులను గ్రామాల్లో పట్వారీలుగా నియమించారు. కానీ స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్ళ తర్వాత కూడా బీసీ కులాల గణన చేసి జనాభా దామాషా ప్రకారం చట్ట సభల సీట్లు కేటాయించమని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజంలో సగానికి పైగా ఉన్న బీసీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారంటే దేశంలో ఆధిపత్య వర్గాలు నేటికినీ పల్లెలను ఎంతగా తమ చేతుల్లో పెట్టుకుని అధికారాల్ని చలాయిస్తున్నారో అవగతమవుతుంది. కులగణన ఎన్నికల వాగ్దానంగా మిగిలిపోయిందంటే పాలకులు ఇప్పటి దాకా ఎంత నిర్లక్ష్యంగా పాలిస్తూ వస్తున్నారో తెలుస్తుంది.బడుగులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడ దని తెలిసి కూడా దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. ‘బీసీ సబ్ ప్లాన్’ను పెట్టాలనీ, దానికి అత్యధిక నిధులివ్వాలనీ బీసీలు వూరేగింపులు చేస్తున్నారంటే ఇంతకంటే దేశానికి దరిద్రం మరేముంటుంది! కులగణనను కాంగ్రెస్ తాత్సారం చేస్తుంటే, బీజేపీ కులగణన చేయనని చెబుతోంది. దేశంలో సగానికి పైగా ఉన్న బీసీల హక్కుల కోసం చట్టసభలు మాట్లాడకుండా దాటవేస్తూ రావటం ప్రజాస్వామ్యాన్ని హననం చేసినట్లుగానే భావించాలి. సగం దేశంగా ఉన్న బీసీ కులాల జీవన విధానం ఎట్లా ఉందో తెలుసుకోకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో ఎట్లా నడిపిస్తారో మన సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య పాలకులే చెప్పాలి.దేశాన్ని మొత్తం ఆవరించి ఉన్న బీసీ ఉత్పత్తి కులాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో కీలక స్థానాలలోకి, నాయకత్వ దశకు రాకుండా దేశం అభివృద్ధి చెందదు. ఆధిపత్య కులాల పెట్టుబడి దారుల చేతుల్లో అధికార పగ్గాలు ఉన్నంత కాలం బీసీలు దుర్భరమైన పరిస్థితుల్లోనే మగ్గిపోక తప్పదు. దేశం అన్ని రంగాల్లోకి దూసుకు పోవాలంటే దేశాన్ని ప్రభావితం చేయగల బీసీలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలి. ఉత్పత్తి కులాల చేతులు పడకుండా దేశం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.మనం చైనా దేశ జనాభాను దాటి ముందుకొచ్చాం. ఉత్పత్తి శక్తుల చేతుల్లోకి దేశ ప్రగతి రథచక్రాలు వచ్చినప్పుడే చైనా ప్రగతిని మించి ముందుకు సాగుతాం. నేటికినీ బడుగు వర్గాలకు, ఉత్పత్తి కులాలకు పాలించే లక్షణాలు లేవని మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసినట్లే అవుతుంది. ఉత్పత్తి కులాలు ఉత్పత్తి శక్తులై పారిశ్రామికవేత్తలుగా తయారైనప్పుడే దేశం అన్ని రంగాల్లో అసలు సిసలు ప్రగతిని సాధిస్తుంది. దేశాన్నీ, రాష్ట్రాన్నీ పాలించే పాలకులు సాహూ మహరాజ్ లాగా ఆలోచించాలి. ఆధిపత్య వర్గాల నాయకులు తమ హ్రస్వదృష్టిని విడిచిపెట్టి బడుగుల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి. తమ కులం గొప్పదని, బడుగుల కులాలు తక్కువన్న దుర్మార్గపు ఆలోచన నుంచి ఆధిపత్య కులాలు బైట పడాలి.బడుగుల బాగే దేశం బాగు అని ఆలోచించగలిగినవారే సాహూ మహారాజులు కాగలుగుతారు. సమ రాజ్యాన్ని నిర్మించగలుగుతారు. బహుజన హితం కోరి దేశం అభివృద్ధిని కాంక్షించి బడుగులకు పల్లెనుంచి పార్లమెంటు దాకా వాళ్ళ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. స్థానిక సంస్థల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ వాళ్ళ జనాభా ఎంతో అంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కుల గణన చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల కుల గణన చేసినాకే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి పోవాలన్నది బీసీల సామూహిక డిమాండ్. తమ వాటా స్థానాలను కోల్పోయిన బీసీలు తమ హక్కుల సాధనకు వారే గొంతెత్తి గర్జించాలి.– జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు (బలహీన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ సాహు మహారాజ్ ఉత్తర్వులు జారీ చేసిన రోజు... జూలై 26) -
ఇది బాల రచయితల ఒడి!
తెలంగాణ సాహిత్య అకాడమీ మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాహిత్యాన్ని యూనివర్సిటీ లైబ్రరీల నుండీ, అకాడమీ ప్రాంగణాల నుండీ పల్లె బాట పట్టించనున్నది. బహుజన వాడల నుండి గిరిజన గూడేలదాకా పరుగు పెట్టించ నుంది. అందులో భాగంగా అకాడమీ మరో ముఖ్యమైన మైలురాయిని ఈరోజు (మార్చ్ 4) దాటుతోంది. తెలంగాణలోని ప్రతి బడిలోని పిల్లలూ ‘మన ఊరు–మన చెట్టు’ వస్తువుగా కథలు రాయనున్నారు. తమ మాతృభాషలో తమ సృజన శక్తులకు మెరుగు పెట్టుకోను న్నారు. ఈ కథల యజ్ఞానికి వెన్నుదన్నుగా ఉన్నది తెలంగాణ సాహిత్య అకాడమీ. పిల్లలు రాసిన కథల నుండి ఉత్తమమైన 1000 కథలతో ఒక బృహత్ సంకలనం తీసుకు రానున్నది అకాడమీ. కథా రచన ద్వారా పిల్ల ల్లోని సృజనకి పదును పెట్టి వాళ్ళలోని క్రియే టివ్ స్కిల్స్‌కి ఒక చోదక శక్తిలా నిలుస్తున్నది. కేసీఆర్ దార్శనికతతో నిర్మితమవుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న పురో భివృద్ధిలో భాగంగా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత, కొత్త తరాలకు వారధిగా తెలంగాణ మట్టి పునాదులతో సాహిత్య రంగం ముందుకు సాగాలని కేసీఆర్ సాహిత్య అకాడమీని పునరుద్ధరించారు. ఆయన ఆదేశాలతో సాహిత్య అకాడమీ తన పనిని విస్తృతం చేసుకొని ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సాహిత్య అకాడమీ తొలి సారిగా 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ‘మన ఊరు – మన చెట్లు’ అన్న అంశంపై కథలు రాయించే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసు కున్న శ్రద్ధ కూడా తోడైంది. దీంతో పాఠశాల విద్యాశాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త భాగ స్వామ్యంలో విస్తృత స్థాయిలో తెలంగాణలో బాల రచయితలందరూ కలాలు పడుతున్నారు. పిల్లల్లో తమ ఊరుపై ఉన్న అవగాహనను బయటకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. తన ఊరు, తాను నివసించే ప్రాంతంలోని చెరువు, చెట్లు, అందాలు, మత సామరస్యం, పండుగలు, ఆనందాలు, ఉత్స వాలు, ఉత్సాహాలు అన్నీ పిల్లలు మర్చిపోలే నివి. అదే పట్నంలోనైతే తన బస్తీ, తాను జీవించే ప్రదేశంలో నేటివిటీ వారిలో చెదిరి పోనిదే. పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో సొంత ఊరు లేదా పట్టణం... అందులో చెట్ల ప్రాము ఖ్యంపై ఉన్న అవగాహనను సృజనాత్మకంగా వెలికితీయడానికి వారి దగ్గరకే వెళ్లి, తరగతి గదినే కార్యశాలను చేసుకుంది సాహిత్య అకా డమీ. ఆ కథల బడిలో మంత్రి సబితతోపాటూ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్ పాల్గొంటున్నారు. సర్వశిక్షా అభియాన్ పర్య వేక్షణలో సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమానికి రూపురేఖలు దిద్దింది. ఈ కథల బడిలో పాల్గొనే విద్యార్థులు వారి వారి మాతృభాషల్లోనే కథలు రాస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూల నుంచి ఏ భాషలోనైనా రాయవచ్చును. ఆదివాసీ తెగలకు చెందిన పిల్లలు తాము మాట్లాడే భాషలకు లిపి లేనం దున వారి మాతృభాషలోనే తెలుగు లిపిలో రాయవచ్చును. మాతృభాషకు లిపిలేక పోయినా ఆ పిల్లలు అద్భుతమైన ఆవిష్క రణలు చేయగలరు. అందుకే మాతృభాషలో రచన చేసేందుకు అవకాశం ఇచ్చాము. వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్ ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
భర్తని చంపించిన కేసులో సంచలన నిజాలు
-
హత్యకేసులో ఫేస్బుక్ ప్రేమికుడు అరెస్ట్
సాక్షి, విజయనగరం టౌన్: ఇటీవల విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలో భర్త గౌరీశంకర్‌ను హతమార్చిన భార్య సరస్వతి ఫేస్బుక్ లవర్ మడ్డు శివను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్తున్న శివను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. పెళ్లైన తొమ్మిది రోజులకే భర్తను మట్టుబెట్టిన కేసులో భార్య సరస్వతితో పాటు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గౌరీశంకర్ హత్య జరిగిన నాటి నుంచి మడ్డు శివ పరారీలో ఉన్నాడు. అతడి కోసం అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు రాష్ట్రం దాటి వెళ్తుండగా పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు. -
నీకేమి అపకారం చేశాం...
