Granite mining
-
కప్పం కడితేనే మైనింగ్
రాష్ట్రంలోని గనులన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ‘ముఖ్య’ నేత సూచన మేరకు అధికారులు టీడీపీ నేతలకు పూర్తిగా సహకరిస్తున్నారు. పెద్దలు అడిగినంత వాటా ఇచ్చారా సరే.. లేదంటే గనులను బంద్ చేసుకోవాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ నీకింత.. నాకింత.. అని పంపకాలు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆదాయం గురించి పైనుంచి కింది దాకా పట్టించుకునే నాథుడే లేడు. సగానికి సగం గనుల ఆదాయం పడిపోయిందంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా సరే తమ ఆదాయం మాత్రం బాగుండాలనే కూటమి పెద్దల తీరుతో రాష్ట్రంలో మైనింగ్ రంగం అస్తవ్యస్థంగా తయారైంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని జిల్లాల్లోనూ గనుల తవ్వకాలు స్తంభించిపోయాయి. తమకు కప్పం కట్టిన వారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. కప్పం కట్టని గనుల యజమానులపై పది రెట్లకు పైగా జరిమానాలు విధిస్తుండడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. దీంతో మైనింగ్ ఆదాయం సగానికి సగం పడిపోయింది. మరోవైపు కూటమి నేతలు మాత్రం ఎక్కడికక్కడ గనులను స్వాధీనం చేసుకుని అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇదంతా కూటమి ముఖ్య నేత, ఆయన కుమారుడి నేతృత్వంలోనే జరుగుతుండడం గమనార్హం. ఎనిమిది నెలలుగా కూటమి నేతలు జిల్లాల వారీగా క్వార్ట్జ్, సిలికా శాండ్, గ్రానైట్, రోడ్ మెటల్, బీచ్ శాండ్, లేటరైట్, బెరైటీస్ వంటి అన్ని ఖనిజాలను తమ బినామీల పరం చేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లోనూ మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేశారు. దీనివల్ల ఇప్పటికే రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో అత్యంత డిమాండ్ ఉన్న క్వార్ట్జ్, మైకా తవ్వకాలను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన నాయకుడికి అప్పగించారు. ఆ నేత ప్రతి నెలా రూ.50 కోట్లు చొప్పున ఏటా రూ.600 కోట్లు ‘ముఖ్య’ నేతకు కప్పం కట్టాలనే ఒప్పందంతో మొత్తం క్వార్ట్జ్ మైనింగ్ అంతా ఆయన చేతిలో పెట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలోని క్వార్ట్జ్ ఆధారిత పరిశ్రమలను పరిశీలించి, అదే తరహాలో తిరుపతి జిల్లా సైదాపురంలో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ‘ముఖ్య’ నేతకు 50 శాతం వాటా ఇచ్చేందుకు చీకటి ఒప్పందం జరిగినట్లు తెలిసింది.రూ.50 వేల ఖనిజాన్ని రూ.10 వేలకివ్వాలట!ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో దాదాపు 140 ఓపెన్ కాస్ట్, 7 అండర్ గ్రౌండ్ క్వార్ట్జ్ గనులు ఉన్నాయి. వాటిలో తవ్వే ఖనిజాన్ని ఎంపీ చెప్పిన మనుషులకు.. అది కూడా వారు నిర్ణయించిన రేటుకు విక్రయిస్తేనే లీజులను కొనసాగిస్తామంటూ ప్రభుత్వ ‘ముఖ్య’ నేత స్పష్టం చేయడంతో వారు అంగీకరించలేదు. దీంతో తవ్వకాలు నిలిచిపోయి ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం తగ్గిపోయింది. అయినా సరే ప్రభుత్వ పెద్దలు తమ బినామీలకు ఖనిజాన్ని విక్రయించే వారికి మాత్రమే అనుమతులు జారీ చేస్తూ, మిగిలిన క్వారీలను నిలిపివేశారు. రూ.వేల కోట్ల ఆదాయం సమకూరే క్వార్ట్జ్ గనులను చేజిక్కించుకునేందుకు కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలతో మైనింగ్ వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కువగా చైనాకు ఎగుమతి అయ్యే ఈ ఖనిజానికి టన్నుకు కేవలం రూ.10 వేలు మాత్రమే చెల్లిస్తానని ఆ ఎంపీ చెబుతుండటంతో మైనింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే ఖనిజాన్ని చైనాలో టన్ను రూ.50 వేలకు విక్రయించుకుంటూ, తమకు మాత్రం కనీసం మైనింగ్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని రేటును ఇస్తున్నారంటూ పలువురు మైనింగ్ వ్యాపారులు వాపోతున్నారు.కోర్టు ఉత్తర్వులూ బేఖాతరురాజకీయ దురుద్దేశంతో మైనింగ్ అనుమతులు నిలిపి వేయడంపై రాష్ట్రంలోని ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్ ఇండస్ట్రీ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనను సమర్థించిన కోర్టు నెల రోజుల్లో అన్ని అనుమతులు ఉన్న క్వారీలకు రవాణా ఫారాలను జారీ చేయాలని, పోర్టర్స్‌ను అన్ బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని గత నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్య నేత సూచనలతో మైనింగ్ ఉన్నతాధికారులు కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.రెండు పోర్టుల నుంచి అక్రమంగా ఖనిజ రవాణామరోవైపు లీజులను నిలిపి వేయడంతో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్‌కు డిమాండ్ పెరగడంతో కూటమి నేతలు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే తవ్విన ఖనిజాన్ని క్వారీ నిర్వాహకులతో మాట్లాడుకుని రాత్రి సమయాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించిన క్వారీ నిర్వాహకులపై అక్రమ మైనింగ్ చేశారని పది రెట్లు జరిమానాలు విధిస్తామని బెదిరిస్తున్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టులకు నిత్యం నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి వందల సంఖ్యలో క్వార్ట్జ్, మైకా, సిలికా శాండ్ లారీలు పెద్ద ఎత్తున అక్రమ ఖనిజాన్ని చేరవేస్తున్నాయి. చీమకుర్తి తదితర ప్రాంతాల నుంచి గ్రానైట్‌ను నిబంధనలకు విరుద్ధంగా పోర్టులకు తరలిస్తున్నారు. అద్దంకి, ఒంగోలు, సంతనూతలపాడు, మార్కాపురం ఎమ్మెల్యేల కనుసన్నల్లో పని చేస్తున్న పోలీసులు, మైనింగ్ అధికారులు ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. ఇందులో ముఖ్య నేత తనయుడి పాత్ర కూడా ఉందని చెబుతున్నారు. వీటి వైపు కన్నెత్తి చూడకూడదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఆదేశాలు అందడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.నిఘా నిర్వీర్యం.. యథేచ్ఛగా అక్రమ మైనింగ్ వైఎస్ జగన్ హయాంలో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడంతో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోంది. చెక్‌పోస్ట్‌ల వద్ద అక్రమ మైనింగ్ రవాణాను అడ్డుకుంటున్న దాఖలాలే లేవు. విజిలెన్స్ బృందాలను తమ బినామీలకు ఖనిజాన్ని కారుచౌకగా ఇచ్చేందుకు నిరాకరించే వారి పని పట్టడానికే ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన క్వారీ యజమానులపై తప్పుడు కేసులు పెట్టడం, పది రెట్లు అధికంగా జరిమానాలు విధించడానికే ఈ బృందాలను వాడుకుంటున్నారు. రోడ్ మెటల్, గ్రావెల్, గ్రానైట్, బాల్ క్లే తదితర ఖనిజాల రవాణాపై ఎన్ని ఫిర్యాదులు అందినా.. ఏ మాత్రం పట్టించుకోవద్దని జిల్లాల్లోని అధికారులకు ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలిచ్చారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలే అక్రమ మైనింగ్ దందా నిర్వహిస్తున్నారు. ఈ అక్రమ సంపాదన విషయంలో పార్టీ నేతల మధ్యే విభేదాలు వచ్చి, బజారునపడి రచ్చ చేసుకుంటున్నారు. నూజివీడులో మైనింగ్ దందాపై తెలుగుదేశం పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా మంత్రి కొలుసు పార్థసారథిపై ఆరోపణలు చేశారు.వైఎస్ జగన్ హయాంలో పెరిగిన ఆదాయంవైఎస్ జగన్ హయాంలో గనుల శాఖలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేయడంతో ఆదాయం భారీగా పెరిగింది. పారదర్శక విధానాలు, లీజుల జారీలో జాప్యాన్ని నివారించడంతో పాటు ఔత్సాహికులు మైనింగ్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. గతంలో మొదట వచ్చిన వారికే మొదటి అవకాశం (ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్) విధానం ద్వారా మైనింగ్ లీజులు జారీ చేసేవారు. దీనివల్ల దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంతో లీజులున్నా, మైనింగ్ చేయకుండా జాప్యం చేసేవారు. గతంలో 4,988 లీజుల్లో 2,826కు మాత్రమే వర్కింగ్ లీజులుండేవి. ఆ విధానాన్ని రద్దు చేసి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవకాశం కల్పించడంతో అదనంగా 1,700 లీజులు వర్కింగ్‌లోకి వచ్చాయి. దీంతో మైనింగ్ ఆదాయం బాగా పెరిగింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్ని లీజులను అనధికారికంగా నిలిపి వేయడంతోపాటు మళ్లీ పాత విధానాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తుండడంతో మైనింగ్ రంగం కుదేలైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మైనింగ్ ఆదాయం రూ.1,950 కోట్లు ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం సంస్కరణల వల్ల 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఆది రూ.4,800 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3 వేల కోట్లు రావడమే గగనంగా మారింది.టెక్కలిలో కక్ష సాధింపుగా అడ్డగోలు దాడులుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అధికార పార్టీ నాయకుడి సోదరుడు గ్రానైట్ క్వారీలపై లేని పోని ఆంక్షలు విధించాడు. అది తట్టుకోలేక టెక్కలి సమీపంలో ఓ గ్రానైట్ క్వారీని మూసి వేశారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఇదే క్వారీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులతో పాటు యజమాని సైతం రోడ్డున పడ్డాడు. ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతుండడంతో క్వారీ నిర్వహణ పూర్తిగా నిలిపివేశారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు అధికారులను ఉసిగొలిపి అడ్డగోలుగా విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారు. దీంతో టెక్కలి, కోటబొమ్మాళి మండలాల్లో గ్రానైట్ క్రషర్లను నిలిపివేశారు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అది తట్టుకోలేక పలువురు క్రషర్లను నిలిపివేశారు. అయితే టీడీపీకి చెందిన కొన్ని క్రషర్లు ఎలాంటి నిబంధనలు పాటించక పోయినప్పటికీ వాటి గురించి పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం.. రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల గనుల యజమానులు, కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా కూడా వేధిస్తున్నారు. ఒకరిద్దరు కూటమి నేతల కన్నుసన్నల్లోనే అనధికారికంగా గనుల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల తీరువల్ల అందరికీ ఇబ్బందులెదురవుతున్నాయి. ఇది చాలా అన్యాయం.– ప్రవీణ్ కుమార్, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాపర్మిట్లు బ్లాక్ చేశారుమైకా గనులను దక్కించుకునేందుకు ఎనిమిది నెలలుగా కూటమి నేతలు పడారని పాట్లు పడుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని గనులకు అనుమతులను మంజూరు చేసినప్పటికీ, నేటికీ పర్మిట్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకూ మైనింగ్ పరిశ్రమ కుదేలవుతోంది. కార్మికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.– నాగార్జున, గని యజమాని, సైదాపురం, తిరుపతి జిల్లాఎంతగా సర్దుకుపోతున్నా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రచారం చేసిన వ్యక్తి క్వారీని నిలిపివేశారు. క్వారీలో ఎలాంటి అవకతవకలు లేకపోయినా ఎందుకు నిలిపివేశారని మైన్స్ అధికారులను అడిగితే దయచేసి తమను ఏమీ అడగొద్దని, పైనుంచి ఒత్తిడి ఉందని చెబుతున్నారు. దీంతో గ్రానైట్ క్వారీలకు సంబంధించిన డంపింగ్లను అధికార పార్టీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఎంతగా సర్దుకుపోతున్నా ఇక్కట్లు తప్పడం లేదు. – క్వారీ యజమానులు, ప్రకాశం జిల్లా -
కొండలు పగులగొట్టి.. కోట్లు కొల్లగొట్టి..
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్ అక్రమ తవ్వకాలపై హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తికి కరీంనగర్ వాసి డి.అరుణ్‌కుమార్ రాసిన లేఖపై హైకోర్టు సుమోటోగా విచారణ జరిపేందుకు నిర్ణయించింది. ‘కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో గ్రానైట్ క్వారీలతో పరిసర ప్రాంతాల్లో పర్యావరణం అధ్వానంగా మారింది. అక్కడి ప్రజల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. విచ్చలవిడిగా, అక్రమంగా గ్రానైట్ తవ్వకాలతో పాటు అనుబంధ పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుండటంతో పర్యావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. గ్రానైట్, స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్లతో గాలి మాత్రమే కాకుండా నీరు, ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. పరిశ్రమల నుంచి వెలువడే ధూళి కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో పచ్చదనం మాయమైంది. శ్వాస పీల్చుకోవడానికి మనుషులే కాదు.. జంతువులు సైతం ఇబ్బందిపడుతున్నాయి’ అని లేఖలో పేర్కొన్నారు.పశువులకు మేత లేదు..‘గ్రానైట్ యజమానులకు గుట్టలు బంగారు కొండల్లా మారాయి. గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరపడమే కాకుండా నిబంధనలు పాటించకుండా పర్యావరణ హననానికి పాల్పడుతున్నారు. చుట్టూ పంటలు పండక, చెట్లు సరిగ్గా పెరగక, పశువులకు మేత లేక చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. గనుల్లో భారీ బ్లాస్టింగ్లు, కాలుష్య కారకాలకు 10కి పైగా గ్రామాలు ప్రభావితమయ్యాయి. సుమారు 40 వేల మంది జీవితాలు ప్రమాదకరంగా మారాయి. దీనిపై వెంటనే చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలి’ అని పిటిషనర్ కోరారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గనులు, పరిశ్రమలు, వాణిజ్య, పర్యావరణ, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శు లతో పాటు కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి, జిల్లా కలెక్టర్, తదితరులను ప్రతివాదులుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై రేపు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. -
నాటి విజిలెన్స్ నివేదికతోనే ఈడీ సోదాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కొత్తపల్లి: గ్రానైట్ మైనింగ్‌లో అవకతవకలు, పన్నుల ఎగవేత, హవాలా తదితర ఆరోపణలపై కరీంనగర్లో రెండో రోజూ ఈడీ, ఐటీ శాఖల సోదాలు కొనసాగాయి. పట్టణ శివారులోని కొత్తపల్లిలో ఉన్న అరవింద గ్రానైట్స్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్, దక్కన్ గ్రానైట్స్, గాయత్రీ గ్రానైట్స్, సంధ్యా గ్రానైట్స్ తదితర కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఇళ్లలో అధికారులు గురువారం సైతం ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి పంచనామాలను అందజేశారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న దాడులకు ఉమ్మడి ఏపీలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికే కారణం. ఆయా గ్రానైట్ కంపెనీల అవకతవకల వల్ల ప్రభుత్వానికి మొత్తంగా రూ.124.94 కోట్ల మేర నష్టం వచ్చినట్లు ఉమ్మడి ఏపీలో విజిలెన్స్ అధికారులు తేల్చారు. ఈ మేరకు ఆయా కంపెనీలపై 5 రెట్లు పెనాల్టీ కలిపి రూ.749.66 కోట్ల మేర జరిమానా (సినరేజీ ఫీజు)ను అప్పటి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ అధికారులు విధించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆయా కంపెనీలు ఐదు రెట్ల పెనాల్టీని ఒక వంతుకు (మెమో నం.6865/ఆర్1/2016) తగ్గించుకున్నాయి. గతేడాది ఆగస్టు నాటికి రూ. 11 కోట్ల వరకు పెనాల్టీ చెల్లించాయి. ఈ ఏడాదికాలంలోనూ మిగిలిన మొత్తాన్ని చెల్లించామని కంపెనీలు చెబుతున్నాయి. షిప్పింగ్ కంపెనీల నుంచి వివరాలు..! గ్రానైట్ మైనింగ్‌లో అక్రమాలపై ఈడీ అధికారులు అన్ని మార్గాల్లోనూ వివరాలు సేకరిస్తున్నారు. కరీంనగర్లో ఉత్పత్తి అయిన గ్రానైట్‌ను ఏపీలోని కాకినాడ, కృష్ణ్ణపట్నం పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేసినట్లు గుర్తించి ‘ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’కు ఇప్పటికే లేఖ రాశారు. శ్వేత ఏజెన్సీస్, ఏఎస్ షిప్పింగ్, జేఎం బక్సీ అండ్ కంపెనీ, మైథిలీ ఆదిత్య ట్రాన్స్పోర్ట్, కేవీకే ఎనర్జీ, అరవింద్ గ్రానైట్స్, సంధ్య ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీవెంకటేశ్వర గ్రానైట్స్/వేంకటేశ్వర లాజిస్టిక్స్ కంపెనీలు.. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్ విదేశాలకు తరలించాయి? కంపెనీల వివరాలు, యజమానులు/భాగస్వాముల తదితర వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారని సమాచారం. వాటి ఆధారంగా తదుపరి దర్యాప్తు సాగనుంది. ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారు: గంగుల పచ్చని తెలంగాణపై ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఈడీ దాడులకు నిష్పక్షపాతంగా సహకరిస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్ధిపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంతంగా ముందుకు సాగుతున్న తెలంగాణపై ఢిల్లీ పాలకులకు మంట మొదలైందని, తెలంగాణను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని చెప్పారు. తెలంగాణ రాకముందు గుడ్డి దీపాలుగా ఉన్న గ్రామాలు ప్రస్తుతం వెలుగులీనుతున్నాయన్నారు. కాళేశ్వరంతో చెరువులన్నీ నింపడంతో బీడు భూములు సస్యశ్యామలంగా మారాయని, ఉచిత విద్యుత్, రైతుబంధు, గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతును రాజు చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధులయ్యారని తెలిపారు. బొగ్గు, కరెంట్‌ను తీసుకెళ్లి తెలంగాణను అంధకారం చేసేందుకు బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణపై ఎందుకీ వివక్ష ? పైసలున్న వాళ్లంతా బీజేపీకి వేళ్తే సమ్మతమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉన్నంతకాలం అంబానీ, ఆదానీలకు తెలంగాణలో చోటు లేదని స్పష్టం చేశారు. -
గ్రానైట్ గనుల లీజులకు ఈ వేలం కరెక్టే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న తరహా ఖనిజాల తవ్వకాల లీజులను వేలం ద్వారా మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త మైనింగ్ విధానాన్ని హైకోర్టు సమర్ధించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణలను గ్రానైట్ ఖనిజానికి వర్తింపజేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించి, గ్రానైట్ గనులకు వేలం నిర్వహించకుండా ఆదేశాలివ్వాలన్న ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ అభ్యర్థనను తోసిపుచ్చింది. వేలం ద్వారా లీజులు మంజూరు చేయడం వల్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని, ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందన్న సుప్రీం కోర్టు తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ నిబంధనలు, రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన చిన్న తరహా ఖనిజాల వేలం నిబంధనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్న ఫెడరేషన్ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ‘మైనింగ్ లీజు ఎలా ఇవ్వాలన్న విషయాన్ని గ్రానైట్ నిబంధనలు చెప్పడంలేదు. మొదట వచ్చిన వారికి మొదట అన్న సూత్రం ప్రకారం లీజు మంజూరు గురించి ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్ చెబుతున్నాయి. ఈ నిబంధనల ప్రకారమే గ్రానైట్ లీజు మంజూరు చేస్తూ వచ్చారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వేలం ద్వారా చిన్న తరహా ఖనిజాల లీజు మంజూరు నిబంధనలు కేంద్రం గ్రానైట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తీర్పు వెలువరించారు. వేలం ద్వారా మైనింగ్ లీజులు కేటాయించేలా ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలను ఫెడరేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇండస్ట్రీ, సాయి దుర్గా మినరల్స్ హైకోర్టులో సవాలు చేశాయి. గ్రానైట్ లీజుకు కొత్త వేలం నిబంధనలు వర్తించవని, అందువల్ల వేలం వేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కోరాయి. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు తీర్పునిచ్చారు. ‘ఏపీ మైనర్ మినరల్స్ కన్సెషన్ రూల్స్ 2022 అమల్లోకి రావడానికి ముందు మైనింగ్ లీజు కోసం పెట్టుకున్న దరఖాస్తులన్నీ చెల్లుబాటు కావన్న కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(డీ)పై పిటిషనర్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నిబంధన కేంద్రం తీసుకొచ్చిన గ్రానైట్ రూల్స్‌కు విరుద్ధమని చెబుతున్నారు. ఈ వాదన సరికాదు. కొత్త వేలం నిబంధనలు కేంద్ర ప్రభుత్వ గ్రానైట్ రూల్స్‌కు ఎంతమాత్రం విరుద్ధం కాదు. దరఖాస్తులను ఈ విధంగా చెల్లుబాటు కావని చెప్పే నిబంధన ఏదీ కేంద్ర గ్రానైట్ రూల్స్‌లో లేదు. రాష్ట్ర ప్రభుత్వ కొత్త వేలం నిబంధనల్లోని రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) ప్రకారం గ్రానైట్ క్వారీ లీజు గడువు గరిష్టంగా 20 ఏళ్లు. అదే కేంద్ర గ్రానైట్ నిబంధనల్లోని రూల్ 6 ప్రకారం లీజు గడువు 30 ఏళ్లు. అంతేకాక గ్రానైట్ రూల్స్‌లో రెన్యువల్‌కు అవకాశం ఉంది. ఆ అవకాశం కొత్త వేలం నిబంధనల్లో లేదు. ఒకే అంశానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు ఉన్నప్పుడు అందులో కేంద్ర ప్రభుత్వ నిబంధనలే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్ 12(5)(హెచ్)(9)(ఐ) గ్రానైట్ క్వారీ లీజుకు వర్తించదు. గ్రానైట్ రూల్స్ ప్రకారం లీజు మంజూరు ప్రాంతంలో గ్రానైట్ ఉన్నట్లు ప్రభుత్వం తగిన ఆధారాలు చూపాలి. ఈ నిబంధన కొత్త వేలం నిబంధనల్లో లేదు. ఈ విషయంలో ప్రభుత్వం గ్రానైట్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే బాధిత వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు’ అని జస్టిస్ రఘునందన్‌రావు తన తీర్పులో పేర్కొన్నారు. -
Madakasira: తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
మడకశిర: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దాదాపు 40 కలర్ గ్రానైట్, మెటల్ క్వారీలు ఉన్నాయి. అన్నీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండడం నిర్వాహకులకు కలిసివస్తోంది. రాత్రికి రాత్రే సులభంగా విలువైన ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తున్నారు. అగళి మండలం పీ బ్యాడిగెర క్వారీల్లో తీసిన కలర్ గ్రానైట్ దిమ్మెలకు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. దక్షిణ భారతదేశంలోనే ఈ గ్రానైట్ చాలా నాణ్యమైంది. ఈ క్వారీల నిర్వాహకులు నెలకు రూ.కోట్లల్లో విలువ చేసే కలర్ గ్రానైట్ తరలిస్తారు. ఇందులో దాదాపు 50 శాతం అక్రమంగా రవాణా అవుతోంది. ఇక.. రొళ్ల మండలం హొట్టేబెట్ట వద్ద బుడ్డప్ప అనే వ్యక్తికి ప్రభుత్వం 3.09 ఎకరాల భూమికి డీపట్టా ఇచ్చింది. ఇందులో ఇతను ఎలాంటి అనుమతి పొందకుండా క్వారీ ప్రారంభించాడు. కర్ణాటకకు చెందిన వ్యక్తికి లీజుకిచ్చి కొన్ని నెలల పాటు అక్రమంగా కలర్ గ్రానైట్ దిమ్మెలు తీసి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు వెళ్లి పనులను నిలిపివేశారు. మైనింగ్ అధికారులు మాత్రం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. మైనింగ్ చేయడానికి నిర్వాహకులు ముందుగానే గనులశాఖ నుంచి అనుమతి పొందాలి. అధికారులు క్యూబిక్ మీటర్ల ప్రకారం తవ్వకాలకు అనుమతి ఇస్తారు. హద్దులు కూడా నిర్ణయిస్తారు. ఆ ప్రకారం ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి మైనింగ్ చేసుకోవాలి. అయితే క్వారీ నిర్వాహకులు వందల క్యూబిక్ మీటర్లకు అనుమతి పొంది వేల క్యూబిక్ మీటర్లలో మైనింగ్ చేసిన సంఘటనలు ఇటీవల సీజ్ చేసిన క్వారీల్లో వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మడకశిర కలర్ గ్రానైట్ చాలా నాణ్యంగా ఉంటుంది. దీంతో దీనికి చాలా డిమాండ్. తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో మడకశిర గ్రానైట్ చాలా ప్రసిద్ధి. ఇతర దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. రూ.