పిల్లలకు విషమిచ్చి ఓ తండ్రి తానూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వైరామవరం( తూర్పుగోదావరి): పిల్లలకు విషమిచ్చి ఓ తండ్రి తానూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మఠంభీమవరంలో మంగళవారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి జరిగినా ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు. గ్రామానికి చెందిన గౌరీశంకర్(45), దేవకుమారి భార్యాభర్తలు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో భార్య దేవకుమారి అలిగి అదే ఊర్లో ఉన్న పుట్టింటికి వెళ్లిపోయింది.
ఏమైందో ఏమో కానీ తండ్రి గౌరీ శంకర్ తన ముగ్గురు పిల్లలకి విషమిచ్చి తానూ తాగాడు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రసాద్(7), సాయి(5), రెండేళ్ల కుమార్తె చనిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.