సాక్షి, విజయనగరం టౌన్ / వీరఘట్టం: విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన నవ వరుడి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. గరుగుబిల్లి మండలం ఐడీడీఏ పార్కు వద్ద సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న కొత్తగా పెళ్లయిన జంటపై ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అందులో భర్తను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్యచేసిన విషయం విధితమే. అయితే ఇది నగల కోసం దొంగలు చేసిన పని కాదని, ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసిందని జిల్లా ఎస్పీ జి.పాలరాజు మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులను పట్టుకునేందుకు రంగలోకి దిగిన పోలీసులు నలుమూలల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పెదమానాపురం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో మెరుగు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజు, ఆటోడ్రైవర్ దేవరాపల్లి కిశోర్ నిజాన్ని అంగీకరించారు. సరస్వతి ఫేస్బుక్లో పరిచయమైన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో మేనమామ అయిన గౌరీశంకరరావుతో ఇష్టం లేని పెళ్లి జరగడంతో భర్తను హతమార్చి ప్రియుడికి చేరుక కావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం శివ ద్వారా సరస్వతి విశాఖపట్నానికి చెందిన గోపీని కలిసి భర్తను హత్య చేస్తే బంగారం ఇస్తానని తెలిపింది. ముందుగా రూ.8వేలు నగదు, బంగారు ఉంగరం ఇచ్చింది. శివ మరో రూ.10వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు. పథకం ప్రకారం వారు ఆటోలో కాపుకాసి ఉన్న ప్రదేశానికి రాగానే భర్తతో బైక్‌పై వెళ్తున్న సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు వెళతానని బైక్ దిగి పక్కకు వెళ్లింది. వెంటనే దుండగులు గౌరీశంకర్‌పై ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో నిందితులు ఉపయోగించిన ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నారు. నిశ్చేష్టులైన అత్తమామలు తమ కుమారుడిని కోడలే హత్య చేయించందన్న విషయం తెలియడంతో మృతుని తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కట్టుకున్నవాడిని కడతేర్చడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ సరస్వతిపై మండిపడ్డారు. మంగళవారం స్వగ్రామం చిట్టపుడివలసకు వచ్చిన గౌరీశంకర్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు భోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కాని ఇలా భర్తనే పాశవికంగా మట్టుపెట్టడానికి చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నతనం నుంచీ తాత గారి ఇంటి వద్దే ఉండి చదువుకుంటూ, అన్ని అవసరాలకూ బావ (భర్త గౌరీ శంకర్) ఇచ్చే డబ్బులతోనే జల్సాలు చేసిన సరస్వతి చివరకు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. -
సుపారీ ఇచ్చి.. భర్త ప్రాణం తీసిన భార్య..
సాక్షి, విజయనగరం : పార్వతీపురం హత్య కేసులో సంచలనం నిజం వెల్లడైంది. ఇష్టంలేని పెళ్లితో రగిలిపోయిన భార్య సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. సోమవారం ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ITDA పార్క్ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక కథనం.. నవ జంటపై దాడి.. భర్త మృతి -
పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
వైరామవరం( తూర్పుగోదావరి): పిల్లలకు విషమిచ్చి ఓ తండ్రి తానూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మఠంభీమవరంలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగినా ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు. గ్రామానికి చెందిన గౌరీశంకర్(45), దేవకుమారి భార్యాభర్తలు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య దేవకుమారి అలిగి అదే ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది. ఏమైందో ఏమో కానీ తండ్రి గౌరీ శంకర్ తన ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తానూ తాగాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రసాద్(7), సాయి(5), రెండేళ్ల కుమార్తె చనిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.