కోట్లలో క్వారీ నిర్వాహకులకు ఆదాయం లభిస్తుంది. దీంతో అందరి కన్ను మడకశిర గ్రానైట్‌పైనే పడుతోంది. మడకశిర ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల అమరావతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. గనులశాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక మైనింగ్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకెళ్లారు. విలువైన గ్రానైట్ సరిహద్దులు దాటుతున్నా మైనింగ్ శాఖ పత్తా లేదు. అక్రమ మైనింగ్‌పై స్థానిక పోలీసులే ఎక్కువ కేసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో మైనింగ్‌శాఖ అధికారులు పెద్దగా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో మడకశిర ప్రాంతంలోని క్వారీలపై మైనింగ్‌శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న క్వారీలను సీజ్ చేసి రూ.కోట్లలో రాయల్టీ విధించారు. ప్రస్తుతం రూ. కోట్లల్లో అక్రమ రవాణా సాగుతున్నా, అటువైపు కన్నెత్తి చూడడం లేదు. మా దృష్టికి వస్తే చర్యలు మడకశిర ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. సరిహద్దుల్లో ఉన్న క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టాం. అక్రమంగా మైనింగ్ చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్వారీల ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – బాలసుబ్రమణ్యం, ఏడీ, గనులశాఖ -
ఆ..‘గని’ మాఫియా
సాక్షి, ప్రకాశం: మార్టూరు, బల్లికురవ మండలాల కేంద్రంగా కుటీర పరిశ్రమలా నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్, వేబిల్లు వ్యాపారాలపై ఇటీవల విజిలెన్సు అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయినా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నకిలీ వేబిల్లులతో వాహనాలు వెళుతూనే ఉన్నాయి. ఇంత నిర్భీతిగా వ్యాపారం ఎలా చేస్తున్నారనే ప్రశ్నకు గ్రానైట్ రవాణా సాగిస్తున్న యువకుడు తెలిపిన సమాధానం ఇలా ఉంది.. ‘‘మైనింగ్, సేల్‌టాక్స్ అధికారులు మా జోలికి రారు. విజిలెన్సు అధికారులు మాత్రమే మాపై దాడులు నిర్వహిస్తున్నారు. 20 మంది సిబ్బంది, 3 వాహనాలున్న విజిలెన్సు అధికారులు క్వారీలను సోదా చేస్తారా ? మాపై దాడులు చేస్తారా ? జిల్లాపై దృష్టి పెడతారా ? అందుకే వారు దాడులు నిర్వహించిన రెండో పూటే యథేచ్ఛగా వ్యాపారం చేయగలుగుతున్నాం’’ అని ఆ యువకుడు చెప్పడం గమనార్హం. కొరవడుతున్న నిఘా వ్యవస్థ: అక్రమ మైనింగ్ వ్యాపారులపై ప్రధానంగా దృష్టి పెట్టవలసిన గనులశాఖ, సేల్ టాక్స్ అధికారులు గత సంవత్సర కాలంలో నమోదు చేసిన కేసులను వేళ్లపై లెక్కించవచ్చు. కానీ విజిలెన్సు శాఖ తీరు ఇందుకు భిన్నంగా ఉండడం విశేషం. గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో దాడులు నిర్వహించడం ద్వారా ఆ శాఖ వసూళ్ల లక్ష్యం రూ.2.5 కోట్లు కాగా 279 వాహనాలపై దాడులు నిర్వహించడం ద్వారా రూ.6.7 కోట్లు వసూలు చేయడం గమనార్హం. గత ఏప్రిల్‌తో మొదలైన ఈ ఆర్ధిక సంవత్సరపు వసూళ్ల లక్ష్యం కూడా 2.5 కోట్ల రూపాయలు కాగా గత ఆగస్టు 31 వ తేదీ నాటికే అంటే కేవలం 5 నెలల్లో 3 కోట్ల రూపాయలు పెనాల్టీ రూపంలో వసూలు చేసి లక్ష్యాన్ని అధిగమించడం చూస్తుంటే శాఖల మధ్య గల వ్యత్యాసం ఇట్టే అర్ధమౌతుంది. ప్రస్తుతం మార్టూరు పోలీసులు 15 రోజులుగా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్న ఓ భారీ కుంభకోణానికి సంబంధించిన కేసును సైతం నెల్లూరు జిల్లాకు చెందిన మైనింగ్ శాఖలోని విజిలెన్సు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే అనేది విశ్వసనీయ సమాచారం. ఓ ప్రబుద్ధుడు ఏకంగా 269 బోగస్ ఆన్లైన్ సంస్థలను రిజిస్ట్రేషన్ చేయించి కోట్లాది రూపాయల ప్రభుత్వాదాయానికి గండి కొట్టిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. అక్రమ వ్యాపారం సాగేదిలా... మార్టూరు కేంద్రంగా గతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు లేని నిరుద్యోగ యువత నకిలీ వేబిల్లుల వ్యాపారాన్ని నిర్వహించగా లోపభూయిష్టమైన జీఎస్టీ విధానం వలన ఫ్యాక్టరీల యజమానులు