GPA marks
-
చదువుల తల్లికి కష్టమొచ్చింది!
లక్షల్లో ఫీజులుకట్టి చదివించినా అందరు పిల్లలు మంచి ఫలితాలను సాధించరు. కానీ కొందరు మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా అద్భుత ఫలితాలను తమ సొంతం చేసుకుంటారు. అలాంటి కోవకు చెందిందే యమున. మొన్నటి డిగ్రీ ఫలితాల్లో 9.91 జీపీఏతో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. తల్లిదండ్రులు మృతిచెందారు. ముగ్గురు ఆడబిడ్డలే. ఓ సోదరికి వివాహమై భర్తతో ఉంది. మరో సోదరి కష్టంతో ఇప్పటిదాకా చదివింది యమున. అయితే ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు శాపంగా మారాయి. పలమనేరు: రామకుప్పం మండలం కవ్వంపల్లెకు చెందిన యమున పాఠశాల స్థాయి నుంచే బాగా చదువుతోంది. వీకోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ చదివి 920 మార్కులు సాధించింది. దీంతో వీకోటకు చెందిన నలంద డిగ్రీ కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థికి కళాశాల ఫీజు లేకుండానే అడ్మిషన్ ఇచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్‌లో 9.91 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్స్ జాబితాలో చోటుదక్కించుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనే లక్ష్యం శిరీష ఎంసీఏ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనే లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కుటుంబ పరిస్థితులు, పేదరికం అవరోధంగా మారాయి. దీంతో ఇంటికే పరిమితమైంది. ఎంసీఏ చదివించేందుకు ఎవరైనా దాతలు స్పందిస్తే తన కలని సాకారం చేసుకుంటానంటోంది. ఉన్నత చదువులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు యమున తండ్రి జయరామిరెడ్డి తొమ్మిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయినా ఆయన భార్య నాగరత్నమ్మ ముగ్గురు ఆడపిల్లలను కూలినాలి చేసి పోషించింది. వీరికి రెండెకరాల మెట్టపొలం మినహా మరే ఆధారం లేదు. పెద్దకుమార్తెకు ఇన్ని కష్టాల నడుమే వివాహం చేసింది.. రెండో కుమార్తె శిరీష డిగ్రీదాకా చదివి ఆపై ఆర్థిక సమస్యలతో చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. 9నెలల క్రితం తల్లి నాగరత్నమ్మ సైతం అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో ఇంట్లో ఇరువురు ఆడపిల్లలు మాత్రం మిగిలారు. తన లక్ష్యాన్ని చెల్లెలు ద్వారా సాకారం చేసుకోవాలన్న సోదరి శిరీష పక్కనే ఉన్న చిన్నబల్దారు హైస్కూల్లో విద్యావలంటీర్‌గా పనిచేస్తూ కుటుంబానికి దిక్కుగా మారింది. అయితే అక్కడ వీవీలకిచ్చే వేతనం చాలక, అదీనూ నెలనెలా సక్రమంగా రాక ఇబ్బందులు తప్పలేదు. ఈ నేపథ్యంలో యమున ఉన్నత చదువులకు ఆర్థిక సమస్య వెంటాడుతోంది. -
10/10 జీపీఏ లక్ష్యం: కడియం
సాక్షి, హైదరాబాద్: మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో వంద శాతం ఫలితాలను సాధించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. విద్యార్థులందరూ 10/10 జీపీఏ సాధించేవిధంగా కృషి చేయాలని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు. గురువారం జరిగిన గురుకులాలు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్ల వార్షిక సమావేశంలో కడియం మాట్లాడారు. గురుకులాల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులు నీట్, జేఈఈలో అధిక ర్యాంకులను సాధించేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గురుకులాలు, మోడల్ స్కూళ్లు హరిత వనాలుగా ఉండాలని, వచ్చే ఏడాది నుంచి బెస్ట్ హరిత స్కూల్ ప్రైజ్ ఇస్తామన్నారు. త్వరలోనే మోడల్ స్కూల్ టీచర్ల సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారం అవుతుందని, ఇప్పటికే వారిని సీపీఎస్ పరిధిలోకి తెచ్చామని కడియం తెలిపారు. రాష్ట్రంలోని 90 శాతం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకుని ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి కొత్తగా 544 గురుకులాలు ప్రారంభించారని చెప్పారు. ఈ ఏడాది ఆరు గురుకుల స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామని, వచ్చే ఏడాది మిగిలిన 29 గురుకులాలను కూడా జూనియర్ కాలేజీలుగా మారుస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాకు రెండు చొప్పున గురుకులాలు ఉంటాయని, కొత్తగా 35 సాధారణ గురుకులాలు వస్తాయన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ఎత్తివేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 218 కోట్లు వెచ్చించి వాటిని కొనసాగిస్తోందన్నారు. ప్రధాన మంత్రి బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం ఇచ్చారే కానీ విద్యా రంగంలో ఒక్క కొత్త పథకాన్ని కూడా వారి కోసం తీసుకురాలేదని అన్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, మోడల్ స్కూల్స్, గురుకులాల డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. -
‘పది’లో కాకతీయ ప్రభంజన
విద్యార్థులను సన్మానించిన ఆర్ఐఓ నిజామాబాద్‌అర్బన్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు. 10 జీపీఏ సాధించిన సీహెచ్.దినేష్, ఆర్.జిగీషతో పాటు 9.8 జీపీఏ సాధించిన ఏడుగురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్ఐవో మాట్లాడుతూ ఉత్తమఫలితాలు సాధించడంలో కాకతీయ విద్యార్థులు ముందంజలో ఉంటారని అన్నారు. 9 రాష్ట్ర స్థాయి జీపీఏ మార్కులతో 102 మంది, 8 రాష్ట్ర స్థాయి గ్రేడు మార్కులతో 300 మంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఫరీదొద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల వెలువడిన ఐఐటీ రామయ్య ఫలితాల్లో కుమారి, జగదీష్, సీహెచ్.భానుతేజ ఎంపికయ్యారన్నారు. అంతేకాకుండా ఐఐటీ మెరుున్స్‌లో 20 మంది విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు.