
తెలంగాణ సాహిత్య అకాడమీ మరొక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాహిత్యాన్ని యూనివర్సిటీ లైబ్రరీల నుండీ, అకాడమీ ప్రాంగణాల నుండీ పల్లె బాట పట్టించనున్నది. బహుజన వాడల నుండి గిరిజన గూడేలదాకా పరుగు పెట్టించ నుంది. అందులో భాగంగా అకాడమీ మరో ముఖ్యమైన మైలురాయిని ఈరోజు (మార్చ్ 4) దాటుతోంది. తెలంగాణలోని ప్రతి బడిలోని పిల్లలూ ‘మన ఊరు–మన చెట్టు’ వస్తువుగా కథలు రాయనున్నారు. తమ మాతృభాషలో తమ సృజన శక్తులకు మెరుగు పెట్టుకోను న్నారు. ఈ కథల యజ్ఞానికి వెన్నుదన్నుగా ఉన్నది తెలంగాణ సాహిత్య అకాడమీ.
పిల్లలు రాసిన కథల నుండి ఉత్తమమైన 1000 కథలతో ఒక బృహత్ సంకలనం తీసుకు రానున్నది అకాడమీ. కథా రచన ద్వారా పిల్ల ల్లోని సృజనకి పదును పెట్టి వాళ్ళలోని క్రియే టివ్ స్కిల్స్‌కి ఒక చోదక శక్తిలా నిలుస్తున్నది.
కేసీఆర్ దార్శనికతతో నిర్మితమవుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో జరుగుతున్న పురో భివృద్ధిలో భాగంగా సాహిత్య, సాంస్కృతిక రంగాలలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. పాత, కొత్త తరాలకు వారధిగా తెలంగాణ మట్టి పునాదులతో సాహిత్య రంగం ముందుకు సాగాలని కేసీఆర్ సాహిత్య అకాడమీని పునరుద్ధరించారు. ఆయన ఆదేశాలతో సాహిత్య అకాడమీ తన పనిని విస్తృతం చేసుకొని ముందుకు సాగుతోంది. అందులో భాగంగానే సాహిత్య అకాడమీ తొలి సారిగా 6, 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో ‘మన ఊరు – మన చెట్లు’ అన్న అంశంపై కథలు రాయించే కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీసు కున్న శ్రద్ధ కూడా తోడైంది. దీంతో పాఠశాల విద్యాశాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త భాగ స్వామ్యంలో విస్తృత స్థాయిలో తెలంగాణలో బాల రచయితలందరూ కలాలు పడుతున్నారు.
పిల్లల్లో తమ ఊరుపై ఉన్న అవగాహనను బయటకు తీసుకు వచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. తన ఊరు, తాను నివసించే ప్రాంతంలోని చెరువు, చెట్లు, అందాలు, మత సామరస్యం, పండుగలు, ఆనందాలు, ఉత్స వాలు, ఉత్సాహాలు అన్నీ పిల్లలు మర్చిపోలే నివి. అదే పట్నంలోనైతే తన బస్తీ, తాను జీవించే ప్రదేశంలో నేటివిటీ వారిలో చెదిరి పోనిదే. పాఠశాలల్లో చదువుకునే పిల్లల్లో సొంత ఊరు లేదా పట్టణం... అందులో చెట్ల ప్రాము ఖ్యంపై ఉన్న అవగాహనను సృజనాత్మకంగా వెలికితీయడానికి వారి దగ్గరకే వెళ్లి, తరగతి గదినే కార్యశాలను చేసుకుంది సాహిత్య అకా డమీ. ఆ కథల బడిలో మంత్రి సబితతోపాటూ విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్ పాల్గొంటున్నారు. సర్వశిక్షా అభియాన్ పర్య వేక్షణలో సాహిత్య అకాడమీ ఈ కార్యక్రమానికి రూపురేఖలు దిద్దింది.
ఈ కథల బడిలో పాల్గొనే విద్యార్థులు వారి వారి మాతృభాషల్లోనే కథలు రాస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూల నుంచి ఏ భాషలోనైనా రాయవచ్చును. ఆదివాసీ తెగలకు చెందిన పిల్లలు తాము మాట్లాడే భాషలకు లిపి లేనం దున వారి మాతృభాషలోనే తెలుగు లిపిలో రాయవచ్చును. మాతృభాషకు లిపిలేక పోయినా ఆ పిల్లలు అద్భుతమైన ఆవిష్క రణలు చేయగలరు. అందుకే మాతృభాషలో రచన చేసేందుకు అవకాశం ఇచ్చాము.
వ్యాసకర్త: జూలూరు గౌరీశంకర్
ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
Comments
Please login to add a commentAdd a comment