సైతం జీరో వ్యాపారానికి ఒడిగట్టడం గమనార్హం. ప్రస్తుతం నకిలీ వేబిల్లులతో తెలంగాణ వైపు వెళ్లే వాహనాలు మార్టూరు నుంచి బల్లికురవ మీదుగా సంతమాగులూరు అడ్డరోడ్డు వద్దకు చేరతాయి. అక్కడ ఓ వ్యక్తి వాహనాల బాధ్యతను తీసుకుని లారీకి రూ.11 వేల చొప్పున బేరం కుదుర్చుకుని దాచేపల్లి సమీపంలో రాష్ట్ర సరిహద్దులు దాటవేస్తున్నట్లు సమాచారం. మార్టూరు పోలీసులు ఇటీవల కొంత వరకైనా దాడులు నిర్వహిస్తున్నా బల్లికురవ, సంతమాగులూరు పోలీసులు ఎలాంటి దాడులు చేయకపోగా దీనిని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రిమినల్ కేసులకు సిద్ధమవుతున్న అధికారులు విజిలెన్సు అధికారులు గతంలో ఎన్నిసార్లు దాడులు నిర్వహించి వాహనాలను మైనింగ్‌శాఖ అధికారులకు అప్పగించినా తక్కువ పెనాల్టీతో దొడ్డిదారిన తప్పించుకుంటున్న నిందితులు తిరిగి యథేచ్ఛగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్న వైనాన్ని విజిలెన్సు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో గత వారం మార్టూరులో స్వాధీనం చేసుకున్న 8 లారీలకు సంబంధించిన డ్రైవర్లు, గ్రానైట్ ఫ్యాక్టరీల ఓనర్లతో పాటు క్వారీల యజమానులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆరు క్వారీల ఆచూకీ సైతం అధికారులు గుర్తించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా మిగిలిన శాఖలు చూసిచూడనట్లు వ్యవహరిస్తుండగా విజిలెన్సు అధికారులు మాత్రమే దాడులు నిర్వహిస్తున్న క్రమంలో ఒక నిజాయితీ గల అధికార బదిలీ కోసం క్వారీల యాజమాన్యాలు తీవ్రంగా పైరవీలు నిర్వహించడమే కాక జిల్లా స్థాయి అధికారిపై సైతం విపరీతమైన ఒత్తిడులు తీసుకు వస్తున్నట్లు సమాచారం. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో కలిసి విధులు నిర్వహిస్తే అక్రమ గ్రానైట్ వ్యాపారాన్ని నిరోధించవచ్చని ప్రజలు భావిస్తున్నారు. సమన్వయంతో వ్యవహరిస్తే అవినీతికి అడ్డుకట్ట అవినీతి రహిత పాలనతో ప్రజలకు పునరంకితమవుదాం అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని మా సిబ్బంది అహోరాత్రులు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు. మాకు తగినంత సిబ్బంది ఉండి శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరిస్తే అవినీతిని అరికట్టడం కష్టమేమీ కాదు. గత ఆగస్టు మూడవ వారం నుంచి అక్రమార్కులపై పెనాల్టీ విధానాలపై స్వస్తి చెప్పి క్రిమినల్ కేసులు çనమోదు చేస్తున్నాం. -
వచ్చారు... వెళ్లారు...
పార్వతీపురం టౌన్: పార్వతీపురం మండలం కోరి –గంగాపురం పంచాయతీ పరిధిలోని బడేదేవర కొండపై గ్రానైట్ తవ్వకాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. శాఖల మధ్య సమన్వయలోపం కారణంగా దీనిపై ప్రత్యేక జాయింట్ సర్వే చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలతో రాష్ట్రస్థాయి అధికారులు సోమవారం బడేదేవర కొండకు చేరుకున్నారు. ఈ కొండపై ప్రభుత్వం గ్రానైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు అక్రమమని ఒకవైపు వైఎస్సార్సీపీ మరోపక్క గిరిజన సంఘాలు పోరాడుతున్నాయి. దీనిపై తొలుత జిల్లా స్థాయిలో రెవెన్యూ, అటవీశాఖలు ఇచ్చిన నివేదికలు వేర్వేరుగా ఉండటం, కోరీ–గంగాపురం పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ –1లో గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులివ్వగా వారు ఎన్.ములగ పంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ –1లో తవ్వకాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరు తవ్వకాలు చేపడుతున్న ప్రాంతం రిజర్వు ఫారెస్టులో ఉందంటూ పార్వతీపురం పట్టణానికి చెంది పట్లాసింగ్ రవికుమార్, ములగ ప్రకాష్ అనే వ్యక్తులు హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్‌ను స్వీకరించిన హైకోర్టు బడేదేవర కొండపై పూర్తి సర్వేచేసి నివేదికను సమర్పించాలని రాష్ట్ర అధికారుల బృందాన్ని ఆదేశించింది. ఇందులో బాగంగానే సోమవారం సర్వే సెటిల్మెంట్సు కమిషనర్ విజయమోహన్, సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకుడు గోపాలరావు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ సర్వే డి.బి.డి.బి.కుమార్, మైన్స్ డీడీ శ్రీధర్, ప్రిన్సిపల్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్టు పి,కె.సారంగి, విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు రాహుల్ పాండే, డీడీ హెడ్‌క్వార్టర్ ఏ.వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఏ.వి.ఎస్.ప్రసాద్, డీఎఫ్ఓ జి.లక్ష్మణరావు, ఆర్డీఓ గోవిందరావు, తహసీల్దార్ అజూరఫీజాన్ బడేదేవర కొండను సందర్శించారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన రికార్డులను, మ్యాప్‌లను పరిశీలించారు. పాకలో చర్చలకే పరిమితం స్పెషల్ కమిషనర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ సీహెచ్.విజయ్‌మోహన్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ బృందం బడే దేవరకొండ పరిసరాలను గానీ... కొండపై తవ్వకాలను గానీ పరిశీలించలేదు. కొండదిగువ ఉన్న ఒక పాకలో వారంతా కూర్చొని రికార్డులను, మ్యాప్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడే అధికారులు చర్చించుకున్నారు తప్ప వారు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదు. కాగా దీనిపై మరోసారి సర్వే చేపట్టాలని అనంతరమే నివేదిక సమర్పించగలమని.. ఇందుకోసం మరో మరో 45 రోజులు గడువు కోసం హైకోర్టును అభ్యర్థించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
గ్రానైట్ స్కాంలో అధికారులు
- విచారణకు పట్టు - సహాయంకు భద్రత పెంపు సాక్షి, చెన్నై : గ్రానైట్ స్కాంలో మదురై కేంద్రంగా గతం లో పనిచేసిన అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు బయలు దేరాయి. వారందర్నీ విచారించాల్సిందేనని సహాయం కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక, సహాయం కమిటీ రహస్య విచారణలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు బయటకు పొక్కుతున్నట్టు అనుమానాలు ఉన్నారుు. ఈ నేపథ్యంలో సహాయంకు భద్రతను పెంచారు. మదురై కేంద్రంగా సాగిన గ్రానైట్ స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు వేల కోట్ల స్కాంలోని తిమింగళాల భరతం పట్టడం, ప్రభుత్వానికి గండి పడ్డ ఆదాయాన్ని కక్కించడం లక్ష్యంగా ఐఏఎస్ సహాయం కమిటీ రంగంలోకి దిగింది. ఈ కమిటీ తన విచారణను వేగవంతం చేసింది. మదురైలో తిష్ట వేసి ఉన్న సహాయంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ ప్రాంతాల్లో అంటే తమ ప్రాంతాల్లో భారీగా గ్రానైట్ తవ్వకాల రూపంలో నష్టాలు జరిగినట్టు బాధితులు తీవ్ర ఆవేదనతో ఫిర్యాదుల్ని అందజేస్తూ వస్తున్నారు. శుక్రవారం వామపక్షాల నేతృత్వంలో పలువురు సహాయంకు వినతి పత్రం అందజేశారు. ఈ వేల కోట్ల స్కాంలో అధికారుల హస్తం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశా రు. గతంలో మదురై కేంద్రంగా పనిచేసి బదిలీ మీద మరో చోట పనిచేస్తున్న అధికారులు, రిటైర్డ్ అధికారుల ప్రమేయం తప్పకుండా ఉండి ఉంటుందని ఆరోపించారు. అధికారుల అండదండలతోనే ఈ స్కాం సాగి ఉంటుందని, వారిని సైతం విచారించాలని ఆ కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇక, బాధితులు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని స్వీకరించిన సహాయం, వారి వాదనల్ని రహస్యంగా నమోదు చేసుకునే పనిలో పడ్డారు. భద్రత పెంపు ఐఏఎస్ అధికారి సహాయం నిక్కచ్చితనానికి మారు పేరు. విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి నందుకు గాను అనేక బదిలీ ఉత్తర్వుల్ని అందుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వేల కోట్ల స్కాం విచారణ ఆయనకు అప్పగించడంతో దాని వెనుక ఉన్న బడబాబులు, రాజకీయ నాయకుల్లో గుబులు పట్టుకుంది. ఆయన విచారణ ఏ విధంగా సాగుతున్నదో, ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారో, ఆయనకు ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయోనన్న వివరాలు బయటకు పొక్కుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సహాయంకు తెలి యకుండా అదృశ్య శక్తులు ఎవ్వరో ఆయన విచారణ శైలిని పసిగట్టే పనిలో పడ్డట్టు ఆరోపణలు బయలు దేరాయి. ఎవరో కొందరు ఆయన విచారణను టాంపరింగ్ చేసి పెద్ద చేపలకు అందజేస్తున్నట్టు అనుమానాలు బయలు దేరాయి. దీంతో సహాయం భద్రతపై ఆందోళన నెలకొంది. ఆయన విచారణ లీక్ కాని రీతి లో, ఆయనకు ఎలాంటి ప్రమాదం తలెత్తని విధంగా గట్టి భద్రతను కల్పించారు. ఇద్దరు గన్మెన్లు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ఆయ న భద్రతకు రంగంలోకి దించి ఉన్నారు. మరో కేసు ఓ వైపు సహాయం కమిటీ విచారణ సాగిస్తుంటే, మరో వైపు మరో గ్రానైట్ మోసానికి సంబంధించిన మదురై మేలూరు సమీపంలోని కీల్ వలపు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణగిరికి చెందిన రాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గ్రానైట్ పాలిషింగ్ పేరిట కీల్ వలపులో ఓ ప్రైవేటు సంస్థ చాప కింద నీరులా గ్రానైట్ తవ్వకాలు సాగుతున్నట్టుగా ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, రాజా మదురై హైకోర్టును సైతం ఆశ్రయించారు. అప్పుడు స్పందించని పోలీసులు సహాయం కమిటీ రంగంలోకి దిగడంతో ఉరకలు తీస్తూ కేసులు పెట్టడం గమనార్హం.